Green manure చేనుకి చేవ రైతుకి అధిక లాభాన్నిచ్చేది పచ్చిరొట్ట ఎరువులు. రసాయనిక ఎరువులను తగ్గించటంతో పాటు నేల ఆరోగ్యం కాపాడటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట నిస్సారమ ఎరువులను ప్రోత్సహిస్తుంది. ఖరీఫ్ పంట కాలానికి ముందే జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయటం వల్ల భూసారం పెరుగుతుందని క్షేత్రస్థాయి ఫలితాలు లాభదాయక చెప్తున్నాయి.
వ్యవసాయంలో నిలకడగా రాణించాలన్నా, దీంట్లో న ఆశించిన దిగుబడులు సాధించాలన్నా ప్రతి రైతు భూసారం దున్నినప్పు కాపాడుకోవటంపై శ్రద్ధ చూపించాలి. విత్తిన విత్తు ఆరోగ్యంగా ఎదగాలన్నా, ఫలసాయం రావాలన్నా నేత సారం చాలా ముఖ్యం. చేలో ఎంత చేవ ఉంటే ఫలితం అంత నాణ్యంగా ఉంటుంది. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలను వాడుతూ రైతాంగం పచ్చిరొట్ట ఎరువులను సంవత్సరాలకొద్ది విస్మరిస్తున్నారు. కొందరు రైతులు మాత్రమే అక్కడక్కడా పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తున్నారు. పదే పదే రసాయనిక ఎరువుల పైన ఆధారపడితే పేరు భూభౌతిక స్థితి దెబ్బతిని మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల సేంద్రియ ఎరువులను విరివిగా వాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం సారాన్ని చేలో నింపటానికి రైతులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా వేసవి సమయంలో రైతులు పశువుల పెంటని పొలానికి తోలుతూ ఉంటారు. వేసవి దుక్కుల సమయంలో పొలంలో కలియదున్నుతున్నారు. కాని గ్రామాలలో పశుసంతతి తగ్గిపోవటంతో పశువుల ఎరువు కొరత తీవ్రంగా ఉంది. పశువుల ఎరువులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట పైర్లను పెంచి భూమిలో కలియదున్నాలి. ఈ పద్ధతి పాత పద్దతే అయినా ఏరువాకకి 40 రోజుల ముందు అనగా, మాగాణి ప్రాంతాలలో తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాలను భూమిలో చల్లి నెలన్నర తర్వాత కలియదున్నినట్లయితే నిస్సారమయిన పొలాల్లో సారం పెరగటంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు.
సాధారణంగా లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లు లాభదాయకంగా ఉంటాయి. వీటిలో జీలుగ చాలా ముఖ్యమైంది. పచ్చిరొట్ట పైర్ల వేర్లలో వేరుబుడిపెలుంటాయి. దీంట్లో నత్రజని ఉంటుంది. ఈ పైర్లను పొలంలో కలియ దున్నినప్పుడు నత్రజని సహజ సిద్ధంగా భూమికి అందుతుంది. జీలుగ పైరు లెగ్యూమ్ జాతికి చెందింది. సుమారుగా 1 నుండి 1.5 మీటర్ల ఎత్తుకి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 3.50 శాతం నత్రజని, 0.60 శాతం భాస్వరం మరియు 1.20 శాతం పొటాషియం లభ్యమవుతాయి. జీలుగ పైరును 40-45 రోజుల్లో కలియ దున్నవచ్చు. తద్వారా ఎకరానికి 10-12 టన్నుల పచ్చిరొట్ట భూమికి అందుతుంది. జీలుగ వేయటం ద్వారా భూమిలో పేరుకుపోయిన చౌడును తగ్గించవచ్చు. ఎకరం విస్తీర్ణంలో చల్లటానికి 12 కిలోల విత్తనం సరిపోతుంది.
వరి వేసేవారు వరి విత్తటం-నాటుకు మధ్య కాలంలో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవాలి. పూతదశలో అంటే 45 రోజుల తర్వాత కలియదున్నాలి. ఈ దశలోనే ఎందుకంటే పూతదశ తర్వాత మొక్కల కాండం గట్టిపడుతుంది. కాబట్టి అలాంటి మొక్కలను భూమిలో కలియదున్నినట్లయితే భూమిలో కుళ్ళిపోకుండా అలాగే మిగిలిపోతాయి. దున్నే సమయంలో ఎకరానికి 50-100. కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట తొందరగా చివుకుతుంది. పంటకి కావలసిన పోషకాలు త్వరగా అందుతాయి.
లాభాలు:
- పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలియదున్నటం ద్వారా హ్యూమిక్ ఆమ్లం మరియు అసిటిక్ ఆమ్లం విడుదల అవటం మూలంగా భూమి క్షారత్వం తగ్గుతుంది. దాని వల్ల ముందుగా ఏర్పడిన చౌడు సమస్యను తగ్గించుకోవచ్చు.
- భూమిలో సూక్ష్మక్రిముల రసాయనిక చర్యల మూలంగా పచ్చిరొట్ట మురగటం ద్వారా మొక్కకి కావల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్ వంటి మూలకాలు అందుబాటులోకి వస్తాయి.
- భూమి లోపలి పొరల్లో సూక్ష్మక్రిముల వృద్ధి జరిగి భూమి యొక్క భౌతిక లక్షణాలు మెరుగవుతాయి. 4. భూమిలో నీటిని నిలుపుకొనే సామర్థ్యంతో పాటుగా గాలి కదలిక కూడా మెరుగవుతుంది.
- భూభౌతిక పరిస్థితి మెరుగవటం మూలంగా నేల క్రమక్షయానికి గురికాకుండా ఉంటుంది.
- పచ్చిరొట్ట ఎరువుల వాడుక వలన కలుపు సమస్య కూడా తగ్గుతుంది.
- భూమిలో సేంద్రియ కర్బనం పెరగటం ద్వారా భూమిపై పొరలు గట్టిపడకుండా పంట ఎదుగుదలకి తోడ్పడుతుంది.