Green gram మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 8.17 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.36 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత ఎకరాకు 180 కిలోలు. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగా, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగా పండిస్తున్నారు. ప్రత్తిలో అంతర పంటగా పండించవచ్చు.
నేలలు: తేమను పట్టి ఉంచే భూముల్లో సాగు చేయవచ్చు. చౌడు నేలలు, మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.
పంటకాలం : పెసర తొలకరిలో, రబీ మరియు వేసవిలో పండిస్తారు. కొన్ని ప్రాంతాలలో వరి మాగాణు లలో పండిస్తారు.
అనుకూలమైన సమయం :
ఖరీఫ్: జూన్ 15 నుండి జూలై 10
రబీ : 10 సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఖరీఫ్ వరి తర్వాత : 10 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు (ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు)
వేసవి : ఫిబ్రవరి నుండి మార్చి 10 వరకు
సుమారు 65 రోజుల నుంచి 70 రోజుల వరకు కోతకు వచ్చే పంట. వివిధ రకాల చీడపీడలు పంటను దెబ్బతీసే అవకాశముంటుంది. ఇటువంటి ప్రతికూల కారణాల వలన ఆశించిన దిగుబడి రాకపోవడం జరుగుతుంది. రైతు సోదరులు సరైన సమయంలో సరైన సస్యరక్షణ మరియు యాజమాన్యం పాటించినట్లైతే అధిక దిగుబడులు సాధించవచ్చు.
పొగాకు లద్దె పురుగు
లక్షణాలు
పురుగులు ఆకుల్లోని పచ్చని అన్ని రకాల పదార్ధాన్ని గీకి తినటం వలన పరిస్థితులలో ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగా, పువ్వులను, పిందెలను తింటాయి. పురుగు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు| మొక్కల మొదళ్ళలో, భూమి నెర్రెలలోనికి చేరతాయి.
అనుకూల వాతావరణ పరిస్థితులు:
అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో వస్తాయి.
యాజమాన్యం:
- గ్రుడ్ల సముదాయాలను ఏరి వేస్తే మంచిది.
- జల్లెడగా మారి పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
- ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ కలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి.
- ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసి పురుగు ఉధృతి గమనించాలి.
- ఎకరాకు ఎన్.పి.వి. 200 యల్.ఇ., ద్రావణాన్ని సాయంకాలం పిచికారి చేయాలి.