ఉద్యానశోభ

Spinach: పోషక అద్భుతాన్ని అందిస్తున్న ఈ కూర ఏంటో , ఎలా సాగు చేయాలో మీకు తెలుసా ?

2
Spinach
Spinach Cultivation

Spinach: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. పాలకూర ఎక్కువగా ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలలో సాగు చేస్తారు. 35 సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత వచ్చిన తర్వాత ఆకులు కూరగా పనికిరావు. అందువలన ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు. సారవంతమైన, మురుగునీరు పోవు సౌకర్యం గల నేలలు అనుకూలం. అధిక చౌడు గల భూమిలో కూడా పాలకూర పండించవచ్చు.

రకాలు:

ఆల్డ్రిన్ : ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. 75రోజులకు పూత వస్తుంది. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి వస్తుంది.

పూసా జ్యోతి : ఇది ఆల్డ్రిన్ రకాన్ని అభివృద్ధి పరచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడుతారు.

పూసాహరీత్ : చల్లని, కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది.

పూసా పాలక్ : ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడినది. ఇది స్విస్ చార్ట్ X దేశవాళీ పాలకూర సంకరం నుండి ఎన్నుకొనబడినది. లేత ఆకులను కలిగి వుంటుంది.

జాబ్నర్ : ఆకులు పెద్దగా, మందంగా, మృదువుగా ఉంటాయి.ఒక ఎకరంలో 11-12 టన్నుల దిగుబడి వస్తుంది .

ఊటీ – 1 : ఆకులు 40-50 సెం.మీ. పొడవు, 8-10 సెం.మీ. వెడుల్పుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. దిగుబడి 4 కోతలలో 24 టన్నులు / ఎకరాకు.

ఉత్తర భారతదేశం: ఖరీఫ్ : జూన్-జూలై, రబీ :సెప్టెంబర్-అక్టోబర్, దక్షిణ భారతదేశం : అక్టోబరు నుండి డిసెంబరు, కొండ ప్రాంతాలలో : ఏప్రిల్ – జూన్.

విత్తన మోతాదు : 10-12 కిలోలు/ ఎకరాకు నేల తయారీ మరియు విత్తటం : భూమిని 3-4 సార్లు బాగా దున్ని చదును చేయాలి. అనువైన పరిమాణంలో మళ్ళను తయారుచేసుకోవాలి.

Also Read: Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?

Spinach

Spinach

ప్రతి పాలకూర గింజ బంతిలో 2-3 విత్తనాలుంటాయి. విత్తనాలను 20సెం.మీ. దూరంలో, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 8-10 రోజులలో గింజ మొలకెత్తుతుంది. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరాకు 10 కిలోల నత్రజని పైపాటుగా వేయాలి. విత్తిన 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో 2-3సార్లు కలుపుతీసి మట్టిని కదిలించాలి.

విత్తిన వెంటనే నీరు పారించాలి. వారం నుండి 10 రోజులకొకసారి భూమిలో తేమను బట్టి తడులను ఇవ్వాలి. ప్రతి కోత తరువాత పైపాటుగా నత్రజని వేసి నీరు పారించాలి. ఆకు కూరల పంటకు తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులను మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకుతినే గొంగళి పురుగుల నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు
నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందు పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.

మొదటి కోత విత్తిన 3-4 వారాలకు వస్తుంది. తర్వాత 7- 10 రోజుల వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు. ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరాకు 10 కిలోల నత్రజని పైపాటుగా వేయాలి. విత్తిన 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో 2-3సార్లు కలుపుతీసి మట్టిని కదిలించాలి. శూన్యశక్తి శీతల గదిలో 2-3 రోజుల వరకు నిల్వ చేసుకొనవచ్చు.

Also Read: Chrysanthemum Flowers: శీతాకాలం రాబోతుంది.. ఇంకా ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉంటుంది.!

Leave Your Comments

Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?

Previous article

Beetroot Cultivation: బీట్ రూట్ సాగు విధానాలు, సూచనలు.!

Next article

You may also like