పశుపోషణమన వ్యవసాయం

Goat Plague Disease: మేకలలో ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది.!

2
Goat Plague Disease
Goat Plague Disease

Goat Plague Disease: మేకలలో మరియు గొర్రెలలో కలుగు ఒక ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధిలో తీవ్రమైన జ్వరం, ఆకలి లేకపోవుట, నోటిలో పుండ్లు, డయేరియా మరియు న్యూమోనియా లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.

ఈ వ్యాధి పారామిక్స్ గ్రూప్కు చెందిన మార్బిలి వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక Single standard, RNA virus. దీని చుట్టు ఎన్వలప్ ఉంటుంది. ఈ వైరస్కు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏపిథీలియల్ కణాలు మరియు లింఫోసైట్ కణాలలో పెరిగే గుణం అధికంగా కలదు.

మేకలు మరియు గొర్రెలు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. ఈ వ్యాధి పెద్ద వాటిలో తీవ్రంగా ఉండి, చిన్నవాటిలో మరింత ప్రమాదకరంగా మారి అధిక మరణాలను కలిగిస్తుంటుంది. ఈ వ్యాధి యందు morbidity 50 – 85% వుండి, Mortality కూడా 50 – 90% ఉంటుంది.

Also Read: Listeriosis Disease in Goats: మేకలలో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం.!

Goat Plague Disease

Goat Plague Disease

వ్యాధి వచ్చు మార్గం:- ఈ వ్యాధి కారక వైరస్లు వ్యాధి గ్రస్త పశువు యొక్క మల మూత్రంలో, ముక్కు నుండి మరియు కంటి నుండి వచ్చే స్రావాలలో అధికంగా ఉంటుంది. ఫలితంగా వీటితో కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంటుంది. అంటువ్యాధి రూపంలో కూడా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంటుంది. గాలి ద్వారా కూడా కొన్ని సందర్భములలో ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి వ్యాప్తి చెందుట:- ఈ వైరస్కు లింఫోట్రోఫిక్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎపిథీలియోట్రోఫిక్, నీమోట్రోఫిక్ గుణం కలదు. పైన వివరించిన మార్గాల ద్వారా ఈ వైరస్ మేకలు లేదా గొర్రెల శరీరంలో ప్రవేశించి, శ్వాసనాళం దగ్గర ఉండే లింఫ్ నాళాలలో కి చేరుతాయి. అక్కడి నుండి రక్తంలో చేరి తమ సంఖ్యను వ్రుద్ధి చేసుకుంటాయి. ఫలితంగా “వైరిమియా” కలుగుతుంది. తరువాత ఈ వైరస్ నోటి కుహరం మీద ప్రభావం చూపడం వలన అక్కడ ఉన్న చర్మం తట్టలు తట్టలుగా ఊడిపోతూ ఉంటుంది.

ఫలితంగా నోటిలోని మ్యూకోజాలో అల్సర్లు తయారై ఉంటుంది. ప్రేగుల మీద ప్రభావం చూపి విరోచనాలు కలుగచేస్తుంది. ఈ వ్యాధి ఫలితంగా ప్రేగులలో ఇ. కోలై, కాక్సిడియా వంటి క్రిములు మరియు ఊపిరితిత్తులలో పాశ్చురెల్లా లాంటి క్రిములు పెరిగి ఈ వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం కలదు. ఊపిరి తిత్తుల మీద ప్రభావం చూపి న్యూమోనియాను కలుగచేస్తుంది. కంటి మీద ప్రభావం చూపి కంజెక్టివైటిస్ను కలుగచేస్తుంది.

ఈ వైరస్ నోటి మీద, ఊపిరితిత్తులు మీద, ప్రేగుల మీద ఒకేసారి ప్రభావం చూపి వ్యాధులను కలుగజేయుట మూలంగా ఈ వ్యాధిని స్టొమటైటిస్ న్యూమో ఎంటిరైటిస్ కాంప్లెక్స్ డిసీజ్ (Stomatitis pneumo enteritis complex disease) అని కూడా అంటారు.

Also Read: Smallpox in Goats: మేకలలో వచ్చే మశూచి వ్యాధి/ పాక్స్‌/బొబ్బ రోగం.!

Leave Your Comments

Threshing: వివిధ పద్ధతుల ద్వారా పంట నూర్పిడి ఎలా చేస్తారు.!

Previous article

Independence Day Diamond Jubilee Celebrations: వినూత్నంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు.!

Next article

You may also like