Green House Structure: నిర్మాణ ఖర్చు, వాతావరణ నియంత్రణ పరికరాల అమరిక ఆధారంగా ఇవి 3 రకాలు:
1. తక్కువ ధరది (చ॥మీ॥ కు రూ.250/-): సహజ పద్ధతుల (వెంటిలేటర్లు, ప్రక్క పరదాలు) ద్వారా వాతావరణాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు.
2. మధ్యస్థ ధరది (చ॥మీ॥ కు రూ.1,000/-): ఎయిర్ కూలర్స్, మిస్టింగ్ మరియు ఫాగర్స్ను ఉపయోగించి పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించవచ్చు.
3. ఎక్కువ ధరది (చ॥మీ॥కు రూ. 4,000/-): వీటిలో అన్ని వాతావరణ నియంత్రణ పరికరాలు కంప్యూటరీకరణతో అనుసంధానించబడి ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితులు (గాలిలో తేమ, ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్ మొ||) అనుకూలంగా నియంత్రించవచ్చు.
హరిత గృహాలు-నిర్మాణం: హరిత గృహ నిర్మాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలున్నాయి.
సపోర్టింగ్ స్ట్రక్చరు, పైకప్పు (క్లాడింగ్), వాతావరణ నియంత్రణ పరికరాలు, నీటిపారుదల పరికరాలు
Also Read: Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!

Green House Structure
సపోర్టింగ్ స్ట్రక్చరు: దీనికి వెదురు, సరుగుడు, ఇనుము, ఉక్కు G.I., M.S. మరియు అల్యూమినియం పైపులు వాడుతారు. ఇందులో హూప్స్, ఫౌండేషన్ పైపులు, ఎండ్స్ ఫ్రేములు, బేటరల్ సపోర్టు, రెడ్డిలైన్ మెకానిజం, పాలిగ్రిప్ అసెంబ్లీ మొ॥ ఉంటాయి. ఇవి హరిత గృహాల ఆకారాన్ని నిర్ధారిస్తుంది.
ఉదా: గోతిక్, గౌబుల్, క్విన్సెట్, సాటూత్, ఆర్చ్ రూప్ మరియు లీన్లు రకాలు.
పై కప్పు: సపోర్టింగ్ ప్రక్బరుపైనా, ఇరువైపులు, ముందు మరియు వెనుక వాడే పారదర్శకమైన 200 మైక్రాన్ల -మందం కల్గి అతినీలలోహిత మరియు పరాఋణకిరణాలకు తట్టుకోగల పాలి ఎథిలీన్ షీట్లను “పై కప్పు” లేదా “క్లాడింగ్” అంటారు దీని ద్వారా 80-85%ు సూర్యరశ్మిలోనికి ప్రసరించడంతోపాటు గాలి, వర్షంవల్ల మొక్కలపై ఏర్పడే ప్రతికూల పరిస్థితులను తొలగించవచ్చు.
వాతావరణ నియంత్రణ పరికరాలు: హరిత గృహాలలో మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్థితులను కల్గించడానికి ముఖ్యంగా షేడ్ నెట్స్ (25-90% నీడనిచ్చేవి), మిన్లు, ఫాగర్లు, వెంటిలేటర్లు (40-60%), లైట్లు మరియు ఫాన్లు మొ॥ ఏర్పాటు చేస్తారు.
నీటి పారుదల పద్ధతి: సాధారణంగా హరితగృహాలలో మొక్కలకు బయటికంటే తక్కువ నీరు సరిపోతుంది. ఎందుకంటే మొక్కలు, నేల నుండి ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టం తక్కువ. సూక్ష్మ నీటిపారుదల పద్ధతులైన బిందు మరియు మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీరు కట్టడం చాలా అనుకూలం. ఈ పద్ధతిలో మొక్కలకు నీటితోపాటు ఎరువులను మరియు సూక్ష్మపోషక పదార్థాలను “ఫర్టిగేషన్” అనే ప్రక్రియ ద్వారా అందించవచ్చు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గడంతోపాటు ఎరువులు వృధాకాకుండా సమర్ధవంతంగా వినియోగించబడతాయి.
Also Read: Rules for Watering: నీటిని పెట్టే నియమావళిని తెలుసుకోండి.!