తీపి గుమ్మడి
సమ్మర్ స్క్యాష్
వింటర్ స్క్యాష్
తీపి గుమ్మడి
పై మూడింటికి కూడా మాములుగా గుమ్మడి కాయలు అని పిలుస్తారు. గుమ్మడి మన దేశంలో వీరి వీరిగా సాగులో ఉన్నాయి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండుట మరియు రవాణాకు తట్టుకునే గుణాలు కలిగి ఉంటాయి.వేసవి స్క్యాష్ ను వేసవి లో మాత్రమే సాగు చేస్తారు.గుమ్మడి ఆకులు, లేత కొమ్మలు,పూతను కూడా కూరగాయలు గా వాడతారు.దీని లోని గుజ్జు హాల్వా తయారీకి వాడతారు.ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
వాతావరణం:
వేడి వాతావరణం గుమ్మడి సాగుకు అనుకూలం తీగ పెరుగుదల ఉంటుంది. ఉష్ణోగ్రతా 40 డిగ్రీ. కన్నా ఎక్కువగా ఉంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఎక్కువగా ఆశిస్తుంది.మంచును తట్టుకోలేదు.
నేలలు:
గుమ్మడి మరియు స్క్యాష్ లను అన్ని రకాల నేలల సాగు చేయవచ్చు.మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి.
విత్తన మోతదు మరియు విత్తే దూరము :
ఒక ఎకరానికి 2.4-3.2 కేజీల విత్తనం అవసరం.2 వరుసల మధ్య 3 మీటర్ల వరుసలలో రెండు పాదుల మధ్య 75-90సేం. మీ.ఉండేటట్లు ప్రతి పాదు వద్ద 3-4 గింజలు విత్తుకోవాలి.మొలకలు వచ్చాక బలమైన రెండు మొలకలు ఉంచి మిగిలినవి పెరికి వేయాలి.

Pumpkin Cultivation Methods
Also Read: Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.!
ఎరువులు:
ఆఖరి దుక్కిలో 8-10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.40 కేజీల నత్రజని 40 కేజీల భాస్వరం 20 కేజీల పోటాష్ ఎకరానికి వేసుకోవాలి.40 కేజీల న్ ని రెండు దాఫాలుగా విత్తిన 30 రోజులకి 45 రోజులకి వేసి నీరు ఇవ్వాలి.
అంతర కృషి:
గుమ్మడికి విరివిరిగా నీరు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి కాలువలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.మొక్కలు 2-4 ఆకుల దశలో బోరక్స్ 3 గ్రా. లీ.లేదా ఇథరిల్ 2.5 ఎం. ల్ లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.
కోత:
గుమ్మడి మరియు వింటర్ స్క్యాష్ లను పూర్తి అభివృద్ధి చెందిన తరువాతనే కోయాలి.వీటి కాయ రంగు పసుపు లేదా నారింజ రంగుకు మారిన తర్వాత కోయాలి.కానీ సమ్మర్ స్క్యాష్ కాయ పక్వానికి రాక ముందు అంటే ఆకు పచ్చ రంగు ఉన్నపుడే కోయాలి.మరియు దీనిని ఎక్కువ కాలం నిల్వ చేయరాదు.రవాణా కూడా తట్టుకోలేదు.
దిగుబడి:
రకాన్ని బట్టి 100 -120 రోజులలో పంట కోతకు వస్తుంది.
సరాసరి దిగుబడి 8-10 ట /ఎ వస్తుంది.
నిల్వ:
గుమ్మడి మరియు వింటర్ స్క్యాష్ లను 15-20 సేం. గ్రే.వద్ద రెండు మూడు వారల వరకు 10-15 సేం. గ్రే. వద్ద మరియు 75% తేమ వద్ద 5-6 వారలు నిల్వ చేయవచ్చు.
Also Read: Red Pumpkin Beetle Management: గుమ్మడి పెంకు పురుగు నష్ట లక్షణాలు