Mango Fruit Orchards: మామిడి – మామిడి సాగుకు నేల ఉదజని సూచిక 7.5-8 మధ్య ఉండాలి. ఉప్పు, చౌడు, సున్నం, నీరు నిల్వ ఉండే నేలల్లో మామిడి నాటరాదు. మొక్కలు జూన్ -డిసెంబరు వరకు నాటవచ్చు. వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో జూన్ -జూలై, అధిక వర్షపాత ప్రాంతాల్లో అక్టోబరు -నవంబరు మాసాల్లో 7-10 మీ. ఎడంగా నాటలి. అధిక సాంద్రత పద్దతిలో 15×15 లేదా 18×18 అడుగులు ఎడంగా నాట్టుకోవచ్చు.ప్రతి గుంతకి 50 కి. పశువుల ఎరువు, 2కి సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 100 గ్రా. ఫాలిడేల్ 2% పొడి కలిపి గుంత నింపాలి.

Mango Fruit Orchards
రకాలు : కోత రకాలు :- బంగినపల్లి తోతా పురి, సువర్ణరేఖ, దశేరి, కేసర్, నీలం, హిమాయత్, ఆల్ఫ్నోస్ పులిహోర.
రసాలు :- పెద్ద రసం, చిన్న రసం చేరకురసం, నవనీతం.
ఊరగాయ రకాలు :- జలాల్, ఆమిని, చిన్నరసం, తెల్లగులాబి.
సంకర రకాలు :- మంజీర, దశేరి మహాముదా, నీల్ గోవా, మల్లిక, రత్నా, సింధు, ఆమ్రపాలి, ఎ. యు. రు మూని, అర్కపునీత్.
పునాస రకాలు :- రాయల్ స్పెషల్, అల్లిపసంద్, బారమాసి , బొబ్బిలి పునాస రకాలున్నాయి. ఎరువులు :- ఏడాది వయస్సున్న ఒక్క చెట్టుకు 100 గ్రా. చొప్పున ఎన్. పి. కె. ఎరువులు వేయాలి. ఏటా 100 గ్రా. చొప్పున వీటి మోతాదును పెంచుతూ పదేళ్లు, ఆ పై వయసు నుంచి ఒక్కో చెట్టుకు 2.2 కి. యూరియా, 3 కి సూపర్ ఫాస్ఫేట్, .1.6 కి ఆఫ్ పోటాష్ ఎరువులు వేయాలి.
Also Read:Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!
చీనీ నిమ్మ :- చీనీలో సాత్ గుడి రకంతో పాటు కోస్తాలో బటావియన్, తెలంగాణలో మోసంబి రకాలు సాగుచేస్తున్నారు. నిమ్మలో కాగ్జినిమ్మ శ్రేష్ఠం. గజ్జి తెగులు తట్టుకునే బాలాజి, పెట్లూరు సెలక్షన్-1 నిమ్మ రకాలు సాగుచేయాలి.
సాగు :- రంగాపూర్ నిమ్మ మీద అంటగట్టిన 6-10 నెలల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి వైరస్, వేరుకుళ్ళు, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. జంబేరి మీద అంటగట్టిన మొక్కలు నాటరాదు. 6×6 లేదా 8×8 మీ. ఎడంగా మొక్కల్ని జూన్ – ఫిబ్రవరిలో నాటాలి.
పూత, పిందె రాలుడు :- నివారణకు పూత, పిందె దశలో వంద లీటర్ల నీటికి 1 మీ. లీ. ప్లానోఫిక్స్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చీనీ మొక్కలు నాటిన తర్వాత కాపు కోస్తాయి. చీనీ, నిమ్మపండ్లను 24-72 గంటల పాటు ఇధలిన్ వాయువుకు గురిచేసి మంచిరంగు వచ్చేలా చేయవచ్చు. తాజా పండ్లను 14 డి. సెం. గ్రే. వద్ద 5-6 వరాలు నిల్వ చేయవచ్చు. సస్యరక్షణ :- ఆకుమడత పురుగుకు ఇమిడాక్లోప్రిడ్0.3 మి. లీ./ లీటర్ లేదా థయోమిథక్స్ 1గ్రా. లీ వేరు కుళ్ళు సోకిన చెట్లలకు పూత ఎక్కువగా వచ్చి, కాయలు ముదిరే లోపు చెట్లు ఎండిపోతాయి. దీని నివారణకు నీరు పెట్టిన మరుసటి రోజు పోదాలలో మంకోజెబ్ 2.5 గ్రా. లీటర్ నీటికి పిచికారీ చేయాలి.

Types of Mangoes
Also Read:Nutrient Management in Mango: మామిడి పంట లో ఎరువుల యాజమాన్యం.!
Also Watch: