Increase Banana Yield: అరటి తోటల సాగు మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. అరటి ఉష్ణమండలపు పంట సరాసరి 25-30 సెం.గ్రే. ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం 10 డిగ్రీ సెంటీగ్రేడ్ లోపు నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉష్ణోగ్రతలో గెలలో పెరుగుదల ఉండదు, అధిక ఉష్ణోగ్రతలో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఎదుగుదల ఆగిపోతుంది. ఏటా 500-2000 మి.మీ. వర్షపాతం అవసరం సముద్రమట్టానికి 2000మీ. ఎత్తులో అరటి బాగా పండుతుంది.
సారవంతమైన తగినంత నీటి వసతి కలిగి నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్ఠము. అయితే ఇంక మన్ను ఎక్కువగాను సున్నపు పొరలు ఉన్న రాతి నేలలు సాగుకి పనికిరావు. నేల 1-1.5 మీటర్ల లోతు ఉండి పి.హెచ్ విలువ 6.5-7.5 ఉండటం మంచిది.
పిలకల దుంపలకు ఏమైనా దెబ్బ తగిలితె ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతుకోవాలి అవి త్వరగా నాటుకొని బాగా పెరుగును. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు ఉంచిన పిమ్మట నాటాలి. అరటి ముక్కు పురుగు అధికంగా గల ప్రాంతాలలో పిలకలను 0.1% మెటాసిస్టాక్స్ ద్రావణంలో ముంచి నాటడం మంచిది. తోట వేయవల్సిన నేలను బాగా దున్ని 10-15 రోజుల పాటు అట్లాగే ఉంచి తర్వాత నేలను చదును చేసుకోవాలి.
నిర్ణయించిన దూరంలో 45 సెం.మీ.ల గోతులు తవ్వాలి. సాధారణంగా పొట్టి రకాలకు 1.5 మీటర్ల పొడవు రకాలకు 2 మీటర్ల దూరంలో గోతులు తీసి నాటాలి. వర్షాకాంలో అనగా జూన్-జూలై మాసాలలోనే నాటుతారు. నీటివసతిని అనుసరించి అక్టోబర్, నవంబర్ మాసం వరకు నాటవచ్చును. నాటే ముందు గుంతలో పశువుల ఎరువు 5 కేజీలు, 5 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు వేసి గుంత నింప వలెను. తరువాత పిలకలను గుంత మధ్యలో దుంప 2 అడుగుల పిలకలు భూమిలో కప్పబడి ఉండేటట్లు నాటవలెను. నాటిన పిమ్మట పిలకచుట్టు మట్టిని బాగా కప్పవలెను. అరటి పిలకలు నాటిన 10-15 రోజులకు వేర్లు తొడుగును. అలా కాని యెదల 20 రోజుల తరువాత నాటిన పిలకల స్థానంలో కొత్త పిలకలు నాటవలెను.
జంట వరుసల పద్దతి:
ఈ మధ్య కాలంలో అరటి మొక్కలకు జంట పద్ధతిలో నాటుకున్నారు. ఈ పద్ధతిలో మొక్కలను అధిక సాంద్రతలో నాటి తద్వారా భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకొని అధిక ఫలసాయం పొందవచ్చును. తెల్ల చక్కెరకేళి, గ్రాసేన్, రోబస్టా రకాలను 1.2×1.2×2 మీటర్ల దూరంలో వామన కేళి రకాన్ని 1x1x1.8 మీటర్ల, (వరుసల మధ్య × మొక్కల మధ్య X (జంట వరుసల మధ్య) జంట వరుసల్లో నాటేటపుడు వరుసల మధ్య దూరం 1.2 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. రెండు జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా 2 మీటర్లు ఉండాలి. ముందు వరుస మొక్కల మధ్యకు వచ్చే విధంగా నాటాలి. ఎరువులు సిఫార్సు చేసిన విధంగా ప్రతిమొక్కకు ఇవ్వాలి. అధిక సాంద్రతలో నాటినప్పుడు పంట కాలపరిమితి 40-50 రోజులు పెరుగుతుంది. ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. జంట వరుసల మధ్యనున్న ఖాళీ భూమిలో 100-120 రోజుల కాలపరిమితి గల అంతరపంటలుగా ఆకుకూరలు క్యాబేజీ, కాలీఫ్లవర్ మొక్కజొన్న మొక్కలు సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
Also Read: Rayalaseema Drought: రాయలసీమలో తీవ్రమవుతున్న కరువు
ఎరువులు:
తోట నాటే ముందు వేసే సేంద్రియ ఎరువులే కాక ఆ తర్వాత రసాయనిక ఎరువులు కూడా అరటికి అవసరం అవుతాయి. ప్రతి మొక్కకు 200-250 గ్రాముల నత్రజని 30-40 గ్రాముల భాస్వరం, 200-250 గ్రాముల పొటాషియం అవసరం. భాస్వరం ఎరువును దుక్కిలో వేసి దున్నాలి. నత్రజని పొటాష్ ఎరువులు 6 సమభాగాలుగా చేసి నాటిన 35 వ రోజు మొదలు 46 రోజుల వ్యవధిలో వేస్తూ వుండాలి. ఎరువులు వేసిన ప్రతిసారి నీరు కట్టాలి.
అంతర కృషి:
ప్రతీ 15-20 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను కనీసం 4 నెలల వరకు తీసివేస్తుండాలి. తోటలో మినుము, అలసంద కూరగాయల అంతర పంటలుగా వేసుకోవచ్చు. నీటి తడులు నాటిన వెంబడే, వారంనకు ఒకసారి చొప్పున పంట కాలంలో దాదాపు 40 నీటి తడులు యివ్వాలి. అరటికి నీరు చాలి అవసరం. అయినప్పడికి మొక్కల మొదళ్ళ మధ్య నీరు నిల్వ ఉండకూడదు. తోటకు తగినంత నీరు పెట్టని యెడల ఆలస్యంగా గెల తొడుగుట, చిన్న గెలలు వేయుట. గెలలు ఆలస్యంగా పక్వానికి వచ్చుట, పండ్లు నాణ్యంగా లేకపోవుట సంభవిరజను.
తదుపరి జాగ్రత్తలు:
1. అరటి నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి అవుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను, 20-25 రోజుల కొకసారి కోసి వేయాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయటం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తిరిగి ఎదగదు.
2. రెండవ వంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమయిన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి. అరటి నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోయడం వలన చెట్టుకు బలం చేకూరుతుంది.
3. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అరటి చెట్టు గాలి తాకిడిని తట్టుకోవడానికి వెదురు గడలు పాతి ఉంచాలి.
4. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికి వేయాలి.
5. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోస్ వేయాలి.
6. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగిన యెడల పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తాయారు అవుతాయి.
పంట రకం, నాటిన సమయం, భూసారం వంటి వాటిని ననుసరించి 8-10 నెలల్లో పూత గెలపస్తుంది. పూత గెలవేసిన 2-3 నెలల్లో గెల తయారవుతుంది. పూర్తిగా తయారైన పండ్లు గుండ్రంగా ఉండి చేతితో తట్టితో మంచి శబ్దం వస్తుంది. దూర ప్రాంతాలకు పంపేటప్పుడు గెలలను 75%-80% పక్వానికి రాగానే కొయ్యటం మంచిది. మంచిది. గెల తొండం కురచగా ఉండేటట్లు నరకాలి. గెలల చుట్టూ పచ్చి ఆకును చుట్టి రవాణా చేయటం
కాయ పరిపక్వత:
స్థానిక మార్కెట్లలో అమ్మడం కోసం మూడు వంతులు ముదిరిన కాయలను, గుండ్రంగా తయారైనప్పుడు కోయవచ్చును. దూర ప్రాంతాల రవాణా కొరకు 90 శాతం ముదిరిన గెలలను, సుదూర ప్రాంతాల రవాణా కొరకు 75-80 శాతం ముదిరిన గెలలను కోయవచ్చును. గెలలను కోసిన తరువాత జాగ్రత్తలు తీసుకోవాలి. గెలలను కోసిన తరువాత వెంటనే నీడలో ఉంచాలి. ఎండలో ఉంచకూడదు. ఎండలో ఉంచడం ద్వారా కాయల లోపల వేడిమి పెరిగి కాయలు త్వరగా పండటం ప్రారంభిస్తాయి. తద్వారా ఎక్కువకాలం నిలువ ఉంటుంది. వంపు తిరిగిన పదునైన కత్తిని ఉపయోగించి 15 నుంచి 20 కాయలు ఉండినట్లుగా హస్తములను అరటి గెలల నుంచి వేరు చెయ్యాలి. ఈ విధంగా వేరు చేసిన హస్తములను నీటిలో వుంచి సాన పూర్తిగా కారనిచ్చి, బాగా శుభ్రపరచాలి.
కాయలను శుభ్రపరచుటకు 0.5 గ్రాముల బావిస్టన్ మందును లీటరు నీటికి కలిపినట్లయితే ఎలాంటి శిలీంధ్రములు ఆశించకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. శుభ్రపరచిన అరటి హస్తములను గాలి సోకడానికి వీలు కలిగినటువంటి ఫైబరు బోర్డు పెట్టెలలో ప్యాక్ చెయ్యాలి. లేత కాయలు, బాగా పండిన కాయలను, ముదిరిన కాయలతో కలిపి నిలువ ఉంచరాదు. కాయలను లేదా గెలలను ట్రక్కులు, రైలు పెట్టెల ద్వారా రవాణా చేయునప్పుడు ఒక క్రమ పద్దతిలో గెలలను నిలువుగా అమర్చి, పై గెలల బరువు క్రింద వున్నటువంటి గెలల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సగటున ఒక గెల 8-10 హస్తాలతో 120-150 పండ్లను కల్గిండును. ఒక గెల బరువు 15-22 కేజీలుండి ఎకరానికి 14 టన్నుల దిగుబడి వస్తుంది.
Also Read: Farmer Success Story: అర ఎకరంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాజీ సైనికుడు