Backyard Gardening: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజలు తమ ఇంటి అవరణం లో, కుడిల్లాలో /కంటే ప్లాస్టిక్ ట్రేలలో కూరగాయలు, పండ్ల మొక్కల్ని పెంచుకొని తమకు సరిపడ తాజా గా ఉన్న కూరగాయలు, పండ్లు వివిధ రకాలు అయ్యినవి పోదవచ్చు. ప్రతి వ్యక్తి రోజుకి కనీసం 85గ్రా, పండ్లు,85-125 గ్రా ఆకు కూరలు,85గ్రా కూరగాయలు,85గ్రా దుంప కూరలు తీసుకుంటే కావలిసిన పోషకాలు లభిస్తాయి. పెరట్లో, కుండీలో కుటుంబానికి ఏడాదికి సరిపడా కూరగాయలు పండించుకోవచ్చు.
కూరగాయలు పెంచే స్థలాన్ని దీర్ఘ చతుస్రకారం లో చిన్న చిన్న మడులు గా విభజంచాలి. వాటి పక్కన నీటి కాలువల, బాటలు వెయ్యాలి. చుట్టూరు కంచెఏర్పాటు చేసి వాటిపై సొర కాకర, చిక్కుడు, వంటి తీగ జాతి మొక్కలను వేసి కాలువ గట్లపై క్యారెట్, ముల్లగి నాటాలి. మునగ కరివేపాకు, అరటి, బొప్పాయి వంటి వంటి పండ్ల జాతి చెట్లను ఒక పక్కగా నాటాలి. ఒక మూలాన కంపోస్ట్ గుంత ఏర్పాటు చేసుకొవాలి. పండ్ల మొక్కల నీడ కూరగాయల మొక్కపై పడకుండా నాటుకోవాలి.200చమి స్థలం, రోజుకి 600లీటర్ నీరు ఉంటే సమర్థంగా పెరటి తోటలు పెంచుకోవచ్చు.
సీజన్ కు అనుకులం గా వివిధ కూరగాయలిన్ని ఎపిక చేసుకోవాలి. ఏడాది అంత తాజా కూరగాయలు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయనుకోవాలి. టమాటో, వంగ , మిరప, క్యాబేజి, కాలి ఫ్లవర్ వంటివి నారు పెంచి నాటాలి. ఇంటి డాబా పైన, పరిసరాల్లో సేంద్రియ పద్ధతి లో కూరగాలన్ని పెంచుకుంటే ఎలాంటి విష అవశేషాలు లేని నాణ్యమైన, తాజాకూరగాయలు పొందావచ్చు. పెరటి పనుల వల్ల కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.40-50 చ. మీ స్థలంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించవచ్చు. కాంటెనర్ లలో మట్టిని ఏడాది కి ఒకసారి మార్చాలి.
Also Read: Management of Green Gram and Black Gram:పెసర, మినుము యాజమాన్య పద్ధతులు.!
పాంటింగ్ మిశ్రమం ల్లో మట్టి, ఇసుక, వేప పిండి, జీవన ఎరువులు సమాపళ్ళలో ఉండాలి. డాబా పై పెంచే వారు ఇంజినిర్ తో ఇంటిపై కప్పు ఎంత గట్టిగ ఉందో పరీక్షంచాలి. పెంచే మొక్కలల్ని బట్టి కుండీలు ఎంచుకోవాలి.2భాగాలు ఎర్రమట్టి +ఒక భాగం ఇసుక + ఒక భాగం కంపోస్ట్ మట్టి మిశ్రమాన్ని వాడుకోవచ్చు. కుండీలా అడుగున నీరు పోయేదుకు రంద్రం ఉండాలి.
ఇది మూసుకుపోకుండా చిన్న చిన్న పెంకులతో కప్పి దాని పై గరకు ఇసుక, ఎండు తాటాకులు , మట్టి తో కప్పాలి. వీలు అయ్యినత వరకు తేలికగా ఉండే వర్మీ కంపోస్ట్, కొబ్బరి పొట్టు, వేరు సెనగ పొట్టు, వరి పొట్టు, అధికంగా ఉండే సేంద్రియ ఎరువులు వాడడం మేలు. నెలకొకసారి మొక్కలకు 100గ్రా వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. సస్య రక్షణ మందులు వాడకుండా వీలు అయ్యింత వరకు సేంద్రియ పద్ధతులలోనే చీడ పిడల్ని నివరించాలి. దీని వల్ల మనకు ఎటువంటి కాలుష్యం ఉండదు. అలాగే మనం రోజు ఆరోగ్యం అయినా ఆహారం తీసుకోవచ్చు. తక్కువగా పెట్టుబడి అవుతుందు. వీలు అయింత వరకు సేంద్రియ ఎరువులును వాడడం మంచింది.
Also Read: Measuring Seed Germination: విత్తనాల్లో మొలకశాతం లెక్కించడం.!