ఉద్యానశోభ

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

0

ఉత్తర తెలంగాణ మండలంలో 2020 సంవత్సరం వానాకాలంలో 9.64 లక్షల ఎకరాల్లో (సుమారుగా)వరిసాగు అయినది. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తుండగా, వరిసాగులో కూలీల కొరత ఖర్చులు పెరగడం వల్ల ఇటీవల కాలంలో దమ్ము చేసిన పొలాల్లో వరి విత్తనాలను వెదజల్లి గాని లేదా డ్రమ్ సీడర్‌తో విత్తిగాని రైతాంగం సాగు చేస్తున్నారు.


దుక్కితయారు : దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరిసాగు పద్ధతిలో వేసవి వర్షాలను సద్వినియోగం చేసుకొని దుక్కులు దున్నుకొని యాసంగి వరి విత్తనం ఎదైనా ఉన్నచో మొలకెత్తే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. ఆపై తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని, వరిపొలాలను మెట్ట పంటలు విత్తుకొవడానికి ఏవిధంగా అయితే దుక్కి తయారు చేసుకుంటామో ఆవిధంగా తయారు చేసుకోవాలి.

అనువైన వరి రకాలు (ఉత్తర తెలంగాణ)
దీర్ఘ కాలిక మధ్యకాలిక

 

స్వల్పకాలిక

 

సాంబమఘారి,

సిద్ధి

 

 

జగిత్యాలమఘారి, పొలాస ప్రభ,

వరంగల్‌ సాంబ, వరంగల్‌ సన్నాలు, విజేత

తెలంగాణసోన,

జగిత్యాలవరి-1, కునారం సన్నాలు, బతుకమ్మ, కాటన్ దొర సన్నాలు

తెలంగాణ సోన*వరి రకాన్ని జూలై 10 తర్వాత మాత్రమే విత్తుకోవాలి

విత్తే సమయం: వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి జూన్‌ 10 నుండి జూలై 10 లోపు రకాలను బట్టి విత్తుకోవడం మేలు.

విత్తన మోతాదు (కిలోలు/ఎకరాకు)

 విత్తే పద్దతి సన్నగింజరకాలు దొడ్డు గింజరకాలు
సాళ్ళలో విత్తినప్పుడు 8 10
వెదజల్లినప్పుడు 10 12

విత్తు దూరం: 25x 6-10 సెం.మీ. వుండేట్లుగా విత్తనాన్ని విత్తుకోవాలి. యాంత్రికరణలో సీడ్ కంఫెర్టి డ్రిల్ల్ కూడ ఉపయోగించవచ్చును

ఎరువుల మోతాదు: ఈ క్రింది విధంగా సూచించబడినది

మండలం

 

 

ఉత్తర తెలంగాణ 

వానాకాలం యాసంగి
నత్రజని భాస్వరం పొటాష్ నత్రజని భాస్వరం పొటాష్
40 – 48 20 16 48 -60 24 16

భూసార పరీక్షా చేసినట్లయితే ఫలితం అద్దరంగా వేస్కోవలెను. ఈ పద్ధతిలో ఇనుపధాతు లోపం రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి రైతులు ఆకులు తెల్లగా పాలిపోయి, పంట ఎదుగుదల కుంటుపడినట్లుగా అనిపించినట్లయితే లీటరు నీటికి 5 గ్రా. అన్నభేది మరియు 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి అవసరాన్ని బట్టి రెండు/మూడు సార్లు పిచికారి చేసుకోవాలి.

కలుపు యాజమాన్యం

  • విత్తిన 45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి.
  • భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్‌ 30% ఇసి2 లీ. లేదా పెండిమిథాలిన్‌ ఎక్స్‌ట్రా 38 % ఇసి 700 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
  • విత్తిన 15-20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బిస్పైరిబ్యాక్సోడియం 100-120 మి.లీ లేదా పెనాక్స్‌లమ్‌ + సైహలోఫాప్‌ -బ్యుటైల్‌ కలిపి ఉన్నకలుపుమందును ఎకరాకు 800 మి.లీ. ను పిచికారీ చేసుకోవాలి.

నీటి యాజమాన్యం:

జూన్‌, జూలై, ఆగష్టు మాసాలల్లో కురిసే వర్షాలు పంటకు సరిపోతాయి. ఎక్కువ రోజులు (10-15రోజులు)వర్షాలు కురవనప్పుడు నేల మరియు పంటదశను అనుసరించి తడులు ఇవ్వాలి. కాలువల ద్వారా నీరు విడుదలైనప్పుడు 2.5 సెం. మీ నుండి 5 సెం. మీ వరకు నీరు నిల్వ కట్టాలి.

ఈ పద్ధతిలోని ప్రధాన ప్రయోజనాలు:

* నారు పెంచడం నారు పీకడం నాట్లు వేయడం ఈ పద్దతిలో ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరాకు సుమారుగా 2500-3000 రూపాయలు ఖచ్చితంగా తగ్గుతుంది.

* కూలీల సమస్యను అధిగమించడం.

* సరైన సమయంలో పంటను విత్తుకోవడం.

* వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడం.

* వారం-పదిరోజుల ముందుగా పంట చేతికి రావడం.

* రెండవ పంటను సకాలంలో తక్కువ ఖర్చుతో విత్తుకోవడం.

పైన సూచించిన ప్రయోజనాలతో పాటు  విలువైన నీరును మరియు ఇతర సహజ వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు.

కె. శేఖర్, శాస్త్రవేత్త (సేద్యవిభాగం) &కోఆర్డినేటర్
కె మదన్ మోహన్ , విస్తరణ శాస్త్రవేత్త
(ఏరువాకకేంద్రం, కరీంనగర్)
డా . జి . మంజులత , ప్రధాన శాస్త్రవేత్త హెడ్ , ఏ ఆర్ ఎస్, కరీంనగర్

Leave Your Comments

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

మన్యంలో అల్లం సాగు..

Next article

You may also like