సేంద్రియ వ్యవసాయం చేపట్టే రైతులు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులను వినియోగించి అధిక ప్రయోజనాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడితే భూమికి సత్తువ చేకూరుతుంది.
భూమిలో సహజంగా ఉండే కొన్ని రకాల సూక్ష్మ జీవులం సముదాయం మొక్కల ఎదుగుదలకు కావలసిన పోషకాలను, హార్మోన్లను అందిస్తాయి. వీటినే జీవన ఎరువులు అంటారు.
రైజోబియం:
అపరాల పంటల్లో నత్రజని స్థిరీకరణకు ఆయా పంటలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని వాడాలి. ఈ గులాబీ రంగు బుడిపెలు ఏర్పడతాయి. 100 మి.లీ. లీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార, బెల్లం, గంజి పొడి కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిలి. ఈ ద్రావణాన్ని 10 కిలోల విత్తనంపై చల్లి, దానిపై 200 గ్రా. రైజోబియం కల్చర్ వేసి బాగా కలపాలి. విత్తనం పొరలా ఏర్పడే వరకు కలుపుకోవాలి. పంట మార్పిడి కోసం పప్పుజాతి పంటలు వేసేటప్పుడు రైజోబియం ఉపయోగిస్తే భూమిలో నత్రజని నిక్షిప్తమవుతుంది.
అజోస్పైరిల్లం:
ఇది మొక్కవేర్ల చుట్టూ పెరిగే ఒక బాక్టీరియా. లెగ్యూమ్ జాతి పంటలకు తప్ప మిగతా పంటలకు వాడుకోవాలి. వరి, చెరకు, పత్తి, మిరప, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న భూముల్లో బాక్టీరియా చురుకుగా పనిచేస్తుంది. తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ ను 80 – 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చాళ్ళలో చల్లుకోవాలి. నారు నాటుకునే ముందు ఒక కిలో అజోస్పైరిల్లం కల్చర్ ను 100 లీటర్ల నీటిలో కలిపినా ద్రావణంలో 10 నిముషాలు వేర్లు మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. అలాగే చెరకు విత్తన ముక్కలను 10 నిమిషాలు ఉంచి నాటుకోవాలి.
భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు:
రైతులు పొలంలో వేసే భాస్వరం నేలగుణాన్ని బట్టి కొద్ది రోజుల్లోనే మొక్కలకు లభ్యంకాని స్థితికి చేరుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు వాడితే అవి మొక్కలకు భాస్వరం అందేలా సహాయ పడతాయి.
భాస్వరాన్ని అందించే మైకోరైజా:
ఇది శిలీంధ్రపు జాతికి చెందినది. మొక్కలకు భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, రాగి, గంధకం, మాంగనీస్, ఇనుము మొదలగు సూక్ష్మ పోషకాలు అందేలా సహాయపడుతుంది. నెమటోడ్ల బెడదను కూడా నివారిస్తుంది. ఒక ఎకరానికి 5 కిలోలను విత్తన చాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి.
జీవన ఎరువుల వాడకం వలన అధిక ప్రయోజనాలు..
Leave Your Comments