Coconut Crop: సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. అది కూడా ఉద్యాన పంటల్లో అంతరపంటలు వేస్తేనే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. అయితే పంటను ఎంచుకునే విధానమే ముఖ్యం. కోస్తా ఆంధ్రా జిల్లాల్లో కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. అయితే కొబ్బరిలో అంతరపంటలు కల్పతరువుగా మారాయి.
దీనిలో వక్క, అల్లం, మిరియాలు, పసుపును అంతరపంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొబ్బరిలో ఈఏడాది వక్క ద్వారా 3 లక్షల పైగా ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. కొబ్బరి చెట్లకు మిరియాల తీగలను పాకించమని వీటి ద్వారా మిరియాల దిగుబడి వచ్చిందని. కేజీ రూ.600 చొప్పున అమ్ముకుంటున్నారని అంటున్నారు.
అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్‌మగ్‌లను సాగు
ఉభయగోదావరి జిల్లాల్లో కొబ్బరికి ప్రముఖ స్ధానం ఉంది. దేశంలో కేరళ తరువాత కొబ్బరి ఎగుమతులు చేసేది మన రాష్ట్రమే. ఇందులో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలదే అగ్రస్థానం. అంతేకాకుండా కొబ్బరిపై అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. రోజురోజుకు కొబ్బరి సాగు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రైతులు కొబ్బరిలో అంతర పంటలు వేసి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించిన నేలపైన అక్కడక్కడ ఖాళీ ఉంటుంది.
Also Read: Hill Brooms and Pepper: కొండ చీపుర్లు, మిరియాల సాగుకు ప్రోత్సాహం.!
ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్‌మగ్‌లను సాగు చేస్తున్నారు. సిలోన్ దాల్చిన చక్క రకం ఇది విదేశాలలో మాత్రమే ఈచెక్క ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతుంది. రైతులు తమ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేయాలి. కేరళలో లాగా మన రాష్ట్రంలో కూడా అంతర పంటగా సుగంధ ద్రవ్య పంటలను సాగు చేసుకోవచ్చు
సేద్యం కల్పతరువుగా
ఒక్క పంటపైన ఆధారపడకుండా రెండు మూడు రకాల పంటలను వేసుకుంటే ఒక్క పంట కాకపోయినా మరో పంట ద్వారా అయినా ఆదాయాన్ని పొందవచ్చు. అంతర పంటల మధ్య సేద్యం కల్పతరువుగా మారింది. ఈ పంటకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. వీటి ద్వారా ప్రధాన పంటలతో పాటు సమానంగా ఆదాయాన్ని తీస్తున్నారు. శ్రావణమాసంలో వక్కలకు బాగా రేటు పలుకుతుందని రైతులు అంటున్నారు. ఎండ గాలిలో తేమ సమానంగా చెట్లకు అందడంలో దిగుబడులను సాధిస్తున్నారు.
Also Read: Stylo (Stylosanthes guianensis): స్టైలో లో ఏకవార్షికాలు మరియు బహువార్షికాలు.!