మన వ్యవసాయం

Horse gram cultivation: ఉలవల పంట లో సమగ్ర ఎరువుల యాజమాన్యం

0

 Horse gram రాష్ట్రంలో ఖరీఫ్లో మొదటి పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు, తొలి దశలో వున్న పండ్ల తోటలలో ఉలవ పంటను సాగుచేయవచ్చు. ఈ పంటను గద్వాల మరియు రంగారెడ్డి జిల్లాల్లో సాగుచేస్తారు.

నేలలు: బాగా నీరు పట్టి ఉంచే చల్కా, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండి. ఎక్కువగా చౌడు కల్గిన నేలలు పనికిరావు.

పంటకాలం/అనువైన సమయం: సాధారణంగా రబీకి/ లేట్ ఖరీఫ్ ముందు మరియు రబీలో పండించవచ్చు. ఆగష్టు రెండవ పక్షం నుండి అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చును. నేల తేమను/ నీరును నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాలలో మొదటి పంటను దృష్టిలో వుంచుకొని సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారం చేసుకొని మంచి పంటను పండించవచ్చును.

విత్తన మోతాదు: సాళ్ళ పద్ధతిలో, గొర్రుతో ఎద పెట్టినప్పుడు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం వాడాలి.

విత్తనశుద్ధి: ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా, కార్బండాజిమ్లేదా ధైరమ్ విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

విత్తే దూరం: సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

సమగ్ర ఎరువుల యాజమాన్యం:

సేంద్రియ ఎరువులు: ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కిలో వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ భూమిలో కలియ దున్నాలి.

జీవన ఎరువులు: విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించి. ఉపయోగించవలెను. 100 మి.లీ, నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా, రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తు కోవాలి.

కీలక దశలలో ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ను, 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకొనవలెను.  ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును.

రసాయనిక ఎరువులు: ఎకరాకు 4 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ మరియు 10 కిలోల భాస్వరం నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోల యూరియా, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి.

Leave Your Comments

Wild Brinjal Pests: అడవి వంకాయ తెగుళ్ల యాజమాన్యం

Previous article

Alasanda cultivation: అలసంద పంట లో కలుపు మరియు నీటి యాజమాన్యం

Next article

You may also like