ఉద్యానశోభమన వ్యవసాయం

Fruit production: పండ్ల తోటల నుండి ఆశించిన దిగుబడులు రావాలంటే రైతులు వీటిని పాటించండి

0

Fruit production ప్రస్తుత కాలంలో పండ్లు మరియు పూల పెంపకం లేదా తోటపని కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదు, వృత్తిపరమైన రంగంగా మారింది. వృత్తి భాషలో దీనిని హార్టికల్చర్ అంటారు. ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది గొప్ప కెరీర్ ఎంపిక. ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ-పర్యావరణాలు ఉన్నాయి, ఇది వివిధ రకాల ఉద్యానవనాలు మరియు పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్‌హౌస్‌లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే పండ్లు మరియు కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా ఉండటానికి కారణం ఇదే.

  • మనం వేయాలనుకున్న ఫలజాతి కి అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఆ ప్రాంతంలో వర్షపాతపు తీరు, గాలి ఉధృతం వేడిగాలుల బెడద మొదలైన విషయాలను కూలంకుషంగా పరిశీలించాలి.
  • ఆ ప్రాంతంలోని యితర రైతులు అదే ఫలజాతి తోటలను వేసినట్లయితే వారి అనుభవాలను సేకరించాలి.

  • భూసార పరీక్షలు జరిపించి, వేయబోయే ఫలజాతులకు నేలలు అనుకూలమా కాదా అని నిర్ధారించాలి. నేలలోతు కనీసం రెండు మీటర్లుండాలి. కనీసం 2 మీ., దిగువ నీటి మట్టం ఉంటేనే ఆ నేల పండ్ల తోటల సాగుకు పనికి వస్తుంది.
  • వీలయినంత దగ్గర్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉన్నట్లయితే రవాణా ఖర్చులు తగ్గటమే కాక రవాణాలో కాయ దెబ్బ తినక పండ్లు త్వరగా కొనుగోలు దారుకు చేరే అవకాశం ఉంది.
  • మంచి రోడ్లు, రవాణా సదుపాయాలు, శీతలీకరణ సదుపాయంలో గల ట్రక్కులు అందుబాటులో ఉండాలి.
  • పండ్ల తోటకు దగ్గరలో విద్యుత్ లైను ఉంటే మంచిది.

  • ఇతరులు వేసిన పండ్ల తోటలు దగ్గరగా ఉంటే అనేక సదుపాయాలు సహకార ప్రాతిపదికన తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
  • కావల్సినంత మంది కూలీలు అందుబాటులో ఉండాలి.
  • అంటు మొక్కలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉండాలి.
  •  చివరగా తోట భూమి తక్కువ ఖరీదులో లభించాలి.
Leave Your Comments

CHEMICAL AND ORGANICE FERTILIZERS: సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్ధ వంతం గా ఉపయోగించడానికి రైతులకు సూచనలు

Previous article

Teak cultivation: టేకు సాగు లో మెళుకువలు

Next article

You may also like