Groundnut Seed Selection: వేరుశనగ రాష్ట్రంలో విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట. వేరుశనగ ప్రధానంగా యాసంగిలో మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, అనంతపురం మరియు కరీంనగర్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరి నేలలు మరియు తుంపర (స్ప్రింక్లర్ల) పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ వేరుశనగ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. వేరుశెనగ నూనె వివిధ ఆహార పదార్థాలు తయారు చేయడానికి వంట మాధ్యమం. ఇది ఆసియా ప్రజలకు కూరగాయల నూనె అవసరం యొక్క ప్రాథమిక మూలం.
Also Read: Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు
విత్తుకునే సమయము: ఖరీఫ్లో వేరుశనగ పంటను జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను యాసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబరు రెండవ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
నేలలు మరియు నేల తయారీ: ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 1 గ్రా., టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రా., మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం ఖరీ కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో ఒక మి.లీ., ఇమిడాక్లోప్రిడ్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి.
వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ., క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే కిలో విత్తనానికి 200 గ్రా., రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తే పదు వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి విత్తుకోవా 10గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు.
విత్తన ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
నాణ్యత కలిగిన మంచి మొలకశక్తి కలిగిన విత్తనాలను ఎన్నుకోవాలి. గుత్తిరకాలలో 90-95% వరకు మరియు తీగ రకాల్లో 85-90 % మొలక శక్తి ఉండవలెను. మొలక శక్తి 85% కన్నా తక్కువ కలది తీసుకోకూడదు. సాధారణంగా విత్తనం కొరకు ఉంచిన వేరుశనగను, కాయల రూపంలో నిల్వచేసి విత్త ముందు గింజలను వేరు చేయవలెను. గింజలను వేరుచేసేటపుడు గింజపై పొర బాగా వుండి రంగు సమానంగా వున్న విత్తనాలను ఎన్నుకోవాలి. బీజకవచం తొలగిన గింజలను కాని లేక బద్దలైన గింజలను కాని విత్తుటకు వాడరాదు.
Also Read: Bud and fruit dropping in trees: కాయ, పిందె రాలుట కు కారణాలు మరియు అరికట్టే పద్ధతులు