Grape Vines: ద్రాక్ష దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన దేశంలో ద్రాక్ష పంటను మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ద్రాక్ష పంట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో సాగు చేయబడుతుంది.
ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే పండ్లలో ద్రాక్ష ఒకటి. ఎందుకంటే దీనిని ఆరోగ్య ప్రసాదినిగా భావించి తాజా పండుగానే కాకుడా వైన్, జ్యూస్, ఎండుద్రాక్ష గాను తీసుకుంటారు. ద్రాక్ష ఉపయోగాల గురించి క్రీస్తుపూర్వం 1356 1220 మధ్య రాయబడిన ‘సుశృత సంహిత’ మరియు ‘చరక సంహిత’ వైద్య గ్రంథాలలో వివరించటమైనది. ద్రాక్షలో Ca, P, మరియు బి1, బి2 విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి.
Also Read: Grape Cultivation: ద్రాక్ష సాగులో మెళుకువలు.!
నాటు పద్ధతి: నేల, నీరు బాగున్న చోట ఫిబ్రవరి /మార్చి మాసంలో 9′ × 5′ దేరంలో వేరు వచ్చిన కొమ్మ కత్తిరింపులను నాటుకోవాలి. కొంతమేరకు సమస్యాత్మక భూములలో అయితే ఈ సమస్యలను తట్టుకొనే వేరుమూలాన్ని నాటి సెప్టెంబర్ / అక్టోబరు మాసంలో దానిపై వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో కావల్సిన రకంతో అంటు కట్టుకోవాలి. లేదా అంటు కట్టిన మొక్కలనే నేరుగా నాటుకోవచ్చు. తెలంగాణ చాలా మంది ద్రాక్ష రైతులు డాగ్రిడ్జ్ వేరు మూలంపై థామ్సన్ సీన్లెస్ అంటు కట్టి ద్రాక్షను సాగు చేస్తున్నారు. 60x60x60 సెం.మీ. (2’x2x2) గుంతలను తీసి నాటు కోవాలి. గుంతలకు 500 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు భూసార పరీక్షను సారంగా సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని 20 కిలోల పెండ ఎరువును, చెదల నివారణకు ఫోరేట్ 10 గ్రా. వంటి చెదల మందును కలిపి గుంతలను మూసుకోవాలి.
తీగలను పాకించే విధానం: ద్రాక్షలో తీగలను “వై” (ఖ) పద్ధతిలో పాకించడం వలన ద్రాక్ష మొక్కలు కత్తిరించడానికి, సస్యరక్షణ మందులను పిచికారీ చేయటానికి, పండ్లు కోయటానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “వై” (ఖ) పద్ధతి, మామూలు పందిరి పద్ధతికన్న అనువుగా ఉంది. బాగా దృఢంగా, ఏపుగా పెరిగే తీగెను ఎన్నుకొని, దానికి ఒక బొంగును ఊతమిచ్చి పందిరి మీదికి ఎక్కించాలి. ఆకు మొదలులో వచ్చే చిరుకొమ్మలను (చిగురు) తుంచాలి. ముఖ్యంగా ప్రాకించే (ఆకుమొగ్గ) తీగను, పందిరికి 15 సెం.మీ. దగ్గరలో ఉన్నప్పుడు కాండపు కొనను గిల్లాలి. రెండు తీగలు వస్తే వాటిని ఎదురెదురుగా ఉండేటట్లు పందిరి ఇనుప తీగల మీదకు పాకించాలి. ఈ రెండు పిలకలు ముఖ్యమైన కొమ్మలుగా తయారవుతాయి. వీటి నుండి మరల ప్రక్క కొమ్మలు 40-45 సెం.మీ. దూరంలో ఉండేటట్లు పెంచాలి. ముఖ్యకొమ్మలను తూర్పు పడమర దిశల్లో ప్రాకించటం వలన సూర్యరశ్మి తాకిడి నుంచి పంటను రక్షించవచ్చు.
Also Read: Pruning Grapes: ద్రాక్షలో కత్తిరింపులతో లాభాలు