వర్షాధార పంటలు:- తేమ అనుకూలంగా ఉన్నపుడు జులై లో ఎంతముంందుగా విత్తితే అంత అనుకూలం. జూన్ లో విత్తడం వీలుకనివారు జులైలో విత్తడానికి త్వరపడాలి.
వేరుశనగ:- జులై మొదటి వారంలోపు విత్తితే అధిక దిగుబడులోస్తాయి. నిదానమయ్యేకొద్ది దిగుబడులు తగ్గుతూ వస్తాయి. భూమిలో సరిపడినంత తేమ ఉన్నప్పుడు మొలక బాగా వస్తుంది. పదును తక్కువగా ఉన్నప్పుడు విత్తితే సరిగ్గా మొలకెత్తవు. ఖాళీలేర్పపడతాయి. దిగుబడి బాగా తగ్గుతుంది ఆగష్టు 15 తర్వాత విత్తితే దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షపు తేమ ఆరిపోక ముందే త్వరగా విత్తడం పుర్తి చేయడానికి, ఎక్కువ విస్తీర్ణంలో విత్తడం పూర్తి చేయడానికి, ట్రాక్టర్లుతో నడిచే సీడ్డ్రిల్ ఉపయోగించవచ్చు.
Also Read: Niti Aayog Natural Farming Intiative: సహజ వ్యవసాయం యొక్క విజయ గాథల సంగ్రహం
మొక్కజొన్న:- వర్షాధారంగా జులై 15 వరకు విత్తి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి.
జొన్న:- జొన్నను జులైలో విత్తవద్దు. మొవ్వుతొలుచు ఈగ ఉదృతి ఎక్కువై దిగుబడులు బాగా తగ్గుతాయి. అంతర సేద్యం, పైపాటి ఎరువులు, సస్యరక్షణ చర్యలు ఈ నెలలో చేపట్టాలి.
కొర్ర:- జులై చివరి వరకు విత్తవచ్చు. అగ్గి తెగులును, వెర్రికంకిని తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో నాణ్యంగా ఉంటుంది.
సోమ:- జులై 15 లోపు విత్తాలి. మంచి రకం: 80-85 రోజుల పంట.
కంది:- ఉత్తర కోస్తాలో జులై, ఆగష్టులలో విత్తవచ్చు. రాయలసీమ, తెలంగాణలో జులై 15 వరకు విత్తవచ్చు. తెలంగాణలో మొక్కల సంఖ్య పెంచి దగ్గర దగ్గరగా జులై 15 నుండి ఆగష్టు 15 వరకు కూడా విత్తవచ్చు.
పెసర:- మొరుస్తున్న పెసర గింజలకు ధర ఎక్కువ. ఖరీఫ్ లో జులై 15 వరకు విత్తుటకు అనుకూలం. దిగుబడి 5-6 క్వి/ఎ. ఇవ్వగల్గి, మొరుస్తున్న గింజ గలిగి పల్లాకు తెగులును తట్టుకోగలిగి ఉంటుంది.
మినుము:- ఖరీఫ్ లో జులై 15 వరకు విత్తుకోవచ్చు. తులసి అత్యధిక దిగుబడినిస్తుంది. అన్ని కాలాలకు అనువైనది పాలిష్ రకం. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఇతర దిగుబడి ఇచ్చే పాలిష్ రకాలు: లాం.623, ఎల్జిజిజి 752.
ప్రొద్దు తిరుగుడు:- తేలిక భూమిల్లో జులై 15లోపు, బరువు ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. ప్రేవేటు హైబ్రిడ్ లు ఎక్కవ ప్రాచుర్యంలో ఉన్నాయి.
ప్రత్తి:- వర్షాధారంగా జులై 20లోపు విత్తడం అనుకూలం. నిదానమయ్యే కొద్దీ కాడ దశలో భూమిలో తేమ తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
వర్షధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నపుడు మంచి సూటి రకాలైన నరసింహ, శ్రీరామ్, ఎ. డి. బి.-39ఎంచుకోవచ్చు. దిగుబడి 8-10 క్వి/ఎ.
మిరప:- క్రితం పంట ధరలు పడిపోయాయని, మిరపపాగు విస్తీర్ణం బాగా తగ్గే వీలుంది. అలాంటప్పుడు వచ్చే సీజనులో మిరప ధరలు పెరగవచ్చు. కాబట్టి, కొద్దిపాటి భూమిలోనైనా ఈసారి మిరప సాగు చేయండి.
కూరగాయలు:- జులైలో బీర, సొర, గుమ్మడి, పొట్ల విత్తవచ్చు. వంగ నాటవచ్చు.
పండ్లు:- జామ, మామిడి, దానిమ్మ, రేగు అంట్లు, అరటి పిలకలు జులైలో నాటుకోవచ్చు. నిమ్మ, నారింజ, అరటి, కొబ్బరిలో ఎరువులు ఈ నెలలో వేయవచ్చు. జామ, సపోట అంట్లు కట్టవచ్చు.
పూలు:- చేమంతి నారు పోసుకోవచ్చు. గులాబీ, మల్లె, కనకాంబరం పంటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ చేపట్టవచ్చు.
పసుపు:- దుగ్గిరాల ప్రాంతంలో భూమి తయారు చేసి జులై నెలలో సేద్యపు పనులులో నాటవాచ్చు.
Also Read: Organic farming: ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా రూ.18 లక్షలు సంపాదన