ఆరోగ్యం / జీవన విధానంఉద్యానశోభ

Damask Rose Oil: ఈ పూవ్వుల నూనె కిలో 12 లక్షలు..

1
Bulgarian Damask Rose
Bulgarian Damask Rose

Damask Rose Oil: గులాబీ పువ్వులు అందరికి చాలా ఇష్టం. గులాబీ పువ్వులను సాధారణంగా సుగంధ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, అలంకరణలో , అలంకరణ వస్తువుల తయారీలో వాడుతారు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో గులాబీ పువ్వులను సాగు చేస్తున్నారు. అని గులాబీ పువ్వుల కంటే డమాస్క్ రోజ్ చాలా ప్రత్యేకం అయినది. ఈ డమాస్క్ రోజ్ అనేది గులాబీ పువ్వులో ఒక హైబ్రిడ్ రకం. ఈ డమాస్క్ రోజ్ సాధారణ గులాబీ పువ్వులతో పోలిస్తే చాలా ఎక్కువ.

ఈ డమాస్క్ రోజ్ సిరియా దేశంలో పుట్టి ప్రస్తుతం అని దేశంలో వాటి డిమాండ్ చూసి సాగు చేయడం మొదలు పెట్టారు. ఈ పూవులని సాగు చేయ్యడానికి రైతులకి శిక్షణ కూడా ఇస్తున్నారు. మన దేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్‌ ప్రాంతంలో ఈ శిక్షణ కారిక్రమాలు జరుగుతున్నాయి.

డమాస్క్ రోజ్ పెర్ఫ్యూమ్‌లు, సుగంధ ద్రవ్యాల తయారీలో వాడుతారు. పాన్ మసాలా, రోజ్ వాటర్‌ తయారీకి, ఆహారాన్ని రుచిగా మార్చడానికి, అలంకారంగా, హెర్బల్ టీగా కూడా ఈ గులాబీలను వాడుకుంటారు. డమాస్క్ రోజ్ పూల రేకులు కూడా తింటారు. డమాస్క్ గులాబీ నాణ్యత బాగుటుందిని కిసాన్ తక్ సమస్త చెప్పడంతో మన దేశంలో కూడా ఈ పూవ్వులకి డిమాండ్ పెరిగింది. ఈ పూవ్వుల నుంచి తీసే నూనె ఒక కిలో మార్కెట్లో 10-12 లక్షలు ధర ఉంది. మార్కెట్లో ఈ పూవ్వులకి ఎక్కువ ధర ఉండడంతో రైతులు డమాస్క్ రోజ్ని పండించడానికి ఇష్టపడుతున్నారు.

Also Read: Intercropping: అంతర పంటలు – ఆవశ్యకత

Damask Rose Oil

Damask Rose Oil

మార్కెట్‌లో డమాస్క్‌ రోజ్‌ డిమాండ్‌, ధర ఎక్కువగా ఉన్నపటికీ, వీటి నుంచి తీసే నూనె ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ పూవ్వుల నుంచి ఒక కిలో నూనె తీయడానికి దాదాపు మూడున్నర టన్నులు డమాస్క్‌ గులాబీలు కావాలి. అందుకే ఈ పూవ్వుల నుంచి తీసే నూనె చాల ఖరీదు. ఈ పూవ్వుల ధర, డిమాండ్ ఎక్కువ ఉన్న కూడా దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. పూవ్వుల నుంచి నూనె తీసే సమయంలోనే రోజ్ వాటర్ వస్తుంది. వేరే గులాబీ నుంచి తీసిన రోజ్ వాటర్ కంటే ఈ పూవ్వుల రోజ్ వాటర్ చాలా సువాసనగా ఉంటుంది. డమాస్క్‌ గులాబీ నూనె పెర్ఫ్యూమ్ తయారీలో కేవలం రెండు, మూడు చుక్కలు వాడుతారు.

ఈ పూవ్వుల నుంచి తీసిన నూనెని గాజు సీసాలో నిల్వ చేయకూడదు. గాజు సేసా సూర్య కాంతిని గ్రహించుకొని నూనెలో ఉండే సమ్మేళనాలను తగ్గిస్తాయి. సూర్య కాంతి గ్రహించడంతో నూనె నాణ్యత తగ్గుతుంది. ఈ నూనెని అల్యూమినియం టిన్లో నిల్వ చెయ్యాలి. ఈ డమాస్క్‌ రోజ్‌ పూవ్వులు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఈ పూవ్వులని సాగు చేయడానికి, సాగు పద్దతిని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Also Read: Nutrition Gardens: పోషకాలు పుష్కలం – పోషకాహార తోటల పెంపకం

Leave Your Comments

Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Previous article

Desert Vegetable Farming: ఎడారిలో కూరగాయల సాగుకి 5 లక్షల లాభాలు ఎలా.!?

Next article

You may also like