Heliconias Cultivation: వాణిజ్యపరంగా ముఖ్యమైన పూలరకాలలో హెలికోనియా ఒకటి. హెలికోనియా పుష్పాలకు మార్కెట్పరంగా డిమాండ్ అధికంగా ఉంది. ఇంటీరియర్ డెకరేషన్, బొకేలు, శుభకార్యాలలో అలంకరణకు ఎక్కువగా వాడతారు. పుష్పాలు కోసిన తరువాత 7-10 రోజులవరకు తాజాగా వుండటం వల్ల దూర ప్రాంత మార్కెట్లకు అనువైనవి. దేశంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో వీటిని పెంచుతారు. ఈశాన్య రాష్ట్రాలలో 3000-4000 మీటర్ల ఎత్తులో కూడా వీటిని పెంచుతున్నారు.
రకాలు: హెలికోనియా ఆకులు అరటి ఆకుల మాదిరిగా ఉంటాయి. రకాన్ని బట్టి మొక్క 2 అడుగుల నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుంది. పుష్పాలు కొన భాగంలో ఏర్పడి రెండు లేదా అంతకంటే ఎక్కువ పడవ ఆకారపు పుష్పకాలతో పుష్పాక్షం మీద అమరి ఉంటాయి.
Also Read: Milk Production: పాల ఉత్పత్తి పై ప్రభావితం చూపే వివిధ అంశాలు.!
హెలికోనియా స్ట్రిక్టా: దీనినే లాబర్ అని కూడా అంటారు. ఈ పుష్పాలు కొన్ని వారాల వరకు రంగు, రూపాన్ని కోల్పోకుండా తాజాగా అందంగా ఉంటాయి. పుష్పాలు ఎరుపు, బంగారువర్ణం, మెరూన్ మరియు ఆకుపచ్చరంగుల్లో ఉంటాయి. చిన్న లాబర్పూలు నాజుకుగా పొట్టిగా వుండి పెద్దలాబస్టర్స్ కంటే అందంగా ఉంటాయి. పుష్పగుచ్చం 12.5-30 సెం.మీ. పొడవుగా వుండి తక్కువ బరువుతో వుండటం వలన పుష్పాల అలంకరణలో వాడతారు.
హెలికోనియా రోస్ట్రాటా: ఈ జాతి మొక్కలు 1-2.5 మీ. ఎత్తు వరకు పెరుగుతాయి. సంవత్సరం అంతా పుష్పిస్తాయి. పూర్తి సూర్యరశ్మి లేదా 50 శాతం నీడ అనుకూలం. పుష్పగుచ్చాలు 6-10 సెం.మీ. పొడవుండే పుష్పకాలతో స్కార్లెట్రెడ్ కొనలతో పసుపురంగులో ఉంటాయి.
హెలికోనియా సిట్టాకోరం: ఈ మొక్కలు 1-2 మీ. ఎత్తు వరకు ఎదుగుతాయి. బర్ట్ ఆఫ్ పారడైజ్ అనే మొక్కలను పోలివుండే ఈ హెలికోనియాలు చిలక ముక్కుని పోలివుండే చిన్న పుష్పాలను సంవత్సరమంతా ఉత్పత్తి చేస్తాయి.
హెలికోనియా సిట్టాకోరం, సాధోసిర్సినాటా సివి. గోల్డెస్టార్చ్: బంగారువర్ణంలో వుండే పుష్పాలనిచ్చే ఈ రకం మొక్కలు విస్తారంగా సాగుచేయబడుతున్నాయి. పుష్పాలు 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 14-17 రోజులు వరకు తాజాగా ఉంటాయి. పొడవు రకాలు 2.5 మీ. పొట్టి రకాలు 1-2.5 మీ. కన్నా తక్కువ ఎత్తు వరకు పెరుగుతాయి. సూర్యకిరణాలను పోలివుండే పుష్పాలనిచ్చే రకాలను కూడా వృద్ధిచేశారు. పూర్తిగా సూర్యరశ్మిలో నుంచి 40 శాతం నీడలో కూడా పెంపకానికి అనువైనవి. హెలికోనియా లాటిస్పాధా, హెలికోనియా బిహైయాడిస్టాన్స్, హెలికోనియా అంగుష్టఫోలియా, హెలికోనియా కొల్లిన్సియానా (పెండ్యులా) ఇతర రకాలు.
Also Read: Pests in Redgram Cultivation: కంది పంటను ఆశించు పురుగులు.!