ఉద్యానశోభ

అరటిలో సస్య రక్షణ చర్యలు ..

0

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో అరటి ప్రధానమైనది. ఒక్కసారి నాటితే రెండు నుండి మూడు సంవత్సరాల వరకు రైతులు గెలల దిగుబడులను తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా అరటి తోటలను చీడపీడల బెడద ఎక్కువడంతో రైతు ఒకటి రెండు పంటలకే అరటి చెట్లను తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అరటి పంట సాగులో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు సిగటోకా ఆకుమచ్చ తెగుళ్ళు. మొక్క దశ నుండి గెల కోత వరకు ఈ తెగుళ్ల బెడద అరటిని వెంటాడుతుంది. వీటితో పాటు పనామా, దుంపకుళ్ళు తెగుళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకొని తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిక మించవచ్చునని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
సిగటోకా ఆకుమచ్చ తెగులు:
వర్షాకాలం జూన్, జులై నెలల్లో మొదలై నవంబర్ వరకు ఈ తెగులు ఉంటుంది. ముఖ్యంగా టిష్యుకల్చర్ అరటి మొక్కలలో ఎక్కువగా ఉంటుంది. ఇది మొట్టమొదటగా ఆకులమీద లేత పసుపు రంగులో మొదలై ఆకులంతా వ్యాపించి ఆకు అంతా కూడా మాడిపోయినట్టుగా తయారవుతుంది. మొక్కకి కిరణజన్య సంయోగక్రియ తగ్గి కాయ నాణ్యత లోపిస్తుంది. ఎప్పుడైతే మొక్కనుంచి గెల బయటకి వచ్చిందో ఈ తెగుళ్ళ ఉధృతిని అరికట్టకపోతే కాయ నాణ్యత ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. దీనికి ప్రధానంగా అరటి మొక్కలు వేసిన తోటను పరిశుభ్రంగా ఉంచాలి. తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. అలాగే దుంపని మంచి చోట నుంచి సేకరించాలి. విత్తన దుంపలనకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ఎండుటాకులను, ఎందుకొమ్మలను ఎప్పటికప్పుడు తీసి కాల్చివేయాలి.
నివారణ:
వర్షానికి ముందు అయితే మాంకోజెబ్ లేదా క్లోరోధాలోనిల్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మొదట వచ్చిన చిన్న మచ్చలను అరికట్టవచ్చును. వర్షం పడిన తర్వాత ఈ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రొపికొనజోల్ 1మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా పిచికారీ చేసిన తరువాత మచ్చల వ్యాప్తిని చాలా వరకు నివారించవచ్చును. తరువాత 20 రోజులకి ప్రొపికొనజోల్ 0.5 మి.లీ. + 10 మి.లీ. మినరల్ ఆయిల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసినచో తెగుళ్లను వ్యాప్తి చేసే కారకాలను శిలీంధ్ర బీజాలు సమూలంగా నాశమై, గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ శిలీంధ్ర బీజాలు అన్ని కూడా నశిస్తాయి.
అరటి తోటలో ఆశించే అతి ప్రమాదకరమైన తెగుళ్ళు పనామా ఎండు తెగులు, దుంపకుళ్ళు . బాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ళ వల్ల ఒక్కోసారి పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పనామా ఎండు తెగులు:
ఈ తెగులు అరటి లో ముఖ్యమైన సమస్య. ఇది ఎక్కువగా అమృత పానీ రకం అరటి లో ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్లు సోకిన మొక్కల ఆకులు ఎండిపోయి, పండుబారిపోయి తొడిమ దగ్గర విరిగిపోయి వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే కాండం మీద నిలువ పగుళ్ళు ఏర్పడతాయి. ఈ తెగుళ్ళు ఆశించక కుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య కరమైన పొలం నుంచి విత్తనాన్నికానీ, దుంపల్ని కానీ స్వీకరించాలి.
నివారణ:
నాటేముందు కార్బండిజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనపు దుంపలను 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నాటిన తరువాత 3,5,7 వ నెలల్లో కార్బండిజమ్ 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి.
దుంపకుళ్ళు నివారణ:
దీనిని బాక్టీరియా ఎండు తెగులు అని కూడా అంటారు. 25 గ్రా. బ్లీచింగ్ పౌడర్ లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి.

Leave Your Comments

కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

స్టీవియా ఆకులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like