Carrot Cultivation: పెరుగుతున్న ధరలు చూసి రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు పండించాలి అనుకుంటున్నారు. వాణిజ్య పంటలు అంటే ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలే కాకుండా క్యారెట్ కూడా సాగు చేస్తున్నారు. క్యారెట్ పంట ఎక్కువగా ఉత్తర భరత్లో పండించే వాళ్ళు. ఇప్పుడు మన ప్రదేశంలో కూడా పండిస్తున్నారు. క్యారెట్లో ఎక్కువ పోషక విలువలు చూసి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇతర రాష్ట్రలో రైతులు కూడా సాగు చేస్తున్నారు.

Carrots
క్యారెట్ పంటని వికారాబాద్ జిల్లాలో, యబ్బానుర్ గ్రామంలో వెంకటేష్ రైతు సాగు చేస్తున్నారు. ఇతను రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటని ఎక్కువగా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలు పెడతారు. క్యారెట్ పంట మూడు నుంచి నాలుగు నెలలో కోతకు వస్తుంది.

Carrot Cultivation
క్యారెట్ పంటలో మొక్కల మధ్యలో దూరం 7-8 సెంటి మీటర్లు ఉంటుంది. వరుసల మధ్య దూరం 45 సెంటి మీటర్ల దూరం ఉంటుంది. వరుసల మధ్య ఎక్కువ దూరం ఉండటం వాళ్ళ గాలి, వెలుతురు మొక్కలకి మంచిగా అందుతుంది. ఈ రైతు క్యారెట్ పంటలో షాలిని, టోకిట కరోడా రకాల విత్తనాలని వేశారు.

Cultivation Of Carrot
ఒక ఎకరంలో దుగుబడి 15 టన్నుల వరకు వస్తుంది. క్యారెట్ ధర కిలో 40-50 రూపాయలకి అమ్ముతున్నారు. మొత్తం పెట్టుబడి తీసివేసాక కూడా రైతులకి సుమారు 5 లక్షల వరకు లాభాలు వస్తాయి.
Also Read: Organic Fertilizers: నేల జీవం పెంచే జీవన ఎరువుల వాడకం – వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత.!