Grape Cultivation: కొమ్మ కత్తిరించుట – ద్రాక్షలో కొమ్మలు కత్తిరించుట ముఖ్యమైన కార్యక్రమము. దీని వల్ల ద్రాక్ష త్వరగా పండ్లను ఇచ్చును. తీగను సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా ద్రాక్ష పంటను ఇవ్వదు. మన రాష్ట్రంలో సంవత్సరంకు 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో (పిబ్రవరి-ఏప్రిల్ 2 వ సారి శీతాకాలంలో (సెప్టెంబర్-అక్టోబర్), కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించుట వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడ తాయి. దీనినే (Backward pruning (or) foundation pruning) అంటారు.
Also Read: Grapes Disease: ద్రాక్ష పంటలో వచ్చే వ్యాధులకు నివారణ చర్యలు
సెప్టెంబర్-అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించుట వలన పూత ఏర్పడి కాపు ఇచ్చును. 2వ సారి కొమ్మ కత్తిరింపులలో కొమ్మపై ఉండే మొగ్గలు ద్రాక్ష రకంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అనబీ-ఇ- షాహి రకానికి 5-7 మొగ్గలు Thompson Seedless రకానికి 12 మొగ్గలు వుంచి కత్తిరించాలి. ఈ మాసాల్లో కత్తిరింపు కాపు కొరకు చేస్తారు. దీనిని ఫార్వర్డ్ లేదా (ఫ్రూట్ బడ్ ప్రూనింగ్) అంటారు.
ఎరువులు: ద్రాక్షకు ఎరువులను కత్తిరింపుకు ముందుగా వేసుకుంటారు. కత్తిరింపు చేయుటకు ముందు ద్రాక్ష మొక్క చుట్టూ 15-20 సెం.మీల లోతు మట్టిని తీసి మొదలుకు ఎగదోయాలి. మొదట పశువుల ఎరువును సమపాళ్ళలో ప్రతి చెట్టుకు సుమారు 100 గ్రా.. మరియు చెట్టూ చుట్టూ బోదెలు 75-100 సెం.మీల దూరంలో వేయాలి.
ద్రాక్ష గుత్తుల యొక్క పరిమాణం, నాణ్యత పెంచటం: థాంప్సన్ సీడ్స్లో పండు పరిమాణం మరియు నాణ్యత పెంచవలసినచో జిబ్బరిలిక్ యాసిడ్ అనే హార్మోనును పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 60 PPM జిబ్బరిలిక్ యాసిడ్ ద్రావణంలో ముంచాలి. దీని వలన 40-50 శాతం దిగుబడి పెరుగుతుంది. కాండంపై 0.5 నుండి 1 సెం.మీ వెడల్పు బెరడు తీయడం వలన పండ్ల పరిమాణం మరియు గుత్తి నాణ్యత కూడా వృద్ది అవుతుంది. ఈ పద్ధతినే గర్జిలింగ్ అంటారు.
Also Read: Grapes Disease: ద్రాక్ష పంటలో వచ్చే వ్యాధులకు నివారణ చర్యలు
కోత మరియు ప్యాకింగ్: ద్రాక్ష గుత్తుల పరిమాణం , నాణ్యత పెంచుటకై జిబ్బరిల్లిక్ ఆసిడ్ (CA) అను హార్మోన్ ను పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 50-60 PPM GA, ద్రావణంలో ఉంచుట వలన 30-50% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది.
ద్రాక్ష పండ్లు తీగపైనే పక్వమునకు వచ్చిన పిదప కోస్తారు. పండ్లు కోసిన పిదప దాని పక్వ దశలో ఏమార్పు రాదు. సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్న గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది. పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్లలో మొత్తం కరిగే ఘనపదార్థాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిస్తాం. బ్రిక్సిరీడింగ్ అనాబ్-ఇ-షాహి 15 to 16 డిగ్రీలు, మరియు థాంప్సన్ సీన్లెస్ 21-22 డిగ్రీలు/ రాగానే కోయవచ్చు.
దిగుబడి: దిగుబడి సాగు చేయవల్సిన రకం నేల మరియు ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో | అనబి-ఇ-షాహి 10-15 టన్నులు/ఎకరానికి, థామ్సన్ సీడ్స్ 6-8 టన్నులు/ ఎకరానికి దిగుబడి ఇస్తుంది.
Also Read: Pruning Grapes: ద్రాక్షలో కత్తిరింపులతో లాభాలు