Camphor Banana: ఓ స్పూర్తి మనిషిని బుషిని చేస్తుంది. ఓ ప్రోత్సహం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఓ ప్రేరణ ఎందరికో మార్గదర్శకం ఆవుతుంది…కంప్యూటర్ వదిలి నాగలి పట్టాడు.. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాడు నెల్లూరుకు చెందిన రైతు ప్రసాద్. ఉన్నతమైన చదువు, అమోరికాలో మంచి ఉద్యోగం. లక్షలలో జీతం అయినా ఎదో ఆసంతృప్తి, ఎదో సాధించాలని తపన. వ్యవసాయంపై ఇష్టంతో సొంత ఊరుకు చేరుకున్నాడు. ఆ యువరైతు గురించి మనం ఇప్పుడు ఏరువాకలో తెలుసుకుందాం
పలువురికి ఆదర్శప్రాయం: నెల్లూరు జిల్లా, కె కోట మండలం, సాగిపాడు మండలంలో అతనికి 25 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఎలాగైనా ప్రకృతి వ్యవసాయం చేసి పలువురికి ఆదర్శప్రాయం అవ్వాలని అనుకున్నాడు. అంతే ఉద్యోగం మానేసి కొన్ని రోజులు పాలేకర్ వద్ద శిక్షణ పొందాడు. ప్రకృతి వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పొలంలో దిగిపోయాడు. ఇప్పుడు ఆఇంజనీర్ చేసిన అద్భుతాలను చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి రోజుకు వంద మంది దాకా రైతులు వస్తున్నారు.
Also Read: Summer Banana Garden: ఎండాకాలం అరటి తోటని ఎలా ప్రారంభించాలి.?
అంతర పంటగా కర్పూరం రకం అరటి: ప్రసాద్ వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ వ్యాపకాలపై కూడా ఆసక్తి ఏర్పడింది. ముందుగా తనకున్న పొలంలో కొబ్బరి, అందులో అంతర పంటగా కర్పూరం రకం అరటి మొక్కలను నాటాడు. వీటికి తోడు కోకో, పశుగ్రాసం సాగును కూడా ప్రారంభించాడు. యంత్రాలకు బదులు చిన్నపాటి టిల్లర్ ను రంగంలోకి దింపాడు. కూలీల సమస్యలను కూడా తగ్గించుకున్నాడు. ఇలా రసాయనాలు తగ్గించుకుంటూ పొలం మొత్తం గో ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టాడు. రసాయన ఎరువులను బదులుగా మొక్కల వద్ద ఆవు పేడతో నింపడం ప్రారంభించాడు. మొక్కళ్ల మొదళ్ల వద్ద 9 అంగుళాల లోతు గుంతలు తీసి వర్షపు నీరు ఇంకేలా చేశారు.. కొబ్బరి ఆకులను కూడా సేంద్రీయ ఎరువుగా తయారు చేసుకుని వాడటం ప్రారంభించాడు. పొలంలో నాటిన మొక్కలు మొత్తానికి మల్చింగ్ చేయడంతో నీటి వాడకం కూడా గణనీయంగా తగ్గింది.
రూ.18 లక్షల ఆదాయం: ప్రసాద్ వ్యవసాయం ప్రారంభించినప్పుడు అతని పొలంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. నేల పరిస్థితులను గమనించి తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం వచ్చేలా పాలేకర్ విధానాలు అమలు చేశారు. జీరోబడ్జెట్ సాగు ప్రారంభించారు. ఆవుపేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన జీవామృతంతో రసాయనక ఎరువుల ఖర్చు తగ్గించుకున్నాడు. మల్చింగ్ విధానాలు అమలు చేసాడు. బహుళ పంటలు పండించడం ద్వారా రూ.18 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. విజయవాడలో సేంద్రీయ ఉత్పత్తులను విక్రయించడానికి రిటైల్ అవుట్‌లెట్ తెరవడం ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోందని ప్రసాద్ సగర్వంగా చెబుతున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి రోజుల్లో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు ఇంజనీర్, రైతురాజు అని నిరూపించాడు ఆ యువరైతు, వ్యవసాయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదన ఈరైతు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతూ, ప్రకృతితో మమేకం కావచ్చు అంటున్నాడు ప్రసాద్. అందుకే యువత వ్యవసాయంలోకి రావాలని పిలుపు నిస్తున్నారు.