Tomato Products: కూరగాయల్లో టొమాటో ప్రధాన మైనది. ఇది ఉపయోగించని వంట కాలు వచ్చు. టొమాటోలు ఎరుపు రంగును, పులుపు రుచిని కలిగి వంటకాలకు మంచిరంగును ఇస్తాయి. లైకోపిన్ అనే రసాయనిక పదార్థం వల్ల టొమాటోలు ఎరుపు రంగులో ఉంటాయి.టొమాటోను కూరగాయగానే కాకుండా సూప్, జ్యూస్, కెచప్, సౌందర్య సాధనాల్లో విరివిగా వాడుతున్నారు. టొమా ‘సి’ విటమిన్తో పాటు లైకోపిన్, బీటాకెరోటిన్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
సాధారణంగా మార్కెట్లో కొన్ని మాసాల్లో టొమాటో పండ్లు విరి విగా, చౌకగా లభిస్తాయి. ఈ సమయంలో పంట దిగుబడి విపరీతంగా పెరిగి రైతులకు కోతకూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు గాక నష్టా లకు గురువుతున్నారు. కోయకుండా పొలాల్లోనే వదిలేయడం, పశువులకు మేపడం, రోడ్ల పక్కన పారబోయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో టొమాటో పండ్లనుంచి వివిధ రకాల నిల్వ పదార్థాలను తయారు చేసు కుంటే ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. దీన్ని చిన్న కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు.
టొమాటో గుజ్జు: బాగా రంగువచ్చిన టొమాటో పండ్లను పుచ్చులేకుండా ఏరి, శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి. మెత్తగా ఉడికించి గుజ్జును వడగట్టుకోవాలి. ఒక కిలో గుజ్జుకు 5గ్రా. చక్కెర, 5 గ్రా. ఉప్పు, 5 మి.లీ. వెనిగర్ను కలిపి ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు పొంగును తీసి అడుగంటకుండా గరిటెతో కలియబెడుతూ వీలైనంత వరకు గుజ్జులా అయ్యేవరకు చిక్కబరచాలి. ఇలా మూడింట ఒకవంతు వరకు అనగా ఉన్న పదార్ధంలో మూడోవంతుకు తగ్గేదాకా చిక్కబడేలా చేసి కిలో గుజ్జు/ప్యూరీకి 300 మి.గ్రా. సోడియం బెంజోయేట్ అనే నిల్వకు ఉపయోగపడే రసాయ నాన్ని కలపాలి. గుజ్జు/ప్యూరీని సీసాల్లో నింపి, మూతలు గట్టిగా బిగించి, చల్లని ప్రదేశంలో భద్రపరచుకోవాలి.
టొమాటో జామ్: బాగా రంగువచ్చిన టొమాటో పండ్లను పుచ్చులేకుండా ఏరి, శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి. మెత్తగా ఉడి కించి గుజ్జును వడగట్టుకోవాలి. ఒక కిలో గుజ్జుకు 250 గ్రా. చక్కెర, 50 గ్రా. లిక్విడ్ గ్లూకోజ్ను కలిపి ఉడక నివ్వాలి. ఉడుకుతున్నప్పుడు పొంగును తీసి అడుగంటకుండా గరి టెతో కలియబెడుతూ వీలైనంత వ రకూ గుజ్జులా అయ్యేవరకు చిక్క రచాలి. వరకు ఇలా మూడింట ఒకవంతు అనగా ఉన్న పదార్థంలో మూడోవంతుకు తగ్గేదాకా చిక్కబ డేలా చేసి కిలోగుజ్జుకు 295 మి. గ్రా. సోడియం బెంజోయేట్ అనే నిల్వ రసాయనాన్ని కలిపి చల్లా ర్చాలి. బాగా శుభ్రంగా కడిగిన జాడీల్లో నింపి మూతలు గట్టిగా బిగించి భద్రపరచుకోవాలి. ఇలాతయారుచేసిన జామ్ కొద్దినెలల వరకు చెడిపోకుండా ఉంటుంది.
Also Read: Tomato Benefits: టమాటో ఉడకబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు.!
టొమాటో కెచప్ : కెచప్ తయారీలో కిలో టొమాటో గుజ్జుకు 50గ్రా. చక్కెర, 50మి. లీ. వెనిగర్, 15గ్రా. ఉప్పు, 15గ్రా తరిగిన ఉల్లిపాయలు, 10గ్రా. వెల్లుల్లి, 20గ్రా. మిర్చిపొడి, 5గ్రా. మిరియాలు, 10గ్రా. జీలకర్ర, 5 గ్రా. యాలకులు, 5గ్రా. దాల్చిన చెక్క, 10 జాపత్రి ఆకులతో పాటు కిలో కెచప్కు 295 మి.గ్రా. సోడియం బెంజోయేట్ కావాలి.
తయారీ: బాగా రంగువచ్చిన టొమాటో పండ్లను పుచ్చులేకుండా ఏరి, శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి. మెత్తగా ఉడికించి గుజ్జును వడగట్టాలి. చక్కె రలో మూడోవంతు భాగాన్ని గుజ్జుకు కలిపి మిగిలినది పక్కన ఉంచుకో వాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలను కలిపి దంచుకొని తెల్లటి బట్టలో మూటగట్టాలి. మసాలా మూటను గుజ్జులో మునిగేలా ఉంచి గరిటెతో కలుపుతూ ఉడికించాలి.
టొమాటో గుజ్జు మూడోవంతుకు మరిగిన తర్వాత మసాలా మూటను తీసేసి రసాన్ని గుజ్జులో బాగా పిండాలి. మిగిలి చక్కెర, ఉప్పును గుజ్జుకు కలిపి కొన్ని నిమిషాల పాటు ఉడికించాలి. చివ రిగా వెనిగర్ను కలిపి కొన్ని నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. చల్లా రిన తర్వాత సోడియం బెంజోయేట్ కలిపి సీసాల్లో నిల్వ ఉంచుకోవాలి.
Also Read: Fusarium Wilt in Tomato: టమాట ఫ్యుసేరియం వడలు తెగులును ఇలా నివారించండి.!
Also Watch: