Goat Farming: భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి.

Goat Farming in India
ఆహారపు నిర్వహణ
- పచ్చికబయళ్లలో మేతతోపాటుగా శ్రద్ధగా పెట్టే దాణావల్ల ముమ్మరమైన ఎదుగుదల మాంసకృత్తులు సమ్మృద్ధిగా లభించే తుమ్మ,కస్సవె,లెకుయర్ని లాంటి ఆకుపచ్చటి దాణావల్ల ఆహారరూపములో నత్రజని బాగా లభిస్తుంది.
- రైతులు పొలం గట్లవెంబడి అగతి,సుబాబుల్,గ్లారిసిదియ చెట్లను పెంచి ఆకుపచ్చటి దాణాగా వాడవచ్చు.
- Also Read: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Goats
- ఒక్క ఎకరం చేలో పండించే చెట్లు,ఇతరదాణా మొక్కలు 15-30 మేకలకు ఆహారంగా సరిపోతాయి.
- పిల్లలకు మొదటి పది వారాలు 50- 100 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. ఎదుగుతున్న వాటికి 100 -150 ద్రావణాన్ని ప్రతిరోజూ 3-10 నెలలపాటు ఇవ్వాలి.

Goat Farming
- సూడి మేకలకు రోజూ 200 గ్రాముల ద్రావణాలను ఇవ్వాలి. ఒక కిలోగ్రాము పాలిస్తున్న మేకలకు 300 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. మేకలపాకల్లో ఖనిజాలదిమ్మలను మంచిరాగితో ( 950-1250 పిపియం) ఏర్పాటు చెయ్యాలి.
Also Read: ఉస్మానాబాద్ మేక పాలతో సబ్బుల తయారీ
Leave Your Comments