1.తేనె ప్రవాహ కాలంలో నిర్వహణ:
❖ తేనె నిల్వ కోసం పెట్టెలో తగినంత స్థలాన్ని అందించడం.
❖ రాణి తేనెటీగ కదలికను సూపర్ ఫ్రేమ్లో పరిమితం చేయడానికి క్వీన్ ఎక్స్క్లూడర్ను ఉపయోగించాలి.
❖ కొత్త తెట్టే తయారు చేయడానికి ఫౌండేషన్ షీట్లతో ఖాళీ ఫ్రేమ్లను బీ హైవ్ లో అమర్చాలి.
❖ సూపర్ని తనిఖీ చేసి మరియు తేనె కోసం పూర్తిగా మూసివేసినప్పుడు సూపర్ ఫ్రేమ్లను తీసి తేనె వెలికితీయాలి.
- పుప్పొడి అందుబాటులో లేని కాలంలో నిర్వహణ:
❖ బ్రూడ్ ఛాంబర్లోని ఖాళీ తెట్టెలని తొలగించాలి.
❖ డమ్మీ డివిజన్ బోర్డ్ని ఉపయోగించి తేనెటీగల కదలికలను కొద్ది ప్రాంతానికి పరిమితం చేయాలి.
❖ చక్కెర సిరప్తో కృత్రిమంగా ఆహారాన్ని అందించాలి.
❖ సహజ పుప్పొడి లేదా పుప్పొడి ప్రత్యామ్నాయం లేదా పుప్పొడి సప్లిమెంట్ అందించాలి.
❖ ఖాళీ తెట్టెలను సరిగ్గా నిల్వ చేయాలి.
❖ కాలనీలు చాలా బలహీనంగా ఉంటే వాటిని ఏకం చేయాలి.
Also Read: తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్న మహిళలు
- ప్రత్యేక నిర్వహణ పద్ధతులు:
❖ గాలులు మరియు వర్షపు రోజులలో చక్కెర సిరప్ అందించండి.
❖ వేసవిలో తేనెటీగలకు వెంటిలేషన్ను పెంచడం కొరకు బ్రూడ్ ఛాంబర్ మరియు సూపర్ ఛాంబర్ల మధ్య స్ప్లింటర్ అమర్చాలి.
❖ పురుగు మందులను పిచికారీ చేసినపుడు తేనెటీగలను నుండి రక్షించడానికి ప్రవేశ ద్వారం ఒక్క రోజు పాటు మూసివేయాలి.
❖ కాలనీ అత్యంత దూకుడుగా ఉంటే రాణిని బదిలీ చేయాలి.
❖ తేనెటీగలను ఇతర ప్రదేశాలకు తరలించడం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి.
- షుగర్ సిరప్ తయారీ:
❖ వేడినీటిలో చక్కెరను కరిగించండి (1:1 పలుచన)
❖ నీటిలో చెక్కరను కలుపుతూ పూర్తిగా కరిగించాలి.
Also Read: తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోండి….