Heliconia Crop: హెలికోనియా పుష్పజాతి మొక్క ఇది దక్షిణ మరియు సెంట్రల్ ఆమెరికాకు చెందిన మొక్క ఈ పూలకు కట్‌ప్లవర్‌గా, వాణిజ్య పరంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాయి. ప్రత్యేకంగా ఈ పూలు వివిధ రకాలు (ఆకృతులు), రంగులతో లభ్యమౌతాయి. ఈ పూలకు ఉన్న మరొక విభన్న లక్షణం ఏమనగా ఇవి అత్యంత ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వీలవుతుంది. ఈ కారణంగా ఎక్కువ దూరం ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొందవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఈ పూలను దక్షిణ భారతదేశంలో అంతర పంటగా పండిస్తున్నారు. ఈ పూలను విడిగా, బోకేల తయారీలో, పుష్పగుచ్ఛాలు, వివిధ రకాల పుష్ప అమరికలు, శుభకార్యాల కోసం చేసే స్టేజి అలంకరణలకు వినియోగిస్తున్నారు.
హెలికొనియా నీడను తట్టుకునే స్వభావం కలిగిన పుష్పజాతి మొక్క ఈ మొక్క గుణం వలన దీనిని కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి తోటల్లో అంతర పంటగా పెంచవచ్చు.
Also Read: Seed Law: విత్తన చట్టం ఉల్లంఘించిన శిక్షలు తప్పవు.!
మొక్క వివరణ: హెలికొనియా బహువార్షిక మొక్క వీటిలో అనేక ప్రజాతులు మరియు రకరకాల వంగడాలు ఉన్నాయి. ముఖ్యంగా హెలికొనియా పిట్టకోరియంకు చెందిన రకాలు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యతను పొందుతున్నాయి.
రకాలు: గోల్డెన్ టార్చ్, లోచ్‌స్టర్ క్లా, లేడీడి, ఈడెన్ పింక్, లోబ్‌స్టర్ క్లాటు, రెడ్ టార్చ్, కెన్యారెడ్, పారెట్ బీక్, రోస్ట్రేట్ రకాలు మరియు ఇతర హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ మొక్కలు 1.5-2.0 మీ. ఎత్తు వరకు పెరుగుగా ప్రతి మొక్కకు 5-10 ఆకులు ఉంటాయి. వీటి పరిమాణం 70-80 సెం.మీ పొడవు మరియు 17-20 సెం.మీ. వెడల్పు కలిగి చూడడానికి అరటి మొక్కవలె కన్పిస్తాయి. వీటి పుష్పాలు వివిధ ఆకృతులలో ఉండి 20-30 సెం.మీ వెడల్పు మరియు రకాన్ని బట్టి 20-40 సెం.మీ వెడల్పు కలిగి పొడవైన కాడ కలిగి ఉంటుంది.
వాతావరణం మరియు నేలలు:
హెలికొనియా ఉష్ణమండలపు మొక్క ఎదుగుదల, అధిక దిగుబడికి వెచ్చని, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మొక్క పెరుగుదలకు గాను 21-400 సెం. వరకు అనుకూలంగా ఉంటుంది. నీటిపారుదల, అధిక సేంద్రీయ పదార్ధాలు కలిగి కొద్దిగా ఆమ్లత్వంతో కూడిన నేలలు అనుకూలంగా ఉంటాయి. బంకమట్టి ఎక్కువగా ఉండే నేలలు పనికిరావు. IజAR, Gశీa మరియు ఆయిల్ పామ్ పరిశోధనా స్థానం, పెదవేగి నందు జరిగిన పరిశోధనా ఫలితాల ప్రకారం ఆయిల్‌పామ్ కొబ్బరి, ముదురు ఆయిల్‌పామ్ తోటల్లో ఉండే వాతావరణంలో (దాదాపు 70 % నీడ) బాగా రాణించగలదని నిర్ధారించబడినది.
ప్రవర్తనము మరియు నాటుకునే విధానము:
హెలికొనియా యొక్క ప్రత్యుత్పత్తి దుంపల ద్వారా జరుగుతుంది. ఒక తల్లి మొక్క దుంప 20-40 పిల్ల దుంపలను ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఈ పిల్ల దుంపలను ఉపయోగించి హెరికొనియా ప్రవర్థనం చేస్తారు. ఈ విధంగా పూల ద్వారానే కాకుండా, పిల్ల దుంపలను రైతులకు అమ్మడం ద్వారా కూడా రైతులు డబ్బు సంపాదించవచ్చు. ఈ దుంపల యొక్క ఖరీదు రూ. 25 నుండి 300 వరకు కూడా ఉంటుంది.
కొబ్బరి:
హెలికోనియా మొక్కలకు 8I8 మీ. దూరంలో నాటుకున్న కొబ్బరి చెట్ల మధ్యలో 1.5I1.5 మీ దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఈ విధంగా 4 కొబ్బరిచెట్ల మధ్య 16 హెలికోనియా మొక్కలు నాటుకోవచ్చు.
ఆయిల్‌పామ్:
కొబ్బరితోట విధంగానే ఆయిల్‌పామ్ చెట్ల మధ్య దురాన్ని బట్టి (9I9 మీ లేదా 10I10మీ) 1.5I 1.5 మీ. దూరంలో హెలికోనియాని నాటుకోవాలి.
మొక్కలు నాటడానికి 45 సెం.మీ. వెడల్పు మరియు 25 సెం.మీ. లోతు గుంతలను తవ్వి ప్రతి గుంతకు ఒక దుంపను 15-10 సెం.మీ లోతులో నాటి తగినంత నీరు అందించాలి. రైతులు దుంపను నాటే ముందు ప్రతి దుంపకు 2-3 మొగ్గలు ఉండేటట్లు చూసుకోవాలి. అవసరమైతే 1 బావిడ్జిన్ ద్రావణంలో ముంచి నాటాలి.
నీటి,ఎరువుల యాజమాన్యం:
దుంపలను నాటుకునే సమయంలో 2 కిలోల చికిన పశువుల ఎరువు మరియు 50 గ్రా. నత్రజని G భాస్వరము G పొటాష్ కాంప్లెక్స్ ఎరువును ప్రతి గుంతకు వేయాలి. తరువాత పూలు పూచే సమయంలో ప్రతి మొక్కకు 30 గ్రా. రెండవ సంవత్సరం నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి 50 గ్రా. నత్రజనిGభాస్వరంGపొటాష్ కాంప్లెక్స్ ఎరువులు మరియు పశువులను ఎరువును వర్షాకాలంలో వేయాలి.
కాలువల ద్వారా వారానికొకసారి లేదా బిందు పద్ధతి ద్వారా రెండు రోజులకొకసారి నీరందించాలి. రైతులు ఏ పద్దతి పాటించిన అంతర పంటలకు సరిపడా నీరందించాలి అధిక ఉషోగ్రత మరియు వేడి గాలుల వలన వేసవి కాలంలో నీటి అవశ్యకత ఎక్కువగా ఉంటుంది. రైతులు ఎప్పుడు నేల పొడిబారకుండా జాగ్రత పడాలి. ముఖ్య పంట, అంతర పంటలకు హాని కలగకుండా ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.
సస్యరక్షణ:
హెలికొనియాలో చీడపీడల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం నత్తల బెడద కొద్దిగా ఉంటుంది. కలుపు నివారణ ముఖ్యంగా మొదటి సంవత్సరంలో చేపట్టాలి. మెలికోనియా యొక్క పాకే వేరు వ్యవస్థ వలన కలుపు మొక్కలు పెరిగే అవకాశం క్రమంగా తగ్గిపోతుంది.
దిగుబడి:
దుంపలను నాటిన 7-9 నెలలు తర్వాత పూల దిగుబడి మొదలవుతుంది. ప్రతి కుదురు/మొక్క నుండి 30-40 పూలు మరియు 120-140 వరకు ఆకులు దిగుబడి ఉంటుంది. పుష్పాలను పెద్ద కాడతో కోయాలి. పువ్వు మూడు రేఖలు విడిచినప్పుడు ఆకులతో పాటు కాండాన్ని కత్తిరించాలి. ప్రతీ కుదురు నుండి 4 సంవత్సరాల తర్వాత 10 కిలోల దుంపలు లభ్యమవుతాయి.
పూలను కోసిన తదుపరి ఆకులను కాడనుండి వేరుచేసి పూలను నీటితో నింపిన బకెట్లో/పాత్రలో కొద్దిసేపు ఉంచాలి తర్వాత పూలను దూరాన్ని అనుసరించి గుత్తులుగా లేదా అట్టపెట్టెలలో అమర్చి రవాణా చేయవచ్చు. ఈ పూలు 8-10 రోజులు ఆకులు 10-15 రోజులు నిల్వ ఉంటాయి.
వీటి సాగుకు హెక్టారుకు రూ. 10,000 – 15,000 వరకు ఖర్చు అవుతుంది. ఖర్చులు పోను రైతుకు ఒక హెక్టారుకు 25,000 నుండి 40,000 రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. ఇవికాక ఆకులు మరియు దుంపల నుండి కూడా ఆదాయాన్ని పొందవచ్చు.
ఒక్కొక్క పువ్వు రకాన్ని బట్టి రూ.20-150 వరకు ఉంటుంది.
Also Read: Horticultural Crops: ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు.!