Ridge Gourd Cultivation: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం అందరూ శాఖాహారులుగా మారుతున్నారు. శాఖాహారులుగా మారడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేగన్ ఫుడ్స్ అన్ని మొదలయ్యాక చాలా మంది ఎక్కువగా వేగన్స్ అవుతున్నారు. శాఖాహారులు ఆకుకూరలు, కూరగాయాలకు మాత్రమే తింటారు. కూరగాయాలో కూడా ఎక్కువగా కొన్ని కూరగాయలని తింటారు, అందులో ఎక్కువగా బీరకాయని తీసుకుంటారు. బీరకాయ పంటని గోదావరి, కాకినాడ జిల్లాలో ఎక్కువగా సాగు చేసి ఇతర ప్రాంతాలకి పంపిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో రైతులు బీరకాయ పంటకి మంచి లాభాలు పొందుతున్నారు. ఈ బీరకాయ పంట నల్ల భూమిలో పండుతుంది. ఈ పంటకి ఎక్కువ నీళ్లు అవసరం లేదు.
ఈ పంటకి పెట్టుబడి చాలా తక్కువ, పంట కాలం కూడా చాలా తక్కువ. ఈ పంట వేసిన 45 నుంచి 60 రోజులో పంట కోయవచ్చు. రెండో సారి మళ్ళీ 65 రోజులో కోసుకోవచ్చు. చల్లగా ఉండే కాలంలో ఎక్కువ దుగుబడి వస్తుంది. ఈ పంటని తక్కువ స్థలంలో అల్లికలతో బీరకాయ పంట వేస్తారు.
Also Read: Kadaknath Hen: ఈ కోడి మాంసం కిలో 1200 రూపాయలు.!

Ridge Gourd Cultivation
ఈ పంటని పాదుల వేసుకొని పండించాలి. పాదుపైకి బీరకాయలు వేలాడతాయి, ఈ స్థలంలో అంతర పంట కూడా వేసుకోవచ్చు. బీరకాయ పంటతో అంతర పంటలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. పందిరి పంటగా పండించే బీరకాయ పంటలో నేల కాలీగా ఉంచకుండా అందులో అంతర పంటలు లేదా బీరకాయ పంటను వేస్తారు.
బీరకాయ పంటను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ జిల్లా రైతులు పిఠాపురం,రాజమండ్రి,తుని, విజయవాడ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. ఈ బీరకాయ పంటని వ్యాపారులు విదేశాలకి కూడా ఎగుమతి చేస్తూ మంచి లాభాలు తీసుకుంటున్నారు.
అనారోగ్యంగా, బాలింతలు, వ్యాధిగ్రస్తులు ఎక్కువగా బీరకాయ తింటారు. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి బీరకాయకు ఉన్న గుణం మరి ఏ కూరగాయకి లేదు. బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలకు ఉన్న వారు బీరకాయ తిన్నడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో బీరకాయ తొక్కలను ఆహారం తయారు చేయడంలో వాడుతున్నారు.
Also Read: Safflower Cultivation: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి బై బై.. వ్వవసాయానికి వెల్కమ్.!