Barseem grass Cultivation: బర్సీమ్ పశుగ్రాసం పాలిచ్చే మరియు పనిచేసే పశువులకు కూడా ప్రముఖంగా వేసేది. పశుగ్రాసం చాలా కాలము, శీతాకాలము, వసంతకాలము మరియు కొంత వరకు వేసవి కాలము అందుబాటులో ఉంటుంది. దీనికి ఉన్న అన్ని సుగుణాల వలన దీనిని పశుగ్రాసాల్లో రారాజు పిలుస్తారు.
వాతావరణం:- చలి వాతావరణం లో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. అతి శీతకాలంలో మరియు వేడిమి మొక్క పెరుగుదలను క్షిణింప చేయను. వేడిమి మరియు తేమ గల వాతావరణం పంటకు నష్టం కల్గించును. దీర్ఘకాలిక చలి మొక్క పెరుగుదలకు మరియు ఎక్కువ పశుగ్రాసం దిగుబడికి దోహదపడును. ఎక్కువ ఉష్టగ్రత్త మొక్క పుష్పంచి విత్తనోత్పత్తి సహకరించును.
నేలలు:- మురుగు నీటి వసతి గల బంకమన్ను నేలలు , భాస్వరం, కాల్షియం మరియు పోటాషియం పోషక నిలువలు ఎక్కువగా ఉన్న నేలలు చాలా అనుకూలం . అధిక క్షార గుణం కల నేలలు మొక్క యొక్క మొలక శాతంనకు హాని కల్గించును . కాని పెరిగిన మొక్కలు కొంత వరకు తట్టుకొంటాయి. నిల్వ పరిస్థితిని పంట ఏ మాత్రం తట్టుకోలేదు.
నేల తయారి:- నేలను బాగా లోతుగా 2-3 సార్లు దాన్ని నాగలి తో మంచిన పడును వచ్చే వరకు దున్నాలి. కాలువలు, బోదులు తయారు చేసుకోవాలి. అవకాశాన్ని బట్టి 6 మీ ల పొడవు 50 సెం. మీ. ఎడంగా 5×4 మీ మడులు చేసుకుంటే మంచిది. నీటి లాభ్యతను బట్టి, నేల వాలును బట్టి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
Also Read: Organic Matter Uses: సేంద్రియ పదార్ధంతో ఎన్నో ఉపయోగాలు.!
రకాలు:- వరదాస్, జేవహర్, బర్సీమ్, మోస్కవి
విత్తనం మరియు విత్తుట:- శీతకాలపు పంట అక్టోబర్ – నవంబర్ మసాలాలో విత్తుకొవాలి
విత్తన మోతాదు:– 20-25 కిలోల / హెక్టారుకు
విత్తే పద్ధతి:- నానబెట్టి విత్తన శుద్ధి చీసిన , మొలకెత్తిన విత్తనాన్ని బాగా తయారు చేసి నీరు పొలం లో వెదజల్లాలి. నీరు ఇంకిపోయే లోగ విత్తనాలు ఏనుకొని మొక్కలుగా తయారగును. విత్తనాలను రైజోబియం టైపోలో అనే ప్రజాతి తో విత్తిన శుద్ధి చేసినట్టున గాలిలోని నత్రజనిని మొక్క యొక్క వేరు బూడిపేలలో స్థిరీకరించి నేల సారాన్ని పెంచి, నత్రజని ఎరువు యొక్క ఆవశ్యకతను కొంత వరకు తగ్గిస్తుంది.
విత్తన శుద్ధి:- విత్తనాలను ఒక రోజు రాత్రాంత నీళ్ళలో నానబెట్టిలి. 10% బెల్లం ద్రావణం తయారు చేసి బాగా మరగబెట్టి మళ్ళీ చల్లర్చవలెను. బాక్టీరియాల్ కల్చరు ను 1. 250 కి / హె బెల్లం ద్రావణం లో నెమ్మదిగా కలపాలి. నానబెట్టి ఉంచిన విత్తనాలను, బెల్లం + కల్చర్ మిశ్రమం లో పోసి విత్తనాలకు పైన పోరలాగా పట్టే విధంగా కలపాలి. ఆ తరువాత విత్తనాలను నీడలో అరబెట్టుపొలం లో వెదజల్లుకోవాలి.
విత్తే దూరం:- సాళ్లలో వేసే పద్ధతి కన్నా వెదజల్లే పద్ధతితోనే ఎక్కువ మొక్క శాతం మరియు పశుగ్రాసం లభించును. అయిన సాళ్లలో వేయునపుడు 20×20 సెం. మీ. దూరంలో విత్తుకోవాలి.
ఎరువులు:- 25 టన్నుల పశువుల ఎరువు దుక్కి లో వేయవలెను. బర్సీమ్ ముఖ్యంగా భాస్వరం ఎరువుకు బాగా స్పందిస్తుంది. 60-80 కిలోల భాస్వరం, 200 కిలోల నత్రజని మరియు 30 కిలోల పోటాష్ ని ఇచ్చే ఎరువులు ఒక హెక్టారుకు అవసరం. భాస్వరం ఎరువులను సూపర్ ఫాస్ఫాట్ రూపంలో వేయడం మంచిది.
అంతర పంటలు: మొక్క జొన్న, ప్రత్తి, వరి మరియు నేపియర్ బజ్రా తో బర్సీమ్ ను అంతర పంటగా వేస్తారు.
అంతర కృషి: బర్సీమ్ పంటలో చికోరి అను కలుపు మొక్క చాలా ప్రమాదకరమైనది. చివరి బర్సీమ్ కోత కోసిన తర్వాత లోతు దుక్కి దున్నినచో చికోరి విత్తనాలను నేల లోపలి పొరలోనికి పోవును.
కోత కోయుట: మొదటి కోత తర్వాత విత్తిన 45 రోజులకు, తదుపరి కోతలు 30 రోజులకొకసారి కోసుకోవాలి.
విష పదార్ధాలు: బర్సీమ్ ఆకులు ఆస్ట్రాజిన్స్ పదార్ధము కలిగి ఉంటాయి. అందువలన ఈ పచ్చి మేతను ఎక్కువగా పూట మంచు సమయంలో పశువులు మేసినపుడు, పశువులలో బ్లోట్ అను వ్యాధి వస్తుంది.
Also Read: Diseases in Calfs: దూడలలో కలుగు వివిధ వ్యాధులు మరియు నివారణ చర్యలు.!