Backyard Vegetable Farming: కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. పట్టణ ప్రాంతాలలో పోషక పదార్థాలనిచ్చే కూరగాయల పెంపకం ఆరోగ్యమే మహాభాగ్యం. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాన్ని, కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన తాజా కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటి దివ్యవరం. పెరటి తోటల పెంపకం… డాబాపైన సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించుకొని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు. ఇప్పుడు ఆవివరాలను ఏరువాకలో చూడవచ్చు
పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో లాగా అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, రసాయనాల ప్రభావంలేని కూరగాయలను పొందవచ్చు. పరిసరాల ప్రాంతాలలో ఉన్నటువంటి ఖాళీస్థలాల్లోనూ పెరటి తోటల పెంపకానికి ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తున్నది. కూరగాయల పెంపకంపై బడి పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు పిల్లలు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను పండించవచ్చు.
Also Read: Quail Farming: కాసుల వర్షం కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.!
సాగుచేసే పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా పశువుల ఎరువు వేసి నేలను చదును చేయాలి. తర్వాత పాదులు చూసుకొని విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. ఐదారు రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. వేడి వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా ఎండ, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. విత్తనాలు విత్తేటప్పుడు సరైన దూరం పాటించాలి. టమాటా మొక్కలు నాటిన వెంటనే కర్రలతో లేదా స్టేకింగ్‌తో ఊతం ఏర్పాటు చేయాలి. జాతి కూరగాయలైన కాకర, బీర, సొర వంటి వాటికి పందిర్లు పాకించాలి.
రోజురోజుకు కూరగాయల రేట్లు పెరుగుతు న్న నేపద్యంలో పెరటితోట సాగు విధానం అందరికి అనుకూలంగా ఉంటుది.. పెరటి తోటల పెంపకంలో ఎట్టి పరిస్థితిలోనూ విషపూరితమైన రసాయన మందులు వాడరాదు. పెంపకంలో చిన్నచిన్న పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడితో పాటు నాణ్యమైన కూరగాయలను పొందవచ్చు.పెరటి తోటల పెంపకం వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఏడాది పొడవునా కూరగాయలు పొందవచ్చు. కల్తీలేని కూరగాయలను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పొందవచ్చు. అధిక పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు లభిస్తాయి.. కుటుంబ సభ్యులకు, చిన్న పిల్లలకు మొక్కల పై ఆరోగ్యం పైన పోషక విలువలు కలిగిన ఆహార నియమాలపై అవగాహన పెంచవచ్చు. పెరటి మొక్కల పెంపకం వలన మానసిక ఉల్లాసమే కాక, శారీరక వ్యాయామానికి కూడా ఉపయోగపడుతుంది.
Also Read: Lily Cultivation: లిల్లీ పంటను ఇలాంటి నేలలో వేస్తేనే దిగుబడులు వస్తాయి..