Horse gram: ఆంధ్రప్రదేశ్ లో ఉలవ పంటను ఖరీఫ్ లో మొదటి పంట తర్వాత, వర్షాధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనపుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయువచ్చు. ఖరీఫ్ లో వేరుశనగ, నువ్వులు, గోగు, మొట్ట వరి తర్వాత ఏక పంట గాను, రాగి, జొన్న పంటలో సహా పంట గాను వేయువచ్చు.
ఉత్పత్తి:- ఈ పంటను ఆంధ్రప్రదేశ్ లో 0.50ల. హె. విస్తీర్ణంలో సాగు చేస్తూ,0.25 లక్షల టన్నులు ఉత్పత్తి తో 493 కి /హె ఉత్పాదకత తో ఉన్నది.
పంట కాలం:- సెప్టెంబర్ – అక్టోబర్ మాసం లో విత్తుకోవాలి.
నేలలు:- అన్ని రకాల నేలలో చెల్కా,ఎర్ర నల్ల రేగడి, ఈ పంట ను సాగు చేయువచ్చు, మురుగు నీరు నిలువ ఉంటే నేలలు పనికి రావు
నేల తయారు:- ఖరీఫ్ లో మొదటి పంట కోసిన తర్వాత తగినంత తేమ చుచుకొని, నేలను నాగలి తో ఒకసారి , గొర్రు తో రెండు సార్లు మొత్తగా దాన్ని తయారు చేసుకోవాలి.
Also Read: How to Start a Dairy Farm: డెయిరీ ఫారం ప్రారంభించేదెలా ?

Horse gram
విత్తనం, విత్తే దూరం:- గొర్రు తో వరుసలతో విత్తే పద్ధతి లో ఎకరాకు 8710 కిలోలు వెదజల్లే పద్ధతి లో 12-15 కిలోల, విత్తనం సరిపోతుంది. వరసల మధ్య 10 సెం. మీ దూరం పాటించాలి.
ఎరువులు:- ఎకరాకు 4కి. నత్రజని,10కి. భాస్వరం,8 కి. పోటాష్ ని ఇచ్చే ఎరువులను దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి.
అంతర కృషి:- విత్తన 25-30 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు, గొప్పు చేసి కలుపు నివారణ చేసుకోవాలి.
పంట కోత:- కాయలు ముదురు ఎరుపు రంగుకు వచ్చి, ఆకులు పండు బారిన తరువాత, మొక్క తో సహా కొడవలి తో కోసి కల్లంపై ఎండబెట్టవలెను. మొక్కలు ఎండిన తరువాత కర్రలతో కాని, లేదా ఎడ్ల తో గాని బంతి త్రిప్పి గింజలను వేరు చేయాలి.
Also Read: Pest Control Techniques In Groundnut Crop: వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు మరియు వేరు పురుగు నివారణ