Exotic Vegetable Farming: ప్రస్తుతం దేశీయంగా పండించే కూరగాయలను మనం వాడుతూ ఉంటాం అయితే ఇప్పుడు చెప్పుకునే కూరగాయలు మాత్రం విదేశీ పంటలుగా చెప్పవచ్చు. వీటి ప్రత్యేకత పరిశీలిస్తే వీటికి దిగుబడి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కిలో సుమారు 1200 నుంచి 1500 రూపాయలు వరకు మార్కెట్ ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులు రెండు మూడు ఎకరాల్లో సాగు చేస్తే అనతి కాలంలోనే లక్షాధికారులు అయ్యే అవకాశాలు ఉంటాయి.
భారతదేశంలోని రైతులు ఇప్పుడు ఉద్యానశాఖ (Horticulture) పంటలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది. రైతులు అత్యధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. దీంతో దేశంలో చాలా మంది రైతులు కూరగాయలు అమ్ముకుని కోటీశ్వరులుగా మారారు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరగడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు టమోటాలు అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించారు.
ఆస్పరాగస్ సాగు
విదేశీ పంటల్లో దీనిని కూరగాయలుగా వినియోగించుకుంటూ ఉంటారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర కిలో 1500 వరకు ఉంటుంది. సాధారణ మధ్యతరగతి వారు కాకుండా ధనవంతులు మాత్రమే వీటిని తినే అవకాశం ఉంది. వీటి ద్వారా మనిషి ఆరోగ్యం పెరుగుతుందని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: వ్యవసాయంలో అత్యుత్తమ వంగడాలను సృష్టించేందుకు తోడ్పాటు.!
బుక్ టీ సాగు
బోకు టీ కూడా విదేశీ కూరగాయ దీరు సాగు భారతలో ప్రారంభమైంది ఒక బుక్ 120 రూపాయల నుంచి ఉంటుంది దీనిని పది ఎకరాల్లో వ్యవసాయంగా ఎంచుకుంటే రెండు మూడేళ్ల కోటీశ్వరులు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి
చెర్రీ పంట
టమాటా (Tomato) లో ఓరకమైన పంటగా గుర్తింపు ఉంది. దీని సైజు మాత్రం టమాటా అంత ఉండదు. కానీ కొద్ది చిన్నగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. వీటిధర సాధారణ టమాటాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. 400 నుంచి 500 రూపాయలు ధర ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని సాగు చేస్తే రైతు రాజుగా మారిపోతాడు అనడంలో సందేహం లేదు. దీని సాగులో మాత్రం మెలకువలతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది. వీటిని వ్యవసాయంగా ఎంచుకునేటప్పుడు పలువురు నిపుణుల సహాయ సహకారాలు సూచనలు తీసుకోవడం చాలా ఉత్తమం. పంట దిగుబడిని బట్టి అంత ఆదాయం వస్తుందని సందేహం లేదు.
Also Read: పట్టు ఉత్పత్తిలో స్వావలంబనకు అవకాశాలు.!