Drumstick Cultivation: ఈ మధ్య కాలంలో సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గ్రామాల్లో మంచి పొలంలోనే కాకుండా బంజరు భూములో కూడా మునగ సాగు చేయవచ్చు. గ్రామాల నుంచి నగరాల వరకు డిమాండ్ ఉన్న పంట. మునగ కాయలుతో పాటు మునగ ఆకు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలోనూ మునగ ఆకులు వాడుతారు. అందుకే మునగ ఆకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది.
ఈ మునగ కాయలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఫిలిప్పీన్స్, శ్రీలంక, అనేక దేశాలో మునగను సాగుకు మంచి లాభాలు వస్తున్నాయి. మునగ సాగు చాలా సులభం, దీని ఎలాంటి భూమిలో అయినా సాగు చేసుకోవచ్చు. ఈ మునగ సాగుకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఈ మునగ పంటతో నెలకు 50వేల లాభం వస్తుంది.
Also Read: Minister Niranjan Reddy: తెలంగాణా సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా మారింది – మంత్రి నిరంజన్ రెడ్డి
ఈ మునగ పంట ఒకసారి విత్తనాలు వేసాక మళ్ళీ నాలుగు సంవత్సరాల వరకి దుక్కి దున్నాల్సిన అవసరం లేదు. మునగ పంటకి వర్ష కాలంలో ఎక్కువ వర్షాలు పడిన ఎలాంటి నష్టం ఉండదు. తక్కువ వర్షం పడిన మునగ పంటకి ఎలాంటి నష్టం ఉండదు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ మునగ పంట పెరుగుతుంది. మునగ పంట సంవత్సరానికి రెండుసార్లు కాపు కోయవచు. సంవత్సరంలో ఒక మొక్కకి 200-400 కాయలు వస్తాయి. మునగకాయలు ముదరకుండా జాగ్రత్తగా పంటను చూడాలి. నెలలో నాలుగు సార్లు కోత కోయవచ్చు.
ఒక ఎకరంలో 1200 వేల మొక్కలు నాటితే, 50000 ఖర్చు వస్తుంది. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదు. తక్కువ సమయంలోనే చెట్టు పెద్దగా పెరుగుతుంది. మునగ కాయలు కోసిన వెంటనే మార్కెటింగ్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఒకసారి పెట్టుబడితో 5-6 సంవత్సరాలు హాయిగా సంపాదించుకోవచ్చు.
Also Read: Spirulina: మట్టి అవసరం లేకుండా ఎండలో పెరిగే స్పిరులినా సాగు..