ఉద్యానశోభ

Gladiolus Flower Cultivation : గ్లాడియోలస్‌ సాగు, సస్యరక్షణ.!

1
Cultivation and Protection of Gladiolus plant
Cultivation and Protection of Gladiolus plant

Gladiolus Flower Cultivation: పర్వత ప్రాంతాల్లో పెంచడానికి అనువైన కట్‌ఫ్లవర్‌రకాల్లో ‘గ్లాడియోలస్‌’ ప్రధానమైనది. వాణిజ్యపరంగా అధిక డిమాండ్‌ కలిగిన ఈ పుష్పాలసాగు ఇదివరకు ఈశాన్య రాష్ట్రాలకు పరిమితమైనా ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరిస్తోంది. సీతాకోకచిలుక రెక్కల మాదిరి పూరేకులతో సొగసైన రంగుల్లో నిటారుగా ఉండే పూలకాడలతో శోభాయమానంగా ఉండే గ్లాడియోలస్‌ను పుష్పగుచ్ఛాల తయారీలో సమావేశాలు, వివాహాది శుభకార్యాలలో అలంకరణకు విరివిగా వాడుతున్నారు. దీన్ని సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులలో బయట ప్రదేశంలో సాగుచేయవచ్చు. పగటి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్‌ ఉండాలి.

Gladiolus Flower Cultivation

Gladiolus Flower Cultivation

నేలలు :తేలికపాటి నేలలు అనుకూలం. కనీసం 30 సెం.మీ. లోతుగల ఒండ్రు నేలలు ఉదజని సూచిక 5.5-6.5 మధ్యగల ఎక్కువ సేంద్రీయ పదార్ధం గల గుల్లబారిన భూముల్లో పూలు అధికంగా వస్తాయి.

రకాలు :అర్కా అమర్‌,  అర్కా ఆయుష్‌,  అర్కా గోల్డ్‌  వంటి వివిధ రంగుల పూల రకాలను వేయవచ్చు.

Types of Gladiolus Flowers.

Types of Gladiolus Flowers.

ప్రవర్ధనం : దుంపల (కార్మ్‌) ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దుంపలను తవ్వి తీసిన తరువాత మూడు నెలల వరకు నిద్రావస్థ ఉంటుంది. 4 సెం.మీ. వ్యాసం గల దుంపలని నాటుకొన్నట్లైతే పెద్ద పూలకాడలు వస్తాయి. విత్తిన దుంపలను 24 గంటలు నీటిలో నానబెట్టి నాటినట్లైతే సమానంగా మొలకలు వస్తాయి.

నాటటం : జూన్‌ నుండి అక్టోబర్‌ వరకు నాటుకోవచ్చు. నాటటానికి ముందు దుంపలపై ఉండే గోధుమ రంగు పొలుసులను తొలగించి గడ్డలను లీటరు నీటికి 3 గ్రా. డైథేన్‌-ఎమ్‌-45 కలిపిన ద్రావణంలో 15-30 నిముషాలుంచి నాటుకోవాలి. పూల సరఫరా కాలాన్ని పెంచటానికి ప్రతి 15 రోజుల నుండి నెల రోజుల వ్యవధిలో దుంపలను నాటుకోవడం వలన మంచి మార్కెట్ను పొందవచ్చు.

నాటే దూరం : దుంపలను 30 I 20 సెం.మీ. దూరంలో ఎకరానికి సుమారు 55 నుంచి 60 వేల దుంపలను నాటుకోవాలి.

ఎరువులు :ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 20 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం, 35 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. తరువాత పైపాటుగా 20 కిలోల నత్రజనిని రెండు దఫాలుగా అంటే 3 ఆకులు మరియు 6 ఆకులు దశలో వేయాలి.

నీటియాజమాన్యం : వాతావరణ, భూమి పరిస్థితులననుసరించి 7-10 రోజుల వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. పూల కాడలు ఏర్పడే సమయంలో నీటి ఎద్దడి వుండకూడదు.

అంతరకృషి :మొక్కలు పడిపోకుండా మట్టిని ఎగదోయాలి. పూత సమయంలో ఊతమివ్వాలి.

Also Read: Neelakurinji Flowers: 12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే పువ్వులు

కత్తిరించటం : కాడలోని మొదటి పుష్పం విచ్చుకోవడం మొదలైన వెంటనే పూల కాడను నాలుగో ఆకు వరకు కత్తిరించి కాడను మొదలు నీటిలో వుంచాలి.

దిగుబడి :
ఎకరాకు 50,000 నుంచి 55,000 పూల కాడలను పొందవచ్చు.

ఫ్లోరైడ్‌ దెబ్బ : వాతావరణంలో అధిక ఫ్లోరైడ్‌ అధిక మోతాదులో వుండటం వలన ఈ రుగ్మత ఏర్పడుతుంది. ఈ రుగ్మత వలన ఆకు ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. అధిక మోతాదులలో సూపర్‌ ఫాస్పేట్లు వాడకం కూడా ఈ రుగ్మతకు ముఖ్యకారణం.

పురుగులు :
సెమిలూఫర్‌, పచ్చ పురుగు : ఈ పురుగు ఆశించిన ఆకులకు ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఈ పురుగు ఆశించిన పువ్వులకు గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి.

నివారణ : వీటి నివారణకై మిథైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు (థ్రిప్స్‌) : ఇవి పుష్పాలను, పుష్ప రక్షక పత్రాలను ఆశిస్తాయి. దీని మూలంగా తెల్లటి చార లేర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు.

Gladiolus Thrips

Gladiolus Thrips

ఎండు తెగులు : తెగులు సోకిన ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. దుంపలు నిల్వ చేసినప్పుడు కుళ్ళిపోతాయి. భూమిని సోలరైజేషన్‌ చేయాలి. దుంపలను 450 ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 2.5 గ్రా. కార్బెండజిమ్‌ లేదా కాప్టాన్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి, దుంపలను 30 నిమిషాలు ఉంచి ఆరనిచ్చి నాటుకోవాలి.

ఆకుమచ్చ : ఆకులపై మచ్చలు ఏర్పడడం ఈ తెగులు ప్రధాన లక్షణం. ఈ మచ్చలు ఒకదానికొకటి కలిసిపోయి ఒక పెద్ద మచ్చగా ఏర్పడి ఆకులు మాడిపోతాయి. నివారణకు కార్బెండజిమ్‌ లేదా మాంకోజెబ్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కుళ్ళు తెగులు : ఈ తెగులు ప్రధానంగా నిల్వ ఉంటే (విత్తనాలలో) దుంపలలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన దుంపలు మొలకెత్తవు. నివారణకు బెనమైల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

దుంపకుళ్ళు తెగులు : ఈ తెగులు ప్రధానంగా దుంపలు నిల్వ చేసినప్పుడు మరియు ప్రధాన పొలంలో కూడా ఆశిస్తుంది. దీని నివారణకు కార్బెండజిమ్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి దుంపలు నాటే ముందు 30 నిమిషాలు మందు ద్రావణంలో నానబెట్టి ప్రధాన పొలంలో నాటుకోవాలి.

-డా. సత్తి బాబు, డా. రాజ్‌ కుమార్‌, డా. గౌరి, పి. బాబు,
-డా. కె. శంకర్‌, డా. మహా లక్ష్మి, డా. కిశోర్‌,  కృషి విజ్ఞాన కేంద్ర, కొండెంపూడి.

Also Read: Summer Flowers: వేసవిలో వికసించే అందమైన పువ్వులు!

Also Watch:

Leave Your Comments

 Sorghum cultivation: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా అవశేష తేమ పై జొన్న సాగు లాభదాయకం

Previous article

Wild Pigs Destroying Crops: పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను ఇలా తరిమి కొట్టండి..!

Next article

You may also like