Tomato Staking Method: గత వారం రోజులుగా టమాటా ధర పెరుగుతూ ఉంది. టమాటా పంట సాగు చేసుకున్న రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. కానీ ఎక్కువ వర్షాలు కురవడంతో టమాటా పంటల దిగుబడి కూడా తగ్గింది. కొంచం వర్షాలు ఎక్కువ ఉన్న టమాటా పంట దిగుబడి తగ్గకుండా బాపట్ల జిల్లా చిన్నకొత్తపల్లి రైతులు స్టేకింగ్ పద్దతిలో సాగు చేస్తున్నారు.
టమాటా మొక్క సాధారణంగా నిటారుగా నిలబడదు. ఈ మొక్క పెద్దగా పెరిగిన కొంచం పెరిగికి భూమి చుటూ పాకుతున్నటు పెరుగుతుంది. మొక్క భూమి పై పడటం వల్ల టమాటా పండ్లు భూమికి తగిలి పడు అవుతాయి. మొక్క కూడా సరిగా పెరగదు. దాని వల్ల దిగుబడి కూడా తగ్గుతుంది.
ఈ స్టేకింగ్ పద్దతిలో పొలంలో ఒక మీటర్ లేదా మెటర్నర దూరంలో కర్రలు పాతుకుంటారు. ఈ కర్రలకి ఒకొక్క అడుగు దూరంలో ధారలు కడుతారు. ప్రతి టమాటా మొక్కని క్లిప్ ద్వారా ఈ ధారాలకి పెడతారు. దాని వల్ల మొక్క నిటారుగా నిల్చుంటాది. దాని వల్ల మొక్క తొందరగా పెరుగుతుంది. మొక్కల మధ్య గాలి కూడా వీచి దిగుబడి కూడా పెరుగుతుంది.
Also Read: Honey Adulteration Test: తేనెలో కల్తీని గుర్తించడం ఎలా..?
రైతులు ఇంతక ముందు మొక్కలని క్లిప్స్ ద్వారా కాకుండా ధారాల ద్వారా కర్రకి ఉండే ధారానికి కట్టే వాళ్ళు. ఇలా కట్టడానికి చాల సమయం వృధా అవుతుంది. ఒక్కసారి వాడిన ధారామ్ మళ్ళీ వాడడానికి రాదు. దారామ్ గట్టిగా కడితే మొక్కలు తెగిపోయే అవకాశం ఉంది.
ఈ క్లిప్స్ మొక్క కొమ్మకి పెట్టి లాక్ చేయాలి. క్లిప్ లాక్ చేయడం, పంట పూర్తి అయ్యాక క్లిప్ తీయడం చాలా సులువు. క్లిప్ లాక్ వేయడం ద్వారా మొక్క కింద పడకుండా ఉంటుంది. ఈ క్లిప్స్ చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఒక పంట కాలం పూర్తి అయ్యాక మళ్ళీ పంటకి కూడా ఈ క్లిప్స్ వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా కూలీలా ఖర్చు తగ్గుతుంది. పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుంది.
Also Read: Curry leaves Cultivation: కరివేపాకు సాగుతో రైతులకి బారి లాభాలు ఎలా సంపాదిస్తున్నారు.. ?