The benefits of Plastic in Agriculture: కూరగాయలు సాగు చేసే రైతులు వాటిని రవాణా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సమయంలో ఎక్కువ శాతం కూరగాయలకి దెబ్బలు తగ్గిలి తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు. దాని వల్ల మంచి దిగుబడి వచ్చిన రైతులకి కూడా తక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం కూరగాయాలని మార్కెట్ కి తీసుకొని వెళ్ళడానికి తక్కువ ఖర్చులో ప్రత్యేకమైన బాగ్స్ ఉన్నాయి.
మార్కెట్ కి కూరగాయాలని రవాణా చేయడానికి వెదురుబొంగు బుట్టలు లేదా గంపలు వాడే వాళ్ళు. తర్వాత సమయంలో వెదురుబొంగు బుట్టలు కూడా ఎక్కువ ధర అవ్వడంతో జ్యూట్ సంచులని వాడుతున్నారు. రవాణా సమయంలో ఇబ్బంది లేకుండా ఉండటానికి వెదురుబొంగు బుట్టలు , జ్యూట్ సంచులు వాడుతున్నారు. కానీ ఈ జ్యూట్ సంచులు, వెదురుబొంగు బుట్టలు కూడా మార్కెట్లో ఎక్కువ ధరకి అమ్మడం మొదలు పెట్టారు.
Also Read: Grafting in Brinjal: అంటుకట్టు విధానంలో వంకాయ సాగు ఎలా చేయాలి…?
ఈ వెదురుబొంగు బుట్టలు , జ్యూట్ సంచులు మార్కెట్ నుంచి తిరిగి తెచ్చుకోవడం రైతులకి ఇబ్బందిగా మారింది. ప్రతి సారి కొత్త బుట్టలు , జ్యూట్ సంచులు కొనడానికి రైతులు కూడా ఇబ్బందే. ఈ బుట్టలు , జ్యూట్ సంచులు ధర కూడా ఎక్కువ ఉండటం వల్ల వీటిని కొనడానికి రైతులు కూడా ఇష్టపడటం లేదు.
ఇప్పుడు కూరగాయాలని రవాణా చేయడానికి ప్లాస్టిక్ బాగ్స్ వచ్చాయి. ఈ ప్లాస్టిక్ బాగ్స్ ద్వారా కూరగాయల రవాణా కూడా సులువుగా మారింది. కూరగాయలు కోసే సమయం నుంచి వీటిని మార్కెట్ కు తరలించడానికి, అమ్ముకోవడానికి కూడా చాలా సులువు. ప్లాస్టిక్ బాగ్స్ ధర వెదురుబొంగు బుట్టలు , జ్యూట్ సంచులతో పోలిస్తే చాలా తక్కువ. ఒక ప్లాస్టిక్ బాగ్స్ ద్వారా దాదాపు 15 కేజీల కూరగాయలు రవాణా చేయవచ్చు.
ఇలా కూరగాయాలని ప్లాస్టిక్ బాగ్స్ రవాణా చేయడం వల్ల రిటైల్ దుకాణం వాళ్ళు ఈ బాగ్స్ నుంచి నేరుగా వినియోదారులకి అమ్ముకోవడానికి సులుగా మారింది. ఈ ప్లాస్టిక్ బాగ్స్ వాడుకొని కూరగాయలు రవాణా చేసిన కూడా కూరగాయలు దెబ్బ తినే శాతం తగ్గుతుంది. కూరగాయలకి కూడా మంచి ధరకి అమ్ముకోవచ్చు.ఈ ప్లాస్టిక్ బాగ్స్ ద్వారా అని రకాల కూరగాయాల రవాణాకి వాడుకోవచ్చు. ప్లాస్టిక్ బాగ్స్ వాడటం వల్ల రైతులకి కూడా ఖర్చు తగ్గుతుంది.
Also Read: Amruth pattern Cotton Farming: ఈ పద్దతిలో పత్తి సాగు చేస్తే ఒక ఎకరంలో 20 క్వింటాల దిగుబడి వస్తుంది….