Polyhouse Cultivation: పాలిహౌస్ సాగుని రక్షిత సాగు అని కూడా అంటారు. ఈ రక్షిత సాగు మొక్క చుట్టూ ఉండే వాతావరణాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం వలన మొక్కలకు సరైన పరిస్థితి కలిపించి అధిక దిగుబడులు సాధిచవచ్చు.
Also Read: Polyhouse: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో పాలీహౌస్ పాత్ర
పాలిహౌస్ సాగు ఉపయోగాలు:
- పాలిహౌస్ లో సాగు చేయడం వలన వాతావరణ పరిస్థితులను అదుపులో ఉంచడo జరుగుతుంది, సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.
- సాధారణ సాగు కంటే, పంటను బట్టి 4-8 సార్లు అధిక దగ్గర దిగుబడి ఒక యూనిట్ ప్రాంతం నుండి పొoదవచ్చు.
- అంతే కాకుండా బయట సాగు కంటే అధిక నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. అందువలన మార్కెట్ లో మంచి ధర పొందవచ్చు.
- నాణ్యమైన దిగుబడాలను అంతర్జాతీయ మార్కెట్ లో కూడా విక్రయిచ్చి అధిక లాభాలు పొoదవచ్చు.
ఇటువంటి సాగు వలన గ్రామీణ ప్రాంత యువతలకు మంచి ఉపాధి లభిస్తుంది.
పాలిహౌస్ లో ఎటువంటి పూల పంటను సాగు చేసుకోవచ్చు?
పాలిహౌస్ లో మార్కెట్ లో అధిక విలువలు కలిగిన గులాబీ, చెమంతి, జెర్భర, అర్కిడ్స్, సాగు చేసుకోవచ్చు.
పాలిహౌస్ సాగులో ఎదురయ్యే సమస్యలు:
- పాలిహౌస్ లో పూలసాగు అధిక నైపుణ్యంతో కూడుకున్నది.
- ముఖ్యంగా మన ఉష్టమండలో సాగు చేసేటప్పుడు సాగు చేసే ప్రాంతం యొక్క వాతావరణం స్థితిగతులు తప్పక పరిగణలోకి తీసుకువాలి.
- అధిక మిస్టింగ్ చేయడం వల్ల సమస్యలు: వేసవిలో బయట ఉష్టగ్రత్తను బట్టి, మిస్టింగ్ చేసుకోవాలి.
- అలా చేయక పోతే, తెలియకుండా ఎక్కువ సమయం మిస్టింగ్ చేయడం వలన, పాలిహౌస్ అధిక తేమ 0% కంటే ఎక్కవగా ఏర్పడి సీలిద్రాలు ఉధృతి పెరుగుతుంది.
- అంతే కాకుండా తేమ శాతం 60% కన్నా తక్కువగా ఉంటే పురుగు ఉధృతి పెరుగుతుంది. సాగు సమస్యలు అంటే ఉష్ణోగ్రత, తేమ శాతం, గాలి ప్రసరణ, నీటి మరియు నేల నాణ్యత పైన మంచి అవగానహన అవసరం.
పాలిహౌస్ పూల సాగులో చీడపీడల సమస్య:
- గులాబీ రసం పీల్చే పురుగులు ఉధృతి ఉంటుంది. వీటి నివారణకు డైమీతోయేట్ లేదా క్లోరిఫిరిఫస్ 2 మిలి నీటిని కలిపి పిచికారీ చెయ్యాలి.
- బూడిద తెగులు గులాబీ లో బాగా వస్తుంది. దీనికి హేగ్జాకొనిజాల్ 0.5 – 1.0 లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
- గులాబీ లో ఆకుమచ్చ తెగులు కూడా ముఖ్యo అయ్యింది. దీని నివారణకు కెప్టెన్ 2గ్రా లేదా మంకోజెబ్ 2గ్రా కలిపి పిచికారీ చేయవచ్చు.
- జెర్ర్బరాలో కూడా రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు అబమిక్టిన్ 0.4 నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
- అంతే కాకుండా ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు నివారణకు రిడోమిల్ ఏం జెడ్ 2గ్రా లీటర్ నీటికి కలిపి డ్రిప్ ద్వారా మొక్క మొదలు కి నీళ్లు ఇవ్వాలి.
పాలిహౌస్ సాగులో నులి పురుగుల సమస్య నివారణ:
- పాలిహౌస్ పూల సాగు లో నులి పురుగుల పెరుగుదలకు అనువైన వాతావరణం పరిస్థితిలు ఉండడం వలన వాటి తాకిడి అధికంగా ఉంటుంది.
- అధిక ఉష్ణోగ్రత, తేమ, అధికంగా ఎరువులు వెయ్యడం వల్ల నులి పురుగుల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. వీటి వలన మొక్కలు పూర్తిగా చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది.
- నులి పురుగుల వలన మొదటి ఆకులు పసుపు రంగులోకి మరడo, మొక్కల పెరుగుదల తగ్గిపోవాడం జరుగుతుంది.
- దీని నివారణకు పాలిహౌస్ బెడ్ లు తయారు చేసె సమయంలో క్యాబోఫురాన్ లేదా ఫొరెట్ గుళికలను 50గా చల్లాలి.
- ఎరువు మిశ్రమo తయారు చేసుకోవడానికి ఒక టన్ను పెంట ఎరువులు 2కి. లోల హార్జియనం లేదా సూడోమోనస్ కలిపి నీళ్ళు చల్లి మిశ్రమం పైన కవర్ కప్పి 15రోజులు కుళ్లాబెట్టడం వలన శిలింద్రాలు వృద్ధి చెంది నులి పు రుగు నివారణకు ఉపయోగపడతాయి.
- మొక్కలు పెరుగుదల సమయంలో నులి పురుగుల నివారణకు ఫోరెట్ గుళికలు 6గ్ర లేదా బెనమిల్ 2గ్ర కలిపి బెడ్ మీద కలిపి పోయాలి.
ఎరువులు, సూక్ష్మ పోషకలోప సమస్య:
- పాలిహౌస్ పూలసాగులో రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిచడం జరుగుతుంది. అందుకే నీటిలో కరిగే ఎరువులను వినియోగించాల్సిన అవసరం ఉంది.
- ఈ విధంగా చేయడం వలన 50%వరకు నీటిని మరియు 20-40% వరకు ఎరువులను ఆదా చేసుకోవచ్చు.
- గులాబీలో ప్రతి వారానికి ఒక చెదారపు మీటరకు 2.63 గ్ర 19:19:19,4.34 గ్రా మ్యుటేట్ అఫ్ పొట్టష్ అందించాలి.
Also Read: Hydroponic Farming :హైడ్రోపోనిక్ ఫార్మింగ్ మోడల్‌తో బిజినెస్ ఐడియా
Leave Your Comments