ఉద్యానశోభ

Guinea Grass: గిని గడ్డి

0
Guinea Grass
Guinea Grass

Guinea Grass: ఈ పశుగ్రాసాన్ని వివిధ దేశాల్లో వేరు వేరు పేర్ల తో పిలుస్తారు. సాధారణంగా గినియా గడ్డి పేరు ప్రాచుర్యంలో ఉంది. ఎక్కువ దిగుబడి దీర్ఘకాల గడ్డి మరియు పశువులు ఇష్టపడతాయి. కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది.

వాతావరణం: వేడి మరియు తేమ ఉండు ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 1000 మీ. ఎత్తు వరకు పండించ వచ్చు. చాలా వరకు 1200-1500 మీ వర్షపాతం గల ప్రాంతాల్లో మంచి దిగుబడిని ఇస్తాయి.

నేలలు: మురుగు నీటి సౌకర్యం గల అన్ని నీలు అనుకూలం . నీరు ఎక్కువగా నిచ్చే బంక మట్టి నేలలు అనుకూలము కాదు. ఆమ్ల మరియు క్షార గుణాలు గల నేలల్లో ఈ గడ్డి పెరగదు.

నేల తయారి: పొలాన్ని బాగా లోతుగా దున్ని దుక్కి చేయాలి. బాగా దుక్కి చేసిన తరువాత కాలువలు బోదెలు తయారు చేయాలి.

రకాలు: హామిల్, మకుని, రివర్స్ డెల్, పి. జి. జి -13, గ్రిస్ పానిక్.

Also Read: Jammu Grass Cultivation: జమ్ము గడ్డి

Guinea Grass

విత్తన రేటు మరియు విత్తులు:

దక్షిణ భారతదేశంలో డిసెంబర్ – జనవరి మాసములో తప్ప సంవత్సరం పొడవునా నీటి పారుదల క్రింద నాటుకోవచ్చును. ఉత్తర భారతదేశంలో ఫిబ్రవరి – ఆగష్టు నేలల్లో నీటి వసతి ఉన్న చోట్ల నాటుకోవచ్చు. అదే వర్షాధార పంటగా జూన్ -ఆగష్టు మసాల్లో నాటుకోవచ్చు. ఈ గడ్డిని కాండం ముక్కలు మరియు వేరు ముక్కలు మరియు విత్తనాలు ద్వారా వ్యాప్తి చెందించవచ్చు అయినా వేరు ముక్కలు నాటినపుడు గడ్డి ఎక్కువగా మరియు త్వరగా ఏనుకుంటుంది విత్తనాల ద్వారా విత్తినపుడు 2.5-3 సెం. మి. లోతుగా నాటుకోవాలి.
వేరు ముక్కలు -16000 వేరు పిలకలు ఎకరానికి
విత్తనాలు – 2.5 కిలోలు / ఎకరానికి

నాటుట: వేరు పిలకలను బోదెలకు ప్రక్కగా 3 సెం. మీ. లోతుగా నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: నేలలో ఉన్న పోషకాలను బట్టి ఎరువులను సిఫార్సు చేయాలి. సామాన్యంగా దుక్కిలో 25 ట / హేక్టరు కంపోస్టు ఎరువులను అజోస్పైరిల్లం 10 ప్యాకెట్లు /హేక్టరు (2 కిలోలు ) నత్రజని, భాస్వరం 50 కిలోలు, పోటాష్ 90 కి / హె వేసుకోవాలి. ఎరువు వేరు ముక్కలు నాటే ముందు బోదెల మధ్య వేసి మట్టి తో కప్పాలి. ప్రతి కోత తరువాత హెక్టరుకు 26 కి నత్రజని చొప్పున వేసి నీటిని పెట్టాలి.

అంతరకృషి: విత్తనాలలో మొలక శాతం మరియు వేరు ముక్కలు ఏనుకోవడం కూడా తక్కువ కాబట్టి కొత్తగా వచ్చిన చిగురు మరియు చిన్న మొక్కలను 2 నేలలు కలుపు నుండి రక్షణ అవసరం. ఖాళీలు ఉన్న చోట్ల మళ్ళీ మొక్కలను నాటాలి. అవసరాన్ని బట్టి ప్రతి కోత తరువాత కలుపు తీయాలి.

నీటి యాజమాన్యం: మొక్కలు నాటే సమయంలో మంచిగా ఏనుకోవడానికి 7-10 రోజుల లోపు రెండు నీటి తడులు అవసరం. ఆ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున అవసరాన్ని బట్టి నీటిని ఇవ్వాలి. ప్రతి కోత తర్వాత పై పాటు ఎరువులు వేసి తప్పనిసరిగా నీటిని ఇవ్వాలి.

అంతర పంటలు:
గినియా గడ్డి మొక్క గుబురుగా ఉండు స్వభావం స్టెలో లాంటి లెగ్యూమ్ జాతి పంటలను పెంచుటకు అనుకూలించును. ఈ రెండింటి వలన భూసారము కూడా పెరుగును.

కోత కోయుట:
మొదటి కోత నాటిన 60 రోజుల తర్వాత కోయాలి. తదుపరి కోతలు 95 రోజుల ఒకసారి కోయాలి.

పచ్చ గడ్డి దిగుబడి:
సుమారు 8 కోతలలో 200-250 టన్నుల 1 హెక్టరుకు సంవత్సరానికి దిగుబడి వస్తుంది.

Also Read: Barseem grass Cultivation: బర్సీమ్ గడ్డి సాగు.!

Leave Your Comments

Late Harvesting: ఆలస్యంగా పంటకోత వలన కలిగే నష్టాలు.!

Previous article

Cotton Quality Checking: ప్రత్తి నాణ్యత పరిశీలించుటకు గమనించవలసిన అంశాలు

Next article

You may also like