ఉద్యానశోభ

హైడ్రోపోనిక్స్ విధానంతో ఉద్యాన పంటల సాగు..

0
  • మట్టితో అవసరం లేకుండా కేవలం నీళ్ళలో మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోపోనిక్స్‌ అంటారు. మామూలుగా వ్యవసాయం చేయడానికి నేల, నీరు కావాలి. వాతావరణం పంటకు అనుకూలంగా ఉండాలి. కాని హైడ్రోపోనిక్స్‌ ద్వారా నేల అవసరం లేకుండా వాతావరణం మీద పూర్తిగా ఆధారపడకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా పంటను పండించవచ్చు.
    హైడ్రోపోనిక్స్‌లో మొక్కలను పెంచే విధానం :
    ప్రకృతి మీద ఆధారపడకుండా ఉన్న స్థలంలో మొక్కకు కావలసిన పోషకాలు నీటి ద్వారా అందించడం కొరకు నిలువుగా`అడ్డంగా నీటి గొట్టాన్ని ఒక వరుసపైన మరొకటి అమరుస్తారు. వాటికి రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పేపర్‌ టీ కప్పుల్లాంటి జాలి కప్పును పెడతారు. అందులో మొక్కను నాటే ముందు మొక్కు స్థిరంగా ఉండడానికి బంక మట్టితో చేసిన చిన్న గుండ్రని బాల్స్‌ని వేస్తారు. మొక్కవేళ్ళు జాలిలో నుండి పైపులోనికి పోతాయి. ఆ పైపులో మొక్కకు అవసరమైన పోషకాలు కలిపిన నీరు నిరంతరంగా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు మొత్తం పైపంతా ప్రవహించి తిరిగి ట్యాంకులోకి చేరుతుంది. మరలా అదే నీరు పైపుల్లోకి వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం ద్వారా నీరు వృధా కాదు. ఈ విధానంలో మొక్కను పెంచడం వల్ల భూమిలోకి చొచ్చుకొని పోయి నీటిని, పోషకాలను వెతుక్కోవలసిన పని ఉండదు కాబట్టి మట్టిలో పెరిగినట్లుగా ఈ మొక్క వేళ్ళు పెద్దగా పెరగవు. కాబట్టి పోషకాలు పూర్తిగా మొక్క పై భాగం పెరుగుదలకు ఉపయోగపడును.
    పంట కాలాన్ని బట్టి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని అవసరమైతే ఎండ ఎక్కువ పడకుండా నీడను ఏర్పాటు చేస్తారు. ఎండ పడని ప్రదేశమైతే తగినంత వెలుతురు కోసం ఎల్‌ఇడి లైట్లను అమరుస్తారు.
    హైడ్రోపోనిక్స్‌లో మొక్కలను పెంచడానికి కావలసిన ముఖ్య పరికరాలు :
    ఇసి. మీటరు, పిహెచ్‌ మీటరు, లిట్మస్‌ పేపర్‌
    పోషక ద్రావణం తయారీ :
    సరైన పోషక ద్రావణాన్ని వాడాలి. అంటే తగిన మోతాదులో స్థూల మరియు సూక్ష్మపోషకాలను కలిగి ఉండాలి. సాధారణంగా పోషక ద్రావణం గాఢత 1000 నుండి 25000 పిపియం వరకు ఉండే విధంగా చూసుకోవాలి. పోషక పదార్థాల ద్రావణం పంటకు అనుగుణంగా తయారు చేసుకొని వాడుకోవాలి.
    హైడ్రోపోనిక్స్‌ కిట్ల తయారీ సంస్థలు :
    1. ఫ్యూచర్‌ ఫార్మా కంపెనీ
    2. అర్బన్‌ కిసాన్‌
    3. టేక్‌మాలి.
    4. గ్రోనోపియా
    5. బిట్‌యాంటిస్‌
    6. గ్రీన్‌ టిక్‌ లైన్‌ మొదలగు కంపెనీలు హైడ్రోపోనిక్స్‌ కిట్లను తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు.
    హైడ్రోపోనిక్స్‌ విధానంలో ఏ పంటలు పండిరచుకోవచ్చు :
    స్ట్రాబెర్రీ :
    ఈ విధానంలో ఇప్పటికే చాలా మంది రైతు స్ట్రాబెర్రీ పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. నేల,- సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా స్ట్రాబెర్రీ సాగుచేయవచ్చు.
    లెట్యూస్‌ :
    లెట్యూస్‌లో ఉన్న పోషకాల వల్ల ఈ మధ్యకాలాల్లో లెట్యూస్‌ వాడకం బాగా పెరిగింది. హైడ్రోపోనిక్‌ విధానంలో వివిధ రకాల లెట్యూస్‌ను సాగుచేస్తున్నారు. లెట్యూస్‌ను సలాడ్‌గా సూప్‌లో వాడతారు.
    కేల్‌:
    కేల్‌ అనేది ఒక ఆకు కూర లాంటిది. దీని పెరుగుదలకు సూర్యరశ్మి అంత ఎక్కువగా అవసరం లేనందున ఈ సాగు విధానంలో పండించడం వల్ల అధిక పోషక విలువలు కలిగిన కేల్‌ పంటను పండించి అధిక దిగుబడులు అదే విధంగా అధిక మార్కెట్‌ ధరను పొందవచ్చు.
    పాలకూర :
    పాలకూర అనేది మనందరికీ తెలిసిన, కావలసిన ఆకుకూర పంట. దీన్ని హైడ్రోపోనిక్స్‌ విధానంలో సాగు చేయడం ద్వారా అనుకూల పరిస్థితుల్లో సుమారుగా 12 వారాల వరకు వరుసగా ఆకును కోసి మార్కెట్‌కు పంపించుకోవచ్చు. ఈ పంటను హైడ్రోపోనిక్స్‌ కిట్స్‌ వాడుకొని ఇంటి పైన ఖాళీ స్థలంలో కూడా పండించుకోవచ్చు.
    టమాట :
    మార్కెట్‌లో దొరికే టమాటాలు వివిధ రకాల రసాయనాలు, పురుగు మందుతో కలుషితమై ఆరోగ్యానికి హానికరంగా తయారవుతున్నాయి. హైడ్రోపోనిక్స్‌ విధానంలో కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు గల పరికరాలు వాడుకొని పురుగు మందు అవశేషాలు లేని టమాటాను పొందవచ్చు.
    దోస :
    తీగజాతి కూరగాయలు కూడా హరిత గృహాలకు కావలసిన వాతావరణం కల్పించి హైడ్రోపోనిక్స్‌ విధానంలో పండించవచ్చు. ఇవే కాకుండా లెట్యూస్‌, పెప్పర్‌ వంటి ఇతర కూరగాయలు కూడా పండించవచ్చు.
    సాగు విధానంలో వాతావరణ పరిస్ధితుల విషయంలో తీసుకోవసిన జాగ్రత్తలు :
    ఉష్ణోగ్రత :
    కొన్ని రకాల పంటకు చలికాలంలో ఉష్ణం, ఎండాకాలంలో చల్లని వాతావరణాన్ని కల్పించడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. అయినప్పటికీ సుమారుగా 65-75 డిగ్రీల ఫారన్‌హీట్‌ (65-75 డిగ్రీల) ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు పాటించడం వల్ల మొక్క పెరుగుదల, ఆరోగ్యం బాగుంటుంది.
    ఆర్థ్రత (గాలిలో తేమ) :
    ఈ విధానంలో ఆర్థ్రత 40-80 శాతం ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఆర్‌హెచ్‌ ఉండడం వల్ల చీడపీడల బెడద ఎక్కువగా ఉండును. హైడ్రోమీటర్‌ అనే పరికరం ఉపయోగించి ఆర్థ్రతను సమతుల్యం చేయవచ్చు.
    గాలి ప్రసరణ :
    మొక్క నుండి వెలువడే CO2 ను ఎక్జాస్ట్‌ ఫ్యాన్‌ ద్వారా CO2 కలిగిన గాలిని బయటకు పంపి చల్లటిగాలిని లోపలికి పంపించాలి. దీని వల్ల మొక్కకు కావాలసిన O2 అందించవచ్చు.
    వెలుతురు :
    పండించే స్థలంలో చీకటి స్థలం ఉన్నట్లయితే మార్కెట్‌లో దొరికే హెడి లైట్లు‌ వాడుకొని వెలుతురును సమతుల్యం చేయాలి.
    హైడ్రోపోనిక్స్‌ విధానం వల్ల కలిగే లాభాలు :
  • కొన్ని సార్లు రైతు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ నష్టాలతో పోలిస్తే లాభాలే ఎక్కువ ఉన్నందున సరైన అనుభవంతో సాగుచేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
  • తక్కువ స్థలంలో తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
  • హరిత గృహాల్లోలాగా హైడ్రోపోనిక్స్‌ విధానంలో కూడా వాతావరణ పరిస్థితులను కావలసిన విధంగా మార్చుకోవచ్చు.
  • మనం సాంప్రదాయ పద్ధతిలో సాగుచేసుకునే నీటిలో 10 శాతం నీటిని వాడుకొని నీటి వృధాను తగ్గించుకోవచ్చు.
  • మొక్కకు కావలసిన ఎరువును, పోషకాలను ద్రావణ రూపంలో అందించడం వల్ల వాటి పోషక విలువలు పెరిగి అధికంగా పెట్టే ఖర్చు తగ్గును.
  • సాధారణంగా నేలలో పెరిగే మొక్కతో పోలిస్తే ఈ విధానంలో పెరిగే మొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉండును. ఎందుకంటే నియంత్రిత వాతావరణం కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
    కలుపు మొక్కలు మరియు చీడపీడలు, తెగుళ్ళ బెడద చాలా తక్కువగా ఉండును.
  • తక్కువ మోతాదులో పురుగు మందు వాడడం వల్ల కలుషితం లేని కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు.
  • పి.హెచ్ లెవల్ నేల సాగులో కంటే నీటి సాగులో మనకు కావలసిననంత సమతుల్యం చేసుకోవచ్చు. దీనితోపాటు కూలీల అవసరం కూడా తక్కువ.

హైడ్రోపోనిక్స్‌లో ఎదురయ్యే సమస్యలు :

  1. సాంప్రదాయ సాగు విధానం కంటే ఈ పద్ధతిలో సాగుకు తగినంత అనుభవంగా శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి.
  2. హైడ్రోపోనిక్స్‌లో సాగుచేసిన కూరగాయలు పండ్లు సేంద్రియమా? కాదా? అనే ప్రశ్న ఇంకా ప్రజల్లో కొనసాగుతుంది.
  3. ఈ విధానంలో ఎలక్ట్రిసిటీ అవసరం ఎక్కువ ఉండడం వల్ల మధ్యలో కరెంటుతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి.
    ఈ పద్ధతి పూర్తిగా సాంకేతిక పద్ధతి కావడం వల్ల దీన్ని అమర్చుకోవడానికి ముందుగా అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ.
    దీనిలో చీడపీడల బెడద తక్కువ అయినప్పటికీ ఒకసారి ఏదైనా ఆశిస్తే వాటి వ్యాప్తి తొందరగా ఉండును.
  4. కొన్ని సార్లు రైతు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ నష్టాలతో పోలిస్తే లాభాలే ఎక్కువ ఉన్నందున సరైన అనుభవంతో సాగుచేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
Leave Your Comments

సేంద్రియ పద్ధతిలో ఆవాల సాగు..

Previous article

అరకు కాఫీకి దేశీయంగా మంచి గుర్తింపు..

Next article

You may also like