Green Leafy Vegetables Cultivation: సమయానుకులంగా మార్కెట్లో డిమాండ్ కు తగ్గట్టు పంటల సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాకు నిలిచే పంటల్లో ఆకుకూరలకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈపంటలను సాగు చేపట్టే రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుంది.
ఏడాది పొడవున ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది కొత్తిమీర మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటి వాటికి ఆరోగ్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రోజువారి వంటకాలలో ఇవి తప్పనిసరి అవసరం. కొత్తిమీర మెంతి, పుదీనా ఏడాది అంత గిరాకీ బాగా ఉంటుంది. ఆకుకూరలో సాగుకు మెట్ట ప్రాంతాలు బాగా అనుకూలం. సాగులో సరైన జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించడానికి ఆకుకూరల సాగు ఎంతో అనుకూలం.
గోంగూర: నీరింకే అన్ని నేలలు గోంగూర సాగుకు అనుకూలం. నల్లరేగడి లో బాగా పండుతుంది. ఎకరాకు 15 20 కిలోలు విత్తనాలు అవసరం. ఎకరాల సాగుకు 12000 ఖర్చు అవుతోంది. విత్తిన తర్వాత రెండు నెలలకు పంట చేతికి వస్తుంది. 6 నెలల దిగుబడి మెరుగ్గా ఉంటుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించి మంచి ఆదాయం సమకూరుతుంది రైతులకు.
తోటకూర: ఆకుకూరల్లో ఇది రాణి, వివిధ శీతోష్ణస్థితుల పెంచేందుకు తోటకూర చాలా అనువైనది. ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే పంట సక్రమంగా పెరగదు. నీరు నిలిచే బంక మట్టి ఇసుక నెలలో దీనికి పనికిరావు. నుంచి జూన్ నుంచి అక్టోబర్ వరకు జనవరి నుంచి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. పది రోజులకు కోతలు తీయవచ్చు. దిగుబడి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు తీయవచ్చు. ఎకరాకు 10 వేలు ఖర్చు అవుతుంది.
Also Read: స్థిరమైన ఆదాయాన్నిచ్చే లిల్లీ పూల సాగు.!
చుక్కకూర: ఏడాది పొడవునా దీనిని సాగు చేయవచ్చు, నల్లరేగడి భూములు దీనికి అనుకూలం. నీరు అందించాల్సి ఉంటుంది. ఎకరాకు 6- 8 కిలోలు విత్తనం కావాలి ఎకరాకు పెట్టుబడి 8-10 వేలు వరకు అవుతోంది. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంట కాలం మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది. 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
బచ్చలికూర: ఇది శరీరానికి శీతల గుణాన్నిస్తుంది. నీరింకిన అన్ని భూముల పండించవచ్చు. ఎకరాకు 12 కిలోలు విత్తనం అవసరం. ఎనిమిది పదివేల వరకు పెట్టుబడి ఉంటుంది. నాటిన నెల తర్వాత కోత తీయవచ్చు. పంట కాలం మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది. నీటిపారుదల సభ్యంగా అందిస్తే 6 నెలలు కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
మెంతికూర : సుగంధ ద్రవ్య పంటల్లో ఇదొక ఒకటి. ఈపంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలం ఇసుక నేలలు నీరింకే ఒండ్రు భూములు మేలు. ఎకరాకు 6 నుంచి 10 కిలోలు విత్తనాలు సరిపోతాయి. ఎకరాకు పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకు ఒకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. దిగుబడి నాలుగు క్వింటాళ్ల పైగా వస్తుంది.
కొత్తిమీర: ఇది సుగంధ ద్రవ్యపు పంట, అధిక ఆమ్లక్షార గుణాలు లేని నేలలు నీరింకె భూములు సాగుకు అనుకూలం, చల్లని వాతావరణంలో పంట బాగా వస్తుంది. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. విత్తనాల్ని విత్తేముందు ఐదారు గంటలు నానబెట్టాలి ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం. ఎకరాకు 10-15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీనా : ఎర్ర నల్ల నేలలు పుదీనా సాగుకు అనుకూలం. చల్లని వాతావరణం దీనికి పనికిరాదు. ఈపంటకు విత్తనాలు ఉండవు. కొమ్మలను ముక్కలుగా చేసి నాటాలి. ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల కొమ్మల అవసరం.
పాలకూర : ఈపంట సాగుకు సమ శీతోష్ణ వాతావరణ పరిస్థితులు అనుకూలం. 31 డిగ్రీలు దాటితే ఆకులు ఎరుపుగా మారే అవకాశం ఉంటుంది. పంట కాలం మూడు నెలలు. పెట్టుబడి పది నుంచి 12000 ఖర్చు ఉంటుంది. వారంలో ఐదు నుండి ఏడు కోతలు కోయవచ్చు.
దాదాపు 25 రకాలకు పైగా ఆకుకూరలు కాయకూరలు మనం ఆహారంగా వినియోగిస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణలో పండ్లు, మాంసం, పాలు, చేపలు, తదితరాలతో పాటు సమృద్ధిగా విటమిలో ఖనిజ లవణాలు ప్రొటీన్లు పీచు పదార్థాలు అందించే ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
Also Read: చలికాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!