మామిడి: కాయల కోతకు 30-40 రోజుల ముందు నీరు పెట్టటం ఆపితే కాయ నాణ్యత పెరుగుతుంది. కాయలను చల్లటి వేళల్లో కోత పరికరాలను ఉపయోగించి కోయాలి. కాయకు 5-7 సెం.మీ తొడిమ ఉండేలా కోసి సొన అంటకుండా తల క్రిందులుగా ఉంచి, సొన మొత్తం కారి పోయిన తరువాత గ్రేడిరగ్ చేసుకొని, అట్టపెట్టెలలో కాగితపు ముక్కలను ఒత్తుగా వేస్ ప్యాకింగ్ చేయాలి. దూర ప్రాంత రవాణా కోసం, కాయలను కోసిన తరువాత 10 గంటల్లోపు శీతల గిడ్డంగుల్లో 12.50 సెం. ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ వద్ద నిల్వ ఉంచాలి.
అరటి: స్థానిక మార్కెట్ కోసం, పూర్తిగా తయారైన గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో మాత్రమే కోసి, ఎండ, వేడిగాలులు తగలని నీడ ప్రదేశంలో ఉంచాలి. దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు గెలలను 75-85 శాతం పక్వానికి రాగానే కోయాలి. అలాగే గెల తొండం కురచగా ఉండేలా కత్తిరించాలి. రవాణా చేసేటప్పుడు గెలల చుట్టూ పచ్చి ఆకులు చుట్టి రవాణా చేయడం మంచిది. అరటి నాటాలనుకున్న రైతులు భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్నాలి.
Also Read: Dragon Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఆరోగ్య లాభాలు బాగు.!
బత్తాయి, నిమ్మ: మొదళ్ళకు బోర్డోమిశ్రమాన్ని రాస్తే, అకాల వర్షాల వల్ల ఆశించే తెగుళ్ళ నుండి రక్షణ పొందవచ్చును. జూన్‌లో పూతకు రావాలి అంటే మే మాసంలో నీటి తడులు ఆపివేయాలి.
కొత్తగా తోటలను పెట్టదలుచుకొన్న రైతులు ముందుగా ఈ మాసంలో 1 మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలను 6I6 మీ. దూరంలో తీసుకొని బాగా ఎండనివ్వాలి.
బొప్పాయి: 5 నెలలు దాటిన తోటల్లో, ప్రతి మొక్కకు 25-30 లీటర్లు నీటిని డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ పెరిగే కొద్దీ ఆకుముడత, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకు వేపనూనె 2.5 మి.లీ అసిఫేట్ 1.5 గ్రా. జిగురు 0.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని బట్టి పిచికారీ చేయాలి.
తెల్లదోమ ఉధృతి నియంత్రణగాను పసుపు రంగు జిగురు అట్టలను, ఎకరాకు 12-15 చొప్పున పంట ఎత్తులో అమర్చాలి.
సపోటా: ముదురు తోటల్లో నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళల్లో తొడిమతో సహా కోసుకోవాలి.
రేగు: పాదుల దగ్గర మట్టిని తిరగబెట్టడం వలన, నిద్రావస్థలో ఉన్న కాయతొలుచు పురుగులను నాశనం చేయాలి.
పనస: కళ్ళు పూర్తిగా విచ్చుకొని, పసుసు రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కోత తరువాత ఎండిన కొమ్మలను తీసివేసి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జీడి మామిడి: తామర పురుగులు, ఎదుగుతున్న కాయలను, పండ్లను గీకి రసం పీల్చడం వల్ల గరుకు మచ్చలు ఏర్పడి, దిగుబడి నాణ్యత తగ్గుతుంది, కాయ, గింజ తినే పురుగులు కాయ, గింజ మధ్య గల ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించి, పండులోని గుజ్జును, గింజలోని పప్పును తింటాయి. వీటి నివారణకు లామ్డా సైహలోత్రిన్ 0.6 మి.ల్లీ లేదా ఫిప్రోనిల్ 2-0 మి.ల్లీ మార్చి, మార్చి వేపనూనె 5.0 మి.ల్లీలతో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
కూరగాయలు:
టమాటా: పూత దశలో 1 మి.ల్లీ ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే పూత, పిందె నిలిచి మంచి దిగుబడులు పొందవచ్చును.
పందిరి కూర గాయల్లో పండు ఈగను నివారియటకు 100 మి.ల్లీ మలాథియాన్ ం 100 గ్రా. బెల్లం లేదా చెక్కెర లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడా ఎరగా పెట్టాలి.
బీరలో పాముపొడ తెగులు ఆశించడం వల్ల, తెల్ల చారలు ఆకుల మీద కన్పిస్తాయి. నివారణకు 3.0 మి.ల్లీ. వేపనూనె, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పుచ్చ కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఎక్కువ నీరు ఇవ్వకూడదు. ఎక్కువ నీరు కడితే కాయలు పగిలి నాణ్యత తగ్గుతుంది. కోతకు 15 రోజులు ముందు లీటరు నీటికి 2 గ్రా. బొరాక్సు కలిపి పిచికారి చేయడం వల్ల కాయ పగుళ్ళు అరికట్టవచ్చు.
కరివేపాకు: పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పీల్చివేస్తాయి. నివారణకు డైమిథోయేట్ 2.0 మి.ల్లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
అల్లం: అల్లం విత్తడానికి అనువైన సమయం. ఎత్తు మడులు, జంట కాల్వల పద్ధతిలో అల్లం విత్తితే అధిక దిగుబడులు వస్తాయి.
Also Read: Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు