మన వ్యవసాయం

నువ్వుల సాగుతో అధిక లాభాలు..

0

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినపల్లి గ్రామానికి చెందిన రైతులు ఐదేళ్లుగా విత్తనోత్పత్తి కోసం నువ్వుల సాగు చేస్తూ అధిక లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు. గత మూడేళ్ళుగా జగిత్యాల తిల్ – 1 రకం నువ్వులను పండిస్తూ రెట్టింపు లాభాలను గడిస్తున్నారు.
సాగు విధానం:
నువ్వుల పంట కాలం 90రోజులు కావడంతో పసుపు పంట తీశాక జనవరి 15 నుంచి ఫిబ్రవరి 10 విత్తేందుకు దుక్కిదున్నిన తరువాత రోటవేటర్ వేసి ఎకరాకు 2.5 నుంచి 3 కిలోల చొప్పున నువ్వులు చల్లి గొర్రు తొలుస్తారు. పసుపు అడుగు భూమికావడంతో కావాల్సినంత పోషకాలు లభించడంతో ఎలాంటి ఎరువులు వాడరు. ఎకరాకు 50 కిలోల డీఏపీని వినియోగిస్తారు. డ్రిప్ ద్వారా నీరు అందించి విత్తిన 20 రోజుల తర్వాత కలుపు తీస్తారు. ఈ విధానం ద్వారా నీటిని పెట్టడంతో గడ్డి పెద్దగా పెరగదు. చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండటంతో ఎలాంటి సస్య రక్షణ మందులు వాడరు.
సాధారణ నువ్వు విత్తనాల ద్వారా ఎకరాకు 3.5 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జగిత్యాల తిల్ – 1 రకం విత్తనాలను విత్తనోత్పత్తి కోసం సాగు చేయడంతో 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. నువ్వు కర్ర 4 నుంచి 6 అడుగుల వరకు ఎత్తు ఒక్కో కర్రకు 20 నుంచి 25 వరకు గొలుకలు వచ్చి ఒక్కో గొలకు 6 కాయలు కాస్తాయి.

Leave Your Comments

కోవిడ్ సోకినప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.. అలవాట్లు

Previous article

విత్తనం కొనుగోలులో రైతులు తస్మాత్ జాగ్రత్త..

Next article

You may also like