Coriander Crop Cultivation – ప్రాముఖ్యత: అన్ని వంటకాల్లో ఉపయోగించే సామాన్య మసాలా దినుసులలో ధనియాలా గింజ పొడి ఒక్కటి. పచ్చి ఆకులు వివిధ వంటకాలలో సువాసన కొరకు వేస్తారు. ధనియాలు అనేక ఔషదా గుణాలు కల్గిఉంది. భారతదేశం లో అన్ని రాష్ట్రాలలో పండిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 1 లక్ష హెక్టర్లలో పండిస్తున్నారు.
వాతావరణం: చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలం.
నేలలు: వర్షాధారం కింద నల్ల రేగడి నేలలు.
నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలిక పాటి నేలలు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల, క్షార గుణాలు కలిగిన భూమి ఈ పంటకు అనుకూలం కాదు.
విత్తే కాలం: అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు.
నీటి ఆధారం కింద నవంబర్ నేల ఆఖరు వరకు విత్తుకోవచ్చు.
ధనియాలు ఆకుల కోసం సంవత్సరం పొడవున విత్తుకోవచ్చు. వేసవిలో షెడ్ లు వేసుకుంటే దిగుబడి వస్తుంది.
Also Read: Pumpkin Cultivation Methods: గుమ్మడి సాగు విధానం
నేల తయారీ, విత్తడం: మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్నలి. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోపు నెలలోని తేమను బట్టి విత్తుకోవాలి. సాలుకి సాలుకి 30 సేం. మీ.మొక్కకు మొక్కకు 10 సేం. మీ. ఎడం ఉండేటట్లు గొర్రు తో విత్తుకోవాలి. విత్తనాలను బద్ధలు చేసి విత్తితే విత్తనం ఆదా అవడం తో పాటు మొలక 2-3 రోజుల ముందే వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నాన బెట్టి, అరనించి విత్తినట్లు అయితే విత్తనం త్వరగా మొలకేత్తుతుంది.
ఎకరాకు 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం ఎకరానికి 600 గ్రా.చొప్పున విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి ఇలా చేస్తే దిగుబడి 6-7% పెరిగే అవకాశం ఉంది. ఎండు తెగులు ఆశించే ప్రాంతంలో ధనియాలు సాగు చేయరాదు. లేదా పంట మార్పిడి 2-3 సార్లు చేయవచ్చు. వేసవిలో లోతు దుక్కి దున్నడం వలన బూజు తెగులును అదుపులో పెట్టుకోవచ్చు. 1గ్రా. కార్బడిజం 1 కిలో విత్తనానికి కలిపి చేయడం విత్తన శుద్ధి చేయడం వలన తెగులు నివారణ చేయవచ్చు.
ఎరువుల యాజమాన్యం: వర్షాధారం కింద నల్ల రే గడి నేలల్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 25 కిలోల యూరియా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 15 కిలోల మ్యూరేట్ అఫ్ పోటాష్ ఎరువులను వేయాలి.
కోత: రకాన్ని బట్టి 40- 45 రోజులకు పూత మొదలై 80-110 రోజులకు పక్వానికి వస్తాయి.60% గింజలు పక్వానికి వచ్చినప్పుడు పంటను కోయాలి. పంట ఉదయం పూట మాత్రమే కోయాలి. కోసిన తర్వాత 2-3 రోజులు పొలంలో నే అరనించి నూర్చాలి.
విత్తనం నిల్వ చేయుట:
నిల్వ ఉంచిన సంచులపై మాలధియన్ వేయాలి.
విత్తనాన్ని అప్పుడప్పుడు ఎండ బెట్టడం చేయాలి.
Also Read: Water Taking Methods: నీటి వనరుల నుండి పొలం లోకి నీరు తీసుకొని పోవు పద్ధతులు