Grafting: ప్రస్తుత కాలంలో పండ్లు మరియు పూల పెంపకం లేదా తోటపని కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదు, వృత్తిపరమైన రంగంగా మారింది. వృత్తి భాషలో దీనిని హార్టికల్చర్ అంటారు. ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది గొప్ప కెరీర్ ఎంపిక. ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ-పర్యావరణాలు ఉన్నాయి, ఇది వివిధ రకాల ఉద్యానవనాలు మరియు పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్‌హౌస్‌లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే పండ్లు మరియు కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా ఉండటానికి కారణం ఇదే.

Grafting
Also Read: Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిసనింగ్ గురించి ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.!
జాగ్రత్తలు:
గుంతలు త్రవ్వుట : మండు వేసవిలో అనగా ఏప్రిల్ – మే మాసాలలో గుర్తించిన ప్రదేశాలలో 1మీ. పొడవు 1.మీ. వెడల్పు 1 మీ. లోతు గుంతలు త్రవ్వాలి. వర్షాకాలంలో మురుగు నీరు నిలిచే ప్రాంతాల్లో అక్టోబరు – నవంబర మాసాల్లో నాటాలి.
గుంతలు నింపుట: గుంత త్రవ్వగా వచ్చిన పై మట్టి కి, అంటే ఒక పాలు మట్టికి, ఒక పాలు పశువులు ఎరువు, బంకనేల అయితే ఒక పాలు సన్నని యిసుక, 2 కిలోల వేపపిండి, కిలో సూపర్ ఫాస్పేట్, 100 గ్రా. లిండేన్ పొడి మందు కలిపి గుంతలు నింపాలి.
మొక్కలు నాటే విధానం:
- తక్కువ వర్షపాతం గల ప్రదేశాలలో, మెరక నేలలో వర్షాకాల ప్రారంభంలో మొక్కలు నాటాలి. అధిక వర్ష ప్రాంతంలో వల్లపు నేలలో ఆలస్యంగా (అక్టోబరు-నవంబరు) నాటుకోవాలి.
- ప్లాంటింగు బోర్డును ఉపయోగించి ఖచ్చితంగా సరళ రేఖలో ఉండేలా నాటాలి.
- సాయంత్రం వేళలో నాటాలి.
- మొక్క/ అంటు మొక్కలు భూమిలో ఎంత వరకు కప్పబడి ఉందో అంత లోతు వరకే పాతాలి.
- అంటు మొక్కలలో గ్రాఫ్ట్ జాయింట్ నేలలోకి పోకుండా చూడాలి.
- దృఢమైన కట్టెను ఊతంగా పాతాలి.
- నాటిన తర్వాత మొక్క చుట్టూ మట్టిని బాగా అదిమి కూరాలి.
- మొదటి సం. వరకు క్రమం తప్పకుండా నీరు యివ్వాలి.
- వేరు భాగం నుండి పెరిగే కొమ్మలను తొలగిస్తూ ఉండాలి.
- అవసరమైన దానికంటే 10% మొక్కలు ఎక్కువ తెచ్చి పెట్టి నీడలో ఉంచి నీరు చల్లుతూ ఉండాలి. మొదటి 2-3 నెలలో చనిపోయే మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు నాటినట్లయితే తోట అంతా ఒకే వయసు చెట్లతో ఉంటుంది.
Also Read: Tobacco Cultivation: పొగాకు సాగుకు అనువైన నేలలు.!