Anjeer Fruit Cultivation: మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట ఇప్పి చూడు పురుగులుండు.. కానీ దాని తిని చూడు..ఆరోగ్యం మొండుగా ఉండు. అంజీరలో ఉండు ఆరోగ్యలక్షణాలు ఉపాది ఆవకాశాలను పెంచుతున్నాయి. ఈపండును మొట్టమొదటిసారిగా మానవుడు తిన్న పండుగా చెబుతారు.. 11000 సంవత్సరాలు క్రితం కూడా ఆహరంగా ఈపండును తిన్నారని కొంతమంది చెబుతారు.. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరీ ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టునుండి తీసిన పండులో ఎలాంటి ఉత్పుతులు తయారుచేయవచ్చు అనేవి మనం ఈరోజు ఏరువాకలో తెలుసుకుదాం
ఆయుర్వేదంలో ఆంజీర ఆరోగ్య ప్రధాయిని
సంపూర్ణ ఆరోగ్యానికి దివ్వ ఔషదంగా పని చేసే ఫలాల్లో అంజీర ముందు వరుసలో ఉంటుది. ఈతోటలు ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పండిస్తారు.. భారత్ లో 1500 సం క్రితం నుంచి అంజీరా వినియోగం జరుగుతుంది.. ఆయుర్వేదం కూడా ఆంజీరను ఆరోగ్య ప్రధాయినిగా గుర్తించింది.. ఇటివల కాలంలో మనదేశంలో ఆంజీరను వాణిజ్యపంటగా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో వాణిజ్య పంటగా విస్తారంగా సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో 5వేల ఎకరాలలో అంజీరా సాగు ఆవుతుందని అంచనా.. అంజీరా చెట్టు నాటిన 9 నెలలు నుండి 15 సంవత్సరాలు వరకు పండ్లను ఇస్తుంది.. ఒక్కొక్క చెట్టు నుండి 20 కేజీలు నుండి 60 కేజీలు వరకు దిగుబడిని ఇస్తుంది.
Also Read: Lipstick Seeds Farming: లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే… ఆంధ్రప్రదేశ్‌లో సాగు
ఎకరాకు రెండు లక్షల ఆదాయం
మనం తినే పళ్లలో ఎక్కువ ప్రోటిన్లు కలిగిన పండు అంజీర ఉండటం విశేషం. అంజీరా పండులో ఎన్నో ఔషద గుణాలున్నాయి. ఈఅంజీరా గురించి తెలుసుకొని పంట వేసిన రైతులకు ఎకరాకు రెండు లక్షల ఆదాయం పొందుతున్నారు. నీటి ఎద్దడిని ఏమాత్రం తట్టుకోలేని ఈఅంజీరను జల లభ్యత ఆధారంగా సహజ పద్దతులలో ఆశాజనక దిగుబడులను తీస్తున్నారు. అంతేకాకుండా ప్రాసెసింగ్ చేసి ఆధిక లాభాలను పొందుతున్నారు.
ఉద్యానశాఖ ప్రోత్సాహం
అంజీర పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటి, మలబద్దకాన్ని నిరోధించి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది.. పోటాషియం సోడియం లభిస్తుంది.. పురుగుమందులు లేని పండ్లు కూరగాయలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. అయితే ఈంటలను సాగుచేయడానికి ఉద్యానశాఖ ప్రోత్సాహం కల్పిస్తుంది.. రైతులు కేవలం పంటలపైనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని అంటారు. తద్వారా అన్నదాతలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
Also Read: Tomato Crop Cultivation: ఏ కాలంలో వేస్తే టమాటా పంటలో మంచి లాభాలు వస్తాయి.!