Yellow Watermelon: వేసవి కాలం వస్తే మనం అందరం మామిడి పండ్లు, వాటర్ మెలోన్ కోసం ఎదురు చూస్తాము. వాటర్ మెలోన్ మన శరీరానికి చాలా మంచిది. వాటర్ మెలోన్ ఈ వేసవి కాలంలో తిన్నడం వల్ల వేడికి డిహైడ్రాట్ అవకుండా ఉంటాము. వాటర్ మెలోన్లో విటమిన్స్ ఏ, సి, బి6 ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు పొటాషియం కూడా ఉంటుంది. మనం ఎక్కువగా తినే వాటర్ మెలోన్ లోపల అరుపుగా ఉండి బయట ఆకు పచ్చ రంగులో ఉంటది. కానీ ఇప్పుడు మనం చూసే వాటర్ మెలోన్ పసుపు రంగులో ఉంటుంది.
ఈ పసుపు రంగు వాటర్ మెలోన్ మన దగ్గర కరీంనగర్లో సాగు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రైతులు చాలా వరకు ఈ పసుపు వాటర్ మెలోన్ సాగు చేస్తున్నారు. ఈ పసుపు వాటర్ మెలోన్లో , సాధారణ ఆకు పచ్చ వాటర్ మెలోన్ కంటే ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఉంటున్నాయి. ఈ వాటర్ మెలోన్ తిన్నడం ద్వారా చాలా ఎక్కువ కాలం వారికి డిహైడ్రాట్ అవకుండా ఉంటాం.
Also Read: NHB Training Program: జాతీయ ఉద్యాన పంటల సంస్థ పథకాల పై అవగాహన/ శిక్షణ కార్యక్రమం
ఈ వాటర్ మెలోన్ సాగు సేంద్రియ ఎరువులతో చేస్తున్నారు. ఈ పసుపు వాటర్ మెలోన్ బయట మాత్రమే పసుపు రంగులో ఉంటుంది, లోపల అరుపు రంగులోనే ఉంటుంది. వీటి రుచి కూడా చాలా బాగుండటంతో ఎక్కువ మంది ఈ పసుపు వాటర్ మెలోన్ తిన్నాడు ఇష్టపడుతున్నారు.
రైతులు ఈ పసుపు వాటర్ మీలోని అమ్మడానికి రిలయన్స్, ఫ్యూర్ నేచర్, మోర్ కంపెనీలతో కాంట్రాక్టు పద్దతిలో అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. వల్లే వచ్చి పండ్లని పొలం దగర సేకరించి, మార్కెట్కి తీసుకొని వెళ్లడంతో రైతులకి రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ పసుపు వాటర్ మెలోన్ ఇతర దేశాలకి కూడా ఎగుమతి చేస్తున్నారు. వాటి రుచి చూసి అక్కడి నుంచి కూడా మంచి డిమాండ్ వస్తుంది ఈ పండ్లకి. మార్కెట్లో కిలో 40 రూపాయలు అమ్ముతున్నారు. రిటైల్ స్టోర్లో అయితే కిలో 30-35 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ పసుపు వాటర్ మెలోన్తో రైతులకి మంచి లాభాలు రావడంతో అందరూ ఈ పంట పండించాలి అనుకుంటున్నారు.
Also Read: Drone Pilot Training: వ్యవసాయానికి ప్రత్యేకమైన డ్రోన్స్ తయారీ.!