Papaya Farming: సంప్రదాయ పంటల సాగుతో రైతులకి లాభాలు సరిగా రాకపోవడంతో పంటలో, పంట పొలంలో అనేక మార్పులతో వ్వవసాయం మొదలు పెట్టారు. సంప్రదాయ పంటలతో పండ్ల తోటలు సాగు చేయడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పద్దతిలో నాగర్ కర్నూల్ జిల్లా శేఖరయ్య రైతు బొప్పాయి పంట సాగు చేసారు. బొప్పాయి పంటతో కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఈ రెండు అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి.
బొప్పాయి పంట 5 నెలలో పూతకు వచ్చి, 6 నెలలో కాయలు రావడం మొదలు అవుతుంది. బొప్పాయి పండ్లు వెంటనే అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. నిల్వ ఉంచడం వల్ల పండ్లు నాణ్యత తగ్గి తక్కువ ధరకి పోతాయి. మంచి ధర ఉండాలి అనుకుంటే పండ్లు కోసిన వెంటనే అమ్ముకోవాలి.
Also Read: Elephant Foot Yam: ఈ పంటను అరటి తోటలో అంతర పంటగా సాగు చేస్తే లాభాలు గ్యారెంటీ.!
శేఖరయ్య గారు ఆరు ఎకరాల్లో బొప్పాయి పంటను సాగుతో పాటు కూరగాయలు , ఆకుకూరలు పెంచుతున్నారు. బొప్పాయి పంటకి పెట్టుబడికి 13 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఎరువులు వాడకుండా ఆర్గానిక్ పద్దతిలో పంట సాగు చేస్తున్నారు. ఈ పంటలతో పాటు పశువులను పోషిస్తున్నాడు. వాటి నుంచి వచ్చే పేడని ఎరువుగా చేసి పంట పొలాల్లో వాడటం వల్ల పంట మంచిగా పెరుగుతుంది. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కిలో 50-60 వరకు ధరతో వస్తుంది. శేఖరయ్య గారు అతని తోట వద్ద కిలో పండ్లు 40కి అమ్ముతారు.
గత సంవత్సరం మామిడి తోటలో అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల చాలా నష్టాలు రావడంతో ఈ సంవత్సరం బొప్పాయి పంటతో పాటు కూరగాయలు వేయడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి. బొప్పాయి పంటకి వర్షాలు అధికంగా లేకపోతే ఇంకా మంచి ఆదాయం వచ్చేది. శేఖరయ్య గారు పండించిన పంటను తోట దగ్గర పంటను అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు, పండు నాణ్యతో ఉంటుంది.
Also Read: ANGRAU: ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విత్తన మహోత్సవం