Intercropping: రైతులు ఈ మధ్య కాలంలో మంచి దిగుబడి, లాభాల కోసం అంతర పంటలను పండిస్తున్నారు. అంతర పంటలుగా పండ్లు, కూరగాయల పంటలు, వాణిజ్య పంటలు ఇలా ఏ పంటలు అయిన పండించుకోవచ్చు. అంతర పంటలు వెయ్యడం ద్వారా పొలంలో కలుపు మొక్కలు కూడా తగ్గుతాయి. పంటల దిగుబడి కూడా బాగుంటుంది. అంతర పంటలు సాగు చెయ్యడం వల్ల రైతుకి ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యవసాయంలో మంచి ఫలితాలని సాధించాలి అని బిక్రమ్‌జిత్ సింగ్ రైతు తనకి ఉన్న పొలంలో అంతర పంటలు వేశారు.
అంతర పంటలు సాగు చెయ్యడానికి ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జర్మనీ దేశాలు వెళ్లి సాగు విధానాలని నేర్చుకున్నాడు. బిక్రమ్‌జిత్ సింగ్ 11 ఎకరాలో సాగు చేస్తున్నాడు. అంతర పంట ద్వారా 2 లక్షల వరకు లాభాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు అంతర పంటలకు మంచి లాభాలు రావడంతో రాబోయే రోజులో అంతర పంటల సాగు పెంచుతున్నారు.
Also Read: Sheep Farming: పొటేళ్ల పెంపకంలో భారీ లాభాలు ఎలా సంపాదించుకోవాలి..?
తన పొలంలో మామిడి, జామ, లిచ్చి , బెర్రీల, బొప్పాయి పండ్ల తోట పెట్టారు. ఈ మొక్కల మధ్య పెసలు, అరటి, మొక్కజొన్న, టమోటా, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఈ తోటలో సుమారు 600 జామ చెట్లు ఉన్నాయి. మొక్కజొన్న మొక్కల మధ్య లిచ్చి పండ్లని సాగు చేస్తున్నారు.
ఒకే పొలం ఎక్కువ రకాల పంటలను పండించడం వల్ల బిక్రమ్‌జిత్ సింగ్ రైతుకి మంచి ఆదాయం వస్తుంది. లిచ్చి పండ్ల మొక్కలని నాటిన 5 సంవత్సరాల తర్వాత పండ్లు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు లిచ్చి పండ్ల ఆదాయం లేదు. ఇందులో అంతర పంటగా మొక్కజొన్న వెయ్యడం ద్వారా మంచి లాభాలను పొందారు. ఇలా ఒకే భూమిలో అంతర పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది.
Also Read: Bottle Gourd Cultivation Income: సొరకాయ సాగులో ఎక్కడి రైతులకి మంచి లాభాలు.!