మన వ్యవసాయం

Greenhouse Gases Effect: భూమి వేడెక్కడం వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు.!

0

Greenhouse Gases Effect: CO, NO, NO, క్లోరో ఫ్లోరో కార్బన్లు, హైడ్రో కార్బన్లు, మీథేన్ మొదలైన వాయువులన్నిటిని గ్రీస్ హౌస్ గ్యాసెస్ అంటారు. (భూమిని వేడెక్కించే వాయువులు అంటారు).

  • శిలాజ ఇంధనాన్ని (పెట్రోల్, డీజిల్, కిరోసిస్) మండిస్తే CO తో బాటు 50, మొదలైన వాయువులు విడుదలై గాలిలో కలుస్తాయి.
  • బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు COz, నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతాయి.
  • శిలాజ ఇంధనాన్ని (పెట్రోల్, డీజిల్, కిరోసిస్) మండిస్తే CO తో బాటు 50, మొదలైన వాయువులు విడుదలై గాలిలో కలుస్తాయి.
  • బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు COz, నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతాయి.
  • గాలిని చల్లబరిచే యంత్రాలు (కూలర్లు, ప్రిట్జ్ లు), లోహాన్ని కరిగించే కొలిమెల నుండి, ఆటోమొబైల్ యంత్రాల నుంచి హైడ్రో ఫ్లోరో కార్బన్లు విపరీతంగా గాలిలో కలుస్తున్నాయి.
  • పంట పొలాల పై చాల్లే క్రిమి నాశనుల నుండి క్లోరో ఫ్లోరో కార్బన్లు, మీథేన్ వాయువు గాలిలో కలుస్తున్నాయి.
Greenhouse Gases Effect

Greenhouse Gases Effect

Also Read: Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిసనింగ్ గురించి ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.!

  • ఈ వాయువులలో 50% CO2, 20% CO, 12% CFC, HFC, 12% మీథేన్, మిథనాల్, 7% నైట్రోజన్ ఆక్సైడ్లు, 11 % ఇతర వాయువులు వుంటాయి.
  • గ్రీస్ హౌస్ వాయువులు భూమి ఉపరితలం నుండి కొంత ఎత్తులో ఒక పొర లాగ ఏర్పడి సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు భూమిని తాకినప్పుడు భూమి అందులో కొంత వేడిని గ్రహించి మిగతా వేడిని పరారుణ, వికరణ రూపంలో అంతరిక్షం లోకి తిరిగి పంపిస్తుంది. భూగోళం పై పొరలాగా ఏర్పడిన గ్రీస్ హౌస్ వాయువులు ఆ వేడిని ఆపి మళ్ళీ భూమి పైకి పంపిస్తాయి. దీనివల్ల భూమి మరింత వేడెక్కుతుంది.

భూమి వేడెక్కడం వల్ల కలిగే నష్టాలు:

  • ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగి పోతాయి.
  • నదీ జలాలు ఉప్పు నీటి కయ్యలు గా మారుతాయి.
  • వాతావరణ మండలాలలో మార్పు వస్తుంది.

గ్రీన్ హౌస్ వాయువుల నివారణ:

  • సామాజిక వనాలు పెంచాలి.
  • మొక్కల వ్యర్ధాలు కాల్చకుండా కంపోస్టు గా మార్చాలి.
  • CFC విడుదల చేసే కూలర్లు, ఫ్రీట్జ్ లు, ఎయిర్ కండిషనర్లు స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • CO, NO, SO, వంటి వ్యర్ధ వాయువులను వాతావరణం లోకి పంపించే మోటారు వాహనాలను నియంత్రించాలి.
  • దక్షిణాసియా లో అధికం గా సాగయ్యే వరి పొలాల నుండి వెలువడే మీథేన్ వాయువు నియంత్రణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.

Also Read: Tobacco Cultivation: పొగాకు సాగుకు అనువైన నేలలు.!

Leave Your Comments

Problems in pulse production: పప్పు ధాన్యాల పంట సాగు లో సమస్యలు

Previous article

Grafting: అంటు మొక్కలు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like