Karonda Cultivation: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆశించిన అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు. కేవలం వ్యవసాయ పంటలు పండించటానికి వ్యవసాయ కూలీల సమస్య ఎదురవుతోంది. కావున చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం మానేసి ఇతర రంగాలపై, తక్కువ కాలంలో అధిక ఆదాయాన్నిచ్చే వాటిపైన దృష్టి సారిస్తునారు. రైతులు నిత్యం పండించే ఆహార పంటలతో పాటు వాణిజ్యపరంగా పెంచే చెట్లను కూడ కలిపి చేయడం వల్ల వ్యవసాయంలో వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చును.
గుత్తులు గుత్తులుగా కాయలు
వాక్కాయ చిన్న మొక్కే అయినా గుబురుగా ఉండి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఈసరికొత్త థాయిలాండ్ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది నుంచే కాపు అందుకుంటుంది. నేలమీదా, కుండీల్లోనూ అన్ని చోట్ల దీనిని పెంచుకోవచ్చు. ఎర్రమట్టి నేలల్లో శ్రీఘ్రమైన కాపు ఉంటుంది. వారానికి ఒకరోజు నీటివనరులు అందిస్తే సరిపోతుంది. సాధారణంగా వాక్కాయ మొక్క అక్కడక్కడా ముళ్ళుండే పొద జాతి, కంప మొక్క.
Also Read: మిర్చి నారు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
ఈ విదేశీ రకం వాక్కాయ ముళ్ళు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. వాక్కాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్స్, అంథోసైనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. తినుబండారాలలో వాడే చెర్రీ పండ్లు ఈ పండ్ల నుంచి తయారుచేస్తారు.
ఎకరానికి 200 మొక్కలు
ఈ నేపథ్యంలో రైతులు పొలం కంచెకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన ఒక వాక్కాయ మొక్క 80 ఎకరాల్లో విస్తరించి నేడు రైతులకు కాసులు కురిపిస్తోంది. బాపట్ల జిల్లాలో రైతులు అక్కడినుంచి కొన్ని మొక్కలను తీసుకువచ్చి నాటారు. వాటిలో వాక్కాయ మొక్క ఒకటి. ఈచెట్టుకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పొలం గట్టుపై వేస్తే కంచెగా ఉంటుందని రైతులు భావించారు. పొలంలో గట్టుపై దీనిని నాటారు. పెరిగాక దాని కాయలను విత్తనాలుగా మార్చి ఎకరం పొలంలో సాగు చేస్తే లాభాలు రావడంతో ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 200 మొక్కలు నాటవచ్చు.
తొలి ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఒక చెట్టుకు 25 నుంచి 30 కిలోల వాక్కాయలు వచ్చాయి. ఎకరానికి సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర కిలో రూ.50 ఉంది. అడవి జాతి మొక్క కావడంతో పెట్టుబడి ఖర్చు తక్కువ. ఏడాదికి రెండు మూడుసార్లు నీరందిస్తే సరిపోతుంది. పూత సమయంలో పురుగు సోకకుండా మందులు పిచికారీ చేస్తే దిగుబడి పెరిగే అవకాశముంది. బేకరీల్లో ఉండే చెర్రీ పండ్లను వీటితో తయారుచేస్తారు.వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వాక్కాయలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. చింతపండుకు వీటిని ప్రత్యామ్నాయంగా వాడవచ్చని తెలిపారు.
Also Read: సీతాఫలాలు పండిస్తూ లక్షల్లో ఆదాయం.!